నీకు రెండే మ్యాచుల్లో ఛాన్స్ ఇస్తా, ఆడకపోతే తీసి పక్కనబెడతా... ఆవేశ్ ఖాన్‌ని బెదిరించిన రిషబ్ పంత్...

Published : Mar 25, 2022, 01:57 PM IST

ఐపీఎల్ 2021 సీజన్ ద్వారా వెలుగులోకి వచ్చిన యంగ్ పేసర్లలో ఆవేశ్ ఖాన్ ఒకడు. ఐపీఎల్ 2021 సీజన్‌లో 16 మ్యాచులు ఆడి 24 వికెట్లు తీసిన ఆవేశ్ ఖాన్, పర్పుల్ క్యాప్ విన్నర్ హర్షల్ పటేల్ తర్వాత అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచాడు...

PREV
18
నీకు రెండే మ్యాచుల్లో ఛాన్స్ ఇస్తా, ఆడకపోతే తీసి పక్కనబెడతా... ఆవేశ్ ఖాన్‌ని బెదిరించిన రిషబ్ పంత్...

ఐపీఎల్ 2021 సీజన్‌లో హర్షల్ పటేల్ కంటే మెరుగైన ఎకానమీతో బౌలింగ్ చేసి మెప్పించిన ఆవేశ్ ఖాన్... ఈసారి లక్నో సూపర్ జెయింట్స్ తరుపున ఆడబోతున్నాడు...
 

28

ఐపీఎల్ 2022 సీజన్ మెగా వేలంలో ఏకంగా రూ.10 కోట్లకు ఆవేశ్ ఖాన్‌ను కొనుగోలు చేసింది లక్నో టీమ్. వేలం ముగిసే సమయానికి అత్యంత ఖరీదైన అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ఉన్న ఆవేశ్ ఖాన్, ఈ మధ్యే అంతర్జాతీయ ఆరంగ్రేటం కూడా చేసేశాడు..
 

38

‘ఐపీఎల్ 2021 సీజన్ నా జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. గత సీజన్‌లో అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్‌గా నిలవడం చాలా ఆనందాన్నిచ్చింది...

48

నేను మూడేళ్లుగా ఢిల్లీ క్యాపిటల్స్‌లో ఉన్నాను, అయితే నాకు అవకాశాలు వచ్చింది తక్కువ. అంతకుముందు రెండు సీజన్లలో నేను ఆడింది రెండే మ్యాచులు..

58

నా టాలెంట్ చూపించడానికి నాకు ఛాన్సే రాలేదు. ఆఖరి సీజన్‌లో కూడా నాకు లక్కీగానే ఛాన్స్ వచ్చింది. కగిసో రబాడా, నోకియా మొదటి రెండు మ్యాచులకు అందుబాటులో లేరు...

68

ఇషాంత్ శర్మ గాయం కారణంగా తప్పుకున్నాడు. దీంతో నాకు అవకాశం వచ్చింది. రికీ పాంటింగ్, రిషబ్ పంత్... నాపై నమ్మకం ఉంచి, తుదిజట్టులో అవకాశం ఇచ్చారు...

78

నీకు రెండంటే రెండే ఛాన్సులు ఇస్తాను, నీ టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలి. ఆ తర్వాత నీ స్థానాన్ని నువ్వే కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక అంతా నీ చేతుల్లోనే ఉంది... అన్నాడు రిషబ్ పంత్...

88

రిషబ్ చెప్పిన మాటలు, నాలో కసిని రేపాయి. అందుకే మొదటి రెండు మ్యాచుల్లోనే నేనేంటో నిరూపించుకోవాలనుకున్నా. అనుకున్నట్టే నా స్థానాన్ని కాపాడుకోగలిగా...’ అంటూ కామెంట్ చేశాడు ఆవేశ్ ఖాన్...

Read more Photos on
click me!

Recommended Stories