జడ్డూ.. మనకెందుకొచ్చిన కెప్టెన్సీ చెప్పు! అటు బ్యాటింగ్‌లో, ఇటు ఫీల్డింగ్‌లో అట్టర్ ఫ్లాప్ అవుతూ...

First Published Apr 26, 2022, 12:03 PM IST

రవీంద్ర జడేజా... ఒకే ఒక్క ఓవర్‌లో మ్యాచ్‌ని మలుపు తిప్పగల ఆల్‌రౌండర్. గత సీజన్‌లో సీఎస్‌కే విజయాల్లో కీలక రోల్ పోషించిన జడ్డూ... ఫీల్డింగ్‌లో, బ్యాటింగ్‌లో మెరుపులు మెరిపించాడు. సీఎస్‌కే ఆడిన ప్రతీ గేమ్‌లోనూ జడ్డూ ఇంపాక్ట్ స్పష్టంగా కనిపించింది...

ఐపీఎల్ 2022 సీజన్‌కి ముందు సీఎస్‌కే సారథ్య బాధ్యతలు తీసుకునేందుకు తెగ ఉరుకులాడాడు జడ్డూ. ఎమ్మెస్ ధోనీ తర్వాత చెన్నై కెప్టెన్ తానేనంటూ బహిరంగంగానే చాలా సార్లు ప్రకటించాడు.

అయితే ఆ ఉత్సాహం మొత్తం సీజన్ ఆరంభమయ్యాక ఊసురుమంది. ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా ఆడిన మొదటి 8 మ్యాచుల్లో 6 పరాజయాలు అందుకున్నాడు జడ్డూ....

Latest Videos


ఆ గెలిచిన రెండు మ్యాచుల క్రెడిట్ మాహీ ఫ్యాన్స్, ధోనీ ఫినిషింగ్ కారణంగా అతని ఖాతాలోకే వెళ్లింది. కెప్టెన్‌గా ఫెయిల్ అవ్వడమే కాకుండా కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత రవీంద్ర జడేజా ఒరిజినల్ గేమ్ స్టైల్ పూర్తిగా నాశనమైంది...

ఫీల్డింగ్‌తో చిత్రవిచిత్ర విన్యాసాలు చేస్తూ క్యాచులు అందుకున్న రవీంద్ర జడేజా... చేతుల్లోకి వచ్చిన క్యాచులను ఒడిసిపట్టుకోలేకపోతున్నాడు. అసలు జడ్డూ ఉంటే ఫీల్డ్‌లో కనిపించే జోష్, ఇప్పుడు కనిపించడం లేదు.

పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సీఎస్‌కే విజయానికి ఆఖరి 4 ఓవర్లలో 47 పరుగులు కావాలి. క్రీజులో రవీంద్ర జడేజా, ఎమ్మెస్ ధోనీ వంటి గ్రేట్ ఫినిషర్లు ఉన్నారు. 

Jadeja

గత సీజన్‌లో పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్ వేసిన ఓవర్‌లోనే వీరవిహారం చేసి 37 పరుగులు రాబట్టాడు జడ్డూ. అలాంటి నాలుగు ఓవర్లలో 47 అంటే, సీఎస్‌కే ఈజీగా గెలుస్తుందని అనుకున్నారంతా...

Ravindra Jadeja

అయితే మాహీతో పాటు రవీంద్ర జడేజా కూడా డెత్ ఓవర్లలో షాట్స్ ఆడకుండా సింగిల్స్ తీస్తూ కాలక్షేపం చేశారు. ఇన్నింగ్స్ 17, 18వ, 19వ ఓవర్లలో కలిపి 20 పరుగులు మాత్రమే వచ్చాయి. 

ఈ మూడు ఓవర్లలో జడేజా తన బ్యాటుకి పని చెప్పి... రెండు, మూడు సిక్సర్లు బాది ఉంటే మ్యాచ్ రిజల్ట్ మరోలా ఉండేది. ఆఖరి ఓవర్‌లో చేయాల్సిన టార్గెట్ తక్కువగా ఉండి, సీఎస్‌కే ఈజీ విక్టరీ సాధించేదని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్..

కెప్టెన్సీ తీసుకుంటే నెమ్మదిగా ఆడాలి? చూసుకుని జాగ్రత్తగా ఆడాలి... అని ఎమ్మెస్ ధోనీ నుంచి పాఠాలు నేర్చుకున్నట్టుగా జడ్డూ తన స్ట్రైల్‌ని మార్చుకుని ఆడడం క్రికెట్ ఫ్యాన్స్‌కి ఏ మాత్రం నచ్చడం లేదు. 

దీనికంటే కెప్టెన్సీ వదిలేసి పాత జడ్డూలా మెరుపు ఫీల్డింగ్ విన్యాసాలు, భారీ షాట్లు ఆడుతూ మ్యాచ్‌లను గెలిపిస్తే చాలని అంటున్నారు సీఎస్‌కే ఫ్యాన్స్..

click me!