IPL 2022: అదే మా జట్టును ముంచుతోంది.. మార్పులు తథ్యం : ముంబై కోచ్ మహేళ షాకింగ్ కామెంట్స్

Published : Apr 25, 2022, 02:43 PM IST

Mumbai Indians: ఐపీఎల్  లో మునుపెన్నడూ లేనంతగా అత్యంత చెత్త ఆటతీరుతో  వరుసగా 8 ఓటములతో  అట్టడుగున నిలిచిన ముంబై ఇండియన్స్ పై  ఆ జట్టు అభిమానులే కాదు హెడ్ కోచ్ కూడా గుర్రుగానే ఉన్నాడు.  ఇది తీవ్రంగా ఆందోళన చెందాల్సిన విషయమని కీలక వ్యాఖ్యలు చేశాడు. 

PREV
110
IPL 2022: అదే మా జట్టును ముంచుతోంది.. మార్పులు తథ్యం : ముంబై కోచ్ మహేళ షాకింగ్ కామెంట్స్

గతంలో ఎప్పుడూ లేనంతగా వరుసగా 8 మ్యాచులు ఓడిన ముంబై ఇండియన్స్ ఆటతీరుపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. తక్కువ  స్కోర్లను ఛేదించడానికి కూడా  ముంబై బ్యాటర్లు నానా తంటాలు పడుతున్నారు. ఇక బౌలింగ్ కూడా అంతంతమాత్రమే. 

210

ఈ నేపథ్యంలో  ముంబై జట్టులో భారీ మార్పులు చేయాలని.. మొత్తం ప్రక్షాళన చేయాల్సిన సమయం ఆసన్నమైందని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యంగా బ్యాటర్లపై  ఆ జట్టు అభిమానులు ఆగ్రహంగా ఉన్నారు. 

310

ఈ నేపథ్యంలో  ముంబై ఇండియన్స్ హెడ్ కోచ్ మహేళ జయవర్దనే ఆసక్తికర కామెంట్స్ చేశాడు.  తమ జట్టు బ్యాటింగ్  ముంబైకి ఆందోళనకరమని అన్నాడు. జట్టు బ్యాటింగ్ ఆర్డర్ లో మార్పులు తప్పవని హింట్ ఇచ్చాడు. 

410

లక్నోతో మ్యాచ్ అనంతరం మహేళ మాట్లాడాడు. ఈ సందర్భంగా విలేకరులు.. ‘మీ జట్టు బ్యాటింగ్ వైఫల్యమే ఓటములకు కారణమా..?’ అని అడిగారు. దీనికి అతడు స్పందిస్తూ..‘మంచి ప్రశ్న. ఈ విషయంలో నేను కూడా ఓసారి రివ్యూ  చేసుకోవాలి.  మిగిలిన కోచ్ లతో కలిసి మాట్లాడి  కొన్ని ప్రణాళికలు తయారుచేయాలి. 

510

మా జట్టు  బ్యాటింగ్ మాకు అత్యంత ఆందోళనకరం. తమకు సహకరించని పిచ్ ల మీద  బ్యాటింగ్ చేయకపోవడమంటే దాన్లో అర్థముందని గానీ  మిగతా జట్ల బ్యాటర్లు చెలరేగి ఆడుతున్న పిచ్ ల మీద మా జట్టు ఆటగాళ్లు విఫలమవడమనేది  అంత తేలిగ్గా కొట్టిపారేయాల్సిన విషయం కాదు. 

610

జట్టులో ఉన్నవారిలో చాలా మందికి ఇక్కడి పరిస్థితులు, పిచ్ ల గురించిన పూర్తి అవగాహన ఉంది. దీనిపై మేం దృష్టి సారిస్తాం. అవసరమైతే బ్యాటింగ్ ఆర్డర్ లో పలు మార్పులు చేస్తాం.. రాబోయే మ్యాచులలో మీరు అది చూస్తారు..’ అని చెప్పుకొచ్చాడు. 

710

అంతేగాక  బ్యాటింగ్ లో ఇప్పటికే తాము కొన్ని మార్పులు చేశామని, రాబోయే మ్యాచులలో జట్టులో  నిలకడగా ఆడే బ్యాటర్ల కోసం మరిన్ని చేస్తామని మహేళ తెలిపాడు. దానిని బట్టి టాస్ గెలిచినప్పుడే తాము ముందు బ్యాటింగ్ చేయాలా..? లేక బౌలింగ్ చేయాలా..? అనేదాని మీద కూడా  నిర్ణయం తీసుకుంటామని చెప్పుకొచ్చాడు.

810

ఈ సీజన్ ముంబై బ్యాటర్లు దారుణంగా విఫలమవుతున్నారు. సారథి రోహిత్ శర్మ.. 8 మ్యాచులాడి 153 పరుగులు చేశాడు. సగటు (19.13) దారుణంగా ఉంది.  ఇక  మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా 8 మ్యాచులలో 199 రన్స్ సాధించాడు. 

910

సూర్యకుమార్ యాదవ్ (6 మ్యాచులలో 239 రన్స్) కాస్త మెరుస్తున్నా మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ ఆడటం లేదు. కీరన్ పొలార్డ్.. 8 మ్యాచులలో 115 పరుగులు మాత్రమే చేశాడు. కొత్త కుర్రాడు డెవాల్డ్ బ్రెవిస్.. 6 మ్యాచులలో 124 పరుగులు చేశాడు.  క్రీజులో ఎక్కువ సేపు నిలవడంలో అతడు విఫలమవుతున్నాడు.  

1010

తిలక్ వర్మ (8 మ్యాచులు 272 రన్స్) నిలకడగా రాణిస్తున్నాడు. కాగా.. మహేళ తాజా వ్యాఖ్యలతో రాబోయే మ్యాచులకు గాను ముంబై బ్యాటింగ్  ఆర్డర్ లో ఏ మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాల్సి ఉంది. 

click me!

Recommended Stories