బ్యాటింగ్‌లో ఫెయిల్, బౌలర్లపై విమర్శలు! అప్పుడు రోహిత్ శర్మ, ఇప్పుడు రవీంద్ర జడేజా ఒకే మాట...

First Published Apr 26, 2022, 11:44 AM IST

ఐపీఎల్ 2022 సీజన్‌లో కెప్టెన్‌గా కొత్త అవతారం ఎత్తిన ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా... సారథిగా ఏ మాత్రం మెప్పించలేకపోతున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు తీసుకున్న తర్వాత అటు బ్యాటింగ్‌లోనూ, ఫీల్డింగ్‌లోనూ, బౌలింగ్‌లోనూ రాణించలేకపోతున్నాడు జడేజా...

ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ వరుసగా 8 మ్యాచుల్లో ఓడి, ప్లేఆఫ్స్ రేసు నుంచి నిష్కమించింది. మిగిలిన ఆరు మ్యాచుల్లో ఆరూ గెలిచినా ముంబైకి ప్లేఆఫ్స్ చేరే అవకాశం ఉండదు...

ఇక డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ పరిస్థితి కూడా ఏ మాత్రం బెటర్‌గా లేదు. ఆడిన 8 మ్యాచుల్లో 2 విజయాలు అందుకున్న సీఎస్‌కే, ఆరు మ్యాచుల్లో ఓడింది...

Latest Videos


Image Credit: Getty Images (File Photo)

రవీంద్ర జడేజా టీమ్ ప్లేఆఫ్స్ చేరాలంటే మిగిలిన ఆరు మ్యాచుల్లో గెలిచి తీరాల్సిందే. ఒక్క మ్యాచ్ ఓడినా చెన్నై సూపర్ కింగ్స్ కూడా అస్సాం ట్రైన్ ఎక్కుతుంది...

ఈ సీజన్‌లో కెప్టెన్‌ రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో చెప్పుకోదగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. అతనితో పాటు మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా వరుసగా ఫెయిల్ అవుతున్నాడు... 

రూ.8 కోట్లు పెట్టి కొన్న టిమ్ డేవిడ్‌ని రిజర్వు బెంచ్‌కే పరిమితం చేసిన ముంబై ఇండియన్స్, డేవాల్డ్ బ్రేవిస్‌కి కొన్ని అవకాశాలు ఇచ్చింది. యంగ్ ప్లేయర్లు తిలక్ వర్మ, బ్రేవిస్ ఆకట్టుకున్నా... అనుభవలేమి కారణంగా మ్యాచ్‌లను ఫినిష్ చేయలేకపోతున్నారు...

అయితే ముంబై ఇండియన్స్ వైఫల్యానికి బౌలర్లే ఎక్కువ ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు చెన్నై సూపర్ కింగ్స్ ఫెయిల్యూర్‌ని కూడా బౌలర్లపైనే నెట్టేశాడు రవీంద్ర జడేజా...

‘పిచ్ బ్యాటింగ్‌కి పెద్దగా సహకరించడం లేదు. ఇలాంటి పిచ్‌పై 150-160 పరుగుల స్కోరే చాలా కష్టంగా ఉంటుంది. అలాంటి బౌలర్లు ఏకంగా 180+ పరుగులు ఇచ్చారు. ఇదే మేం ఓడిపోవడానికి కారణమైంది...’ అంటూ కామెంట్ చేశాడు రవీంద్ర జడేజా...

వాస్తవానికి చెన్నై సూపర్ కింగ్స్ ఈ సీజన్‌లో ఫీల్డింగ్‌లో ఘోరంగా విఫలమవుతోంది. బెస్ట్ ఫీల్డర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రవీంద్ర జడేజా కూడా  చేతుల్లోకి వచ్చిన క్యాచులను నేలపాలు చేశాడు... ఈ సీజన్‌లో అత్యధిక క్యాచులు నేలపాలు చేసిన జట్టుగా టాప్‌లో నిలిచింది సీఎస్‌కే.

అదీకాకుండా 4 ఓవర్లలో 47 పరుగులు కావాల్సిన దశలో అంబటి రాయుడు, రవీంద్ర జడేజా, ఎమ్మెస్ ధోనీ సింగిల్స్ తీస్తూ కాలక్షేపం చేశారు. ఇన్నింగ్స్ 17, 18వ, 19వ ఓవర్లలో కలిపి 20 పరుగులు మాత్రమే వచ్చాయి. 

ఈ మూడు ఓవర్లలో జడేజా తన బ్యాటుకి పని చెప్పి... రెండు, మూడు సిక్సర్లు బాది ఉంటే మ్యాచ్ రిజల్ట్ మరోలా ఉండేది. ఆఖరి ఓవర్‌లో చేయాల్సిన టార్గెట్ తక్కువగా ఉండి, సీఎస్‌కే ఈజీ విక్టరీ సాధించేదని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్..

click me!