కొత్త టీమ్ కదా అని తక్కువ అంచనా వేయకండి... ఫ్రాంఛైజీలకు హార్ధిక్ పాండ్యా వార్నింగ్...

Published : Mar 13, 2022, 07:18 PM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో కొత్తగా ఎంట్రీ ఇస్తున్న రెండు జట్లలో గుజరాత్ టైటాన్స్ ఒకటి. కెఎల్ రాహుల్‌ని కెప్టెన్‌గా ఎంచుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌తో పోలిస్తే గుజరాత్ టైటాన్స్‌పై ఏ మాత్రం అంచనాలు లేవు. 

PREV
110
కొత్త టీమ్ కదా అని తక్కువ అంచనా వేయకండి... ఫ్రాంఛైజీలకు హార్ధిక్ పాండ్యా వార్నింగ్...

గుజరాత్ టైటాన్స్ కనీసం ఆఖరి ప్లేస్‌లో మిగలకుండా తప్పించుకున్నా గ్రేటే అని అంచనా వేస్తున్నారు కొందరు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్. అయితే హార్ధిక్ పాండ్యా మాత్రం కొత్త టీమ్ కదా అని మమ్మల్ని తక్కువ అంచనా వేయొద్దంటూ మిగిలిన జట్లను హెచ్చరిస్తున్నాడు...

210

ఐపీఎల్ 2022 సీజన్‌కి సంబంధించి కొత్త ప్రోమోను విడుదల చేసింది స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్. ఇందులో బాంబ్ స్క్వార్డ్ ఎక్స్‌పర్ట్‌గా కనిపించాడు హార్ధిక్ పాండ్యా. 

310

 బాంబ్ రెఫ్యూజ్ చేయడానికి వెళ్లిన ఇద్దరు సిబ్బంది, కొత్త వైర్లను కట్ చేస్తామని చెప్పడం, హార్దిక్ పాండ్యా వద్దని వారిస్తున్నా వినకుండా వాటిని కట్ చేయడం... బాంబ్ పేలిపోవడం జరుగుతుంది. 

410

‘కొత్త వాటిని తక్కువ అంచనా వేయకండి. కొత్త వాటిని కట్ చేయాలని చూస్తే 100 బాంబులను పేల్చిన విధ్వంసం జరుగుతుంది...’ అంటూ కామెంట్ చేశాడు హార్ధిక్ పాండ్యా. 

510

ఐపీఎల్ 2022 సీజన్‌లో గ్రూప్ బీలో ఉన్న గుజరాత్ టైటాన్స్... రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లతో రెండేసి మ్యాచులు ఆడనుంది.
 

610

మార్చి 28న వాంఖడే స్టేడియంలో మరో కొత్త జట్టు లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్ ద్వారా ఐపీఎల్ 2022 సీజన్‌ను ప్రారంభించనుంది గుజరాత్ టైటాన్స్...

710

టీమిండియా మాజీ బౌలర్ ఆశీష్ నెహ్రా హెడ్‌ కోచ్‌గా వ్యవహరించే గుజరాత్ టైటాన్స్‌... ఆఫ్ఘాన్ సంచలనం రషీద్ ఖాన్‌ని రూ.15 కోట్లకు, శుబ్‌మన్ గిల్‌ను రూ.8 కోట్లకు డ్రాఫ్ట్‌లుగా కొనుగోలు చేసింది...

810

వీరితో పాటు డేవిడ్ మిల్లర్, వృద్ధిమాన్ సాహా, మాథ్యూ వైడ్, విజయ్ శంకర్, రాహుల్ తెవాటియా, జయంత్ యాదవ్, మహ్మద్ షమీ, లూకీ ఫర్గూసన్ వంటి అంతర్జాతీయ అనుభవం ఉన్న స్టార్లు.. గుజరాత్ టైటాన్స్‌లో ఉన్నారు. 

910

లూకీ ఫర్గూసన్‌ని రూ.10 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన గుజరాత్ టైటాన్స్, రాహుల్ తెవాటియాని రూ.9 కోట్లకు కొనుగోలు చేసింది. మహ్మద్ షమీని రూ.6.25 కోట్లకు, అభినవ్ సదరంగనీని రూ.2.6 కోట్లకు, ఆర్ సాయి కిషోర్‌ని రూ.3 కోట్లుకు, యష్ దయాల్‌ని రూ.3.2 కోట్లకు కొనుగోలు చేసింది...

1010

గుజరాత్ టైటాన్స్‌కి ఎంపికైన ఇంగ్లాండ్ బ్యాటర్ జాసన్ రాయ్, వ్యక్తిగత కారణాలతో ఐపీఎల్ 2022 సీజన్‌కి దూరం కాగా అతని స్థానంలో ఆఫ్ఘాన్ యంగ్ వికెట్ కీపర్, ఓపెనర్ రహ్మనుల్లా గుర్భాజ్‌ను తీసుకుంది గుజరాత్ టైటాన్స్... 

Read more Photos on
click me!

Recommended Stories