ఐపీఎల్‌లో అత్యధిక వికెట్లు తీసిన బౌలర్లలో అమిత్ మిశ్రా ఒకడు. 154 ఐపీఎల్ మ్యాచుల్లో 166 వికెట్లు తీసిన అమిత్ మిశ్రా, 2008 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఆడుతున్న ప్లేయర్లలో ఒకడిగా ఉన్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్, డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లకి ఆడిన అమిత్ మిశ్రాని ఐపీఎల్ 2022 మెగా వేలంలో ఏ ఫ్రాంఛైజీ కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు...
ఐపీఎల్‌లో 166 వికెట్లు తీసినా, టీమిండియా తరుపున అనుకున్నన్ని అవకాశాలు మాత్రం దక్కించుకోలేకపోయాడు అమిత్ మిశ్రా. ఓవరాల్‌గా 22 టెస్టులు, 36 వన్డేలు, 8 టీ20 మ్యాచులు మాత్రమే ఆడిన అమిత్ మిశ్రా, ఓవరాల్‌గా 154 వికెట్లు తీశాడు...
210
క్రీజులో కంటే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టీవ్‌గా ఉండే అమిత్ మిశ్రా... చాలా సందర్భాల్లో భారత లెజెండరీ క్రికెటర్లుగా పేరు తెచ్చుకున్న ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను ట్రోల్ చేశాడు...
310
ఆర్‌సీబీ, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన మ్యాచ్ గురించి ట్వీట్ చేసిన అమిత్ మిశ్రా, ఆ మ్యాచ్‌తో సంబంధం లేని రోహిత్ శర్మను తీసుకొచ్చి ప్రస్తావించడంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే జరిగింది.
410
‘ఐదు ఇన్నింగ్స్‌ల్లో హసరంగ నాలుగోసారి సంజూ శాంసన్‌ని అవుట్ చేశాడు. నేను ఎవరిని ఎక్కువసార్లు అవుట్ చేశానో తెలుసా... నా గుడ్ ఫ్రెండ్ రోహిత్ శర్మ (7 సార్లు). అతను చాలా మంచోడు...’ అంటూ ట్వీట్ చేశాడు అమిత్ మిశ్రా...
510
తానో గొప్ప స్పిన్నర్ అని, రోహిత్ లాంటి ప్లేయర్‌నే 7 సార్లు అవుట్ చేసిన తనను ఫ్రాంఛైజీలు పట్టించుకోవడం లేదని అమిత్ మిశ్రా తెగ ఫీలైపోవడం వల్లే ఈ ట్వీట్ వేశాడంటూ కామెంట్లు చేశారు నెటిజన్లు...
610
తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ వయసుని ట్రోల్ చేశాడు అమిత్ మిశ్రా. ఓ అభిమాని, ‘సర్.. దయచేసి సీఎస్‌కేలోకి రండి...’ అంటూ అమిత్ మిశ్రాని కోరాడు...
710
దానికి మిశ్రా... ‘సారీ మేట్, నేను అందుకు ఇంకా రెండేళ్లు చిన్నోడిని...’ అంటూ కామెంట్ చేశాడు. అమిత్ మిశ్రా వయసు ప్రస్తుతం 39 ఏళ్లు. సీఎస్‌కే మాజీ కెప్టెన్ ఎమ్మెస్ ధోనీ వయసు 41 ఏళ్లు...
810
అమిత్ మిశ్రా, పియూష్ చావ్లా, ఇషాంత్ శర్మ, సురేష్ రైనా వంటి సీనియర్ల వయసు అయిపోవడం వల్లే వారిని ఫ్రాంఛైజీలు కొనుగోలు చేయడానికి ఇష్టపడడం లేదనేది అందరికీ తెలిసిన విషయమే...
910
దాంతో 41 ఏళ్ల ఎమ్మెస్ ధోనీ, సీఎస్‌కేలో కీ ప్లేయర్‌గా ఉండడాన్ని జీర్ణించుకోలేక అమిత్ మిశ్రా, ఇలా మాహీ వయసును ట్రోల్ చేశాడని అంటున్నారు అభిమానులు...
1010
41 ఏళ్ల వయసులో ఇమ్రాన్ తాహీర్‌ని ఆడించిన సీఎస్‌కే, అంబటి రాయుడు, మొయిన్ ఆలీ, డీజే బ్రావో వంటి సీనియర్లను ప్రస్తుతం జట్టులో పెట్టుకుంది. దీన్నే మిశ్రా పరోక్షంగా ట్రోల్ చేశాడని అంటున్నారు సీఎస్‌కే ఫ్యాన్స్...