IPL2021 SRH vs DC: మారింది వెన్యూ మాత్రమే, మనోళ్ల ఆట కాదు... కీలక మ్యాచ్‌లో సన్‌రైజర్స్ బ్యాట్స్‌మెన్ బోల్తా!

First Published Sep 22, 2021, 9:17 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ఇప్పటికే ఆరు పరాజయాలు అందుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్, కంఫర్టబుల్‌గా మరో ఓటమి ఖాతాలో వేసుకోవడానికి రెఢీ అయ్యింది... టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన సన్‌రైజర్స్, నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 134 పరుగులు మాత్రమే చేయగలిగింది...

చూసింది ఐపీఎల్ మ్యాచ్‌యేనా అనేలా నీరసం వచ్చేలా సాగింది సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇన్నింగ్స్... మొదటి ఓవర్‌ మూడో బంతికే డేవిడ్ వార్నర్‌ను డకౌట్ చేసిన నోకియా, సన్‌రైజర్స్ హైదరాబాద్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు... 

ఐపీఎల్‌లో చివరిసారిగా 2016లో డకౌట్ అయిన డేవిడ్ వార్నర్, 59 ఇన్నింగ్స్‌ల తర్వాత తొలిసారి పరుగులేమీ చేయకుండా పెవిలియన్ చేరాడు...

17 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 18 పరుగులు చేసిన వృద్ధిమాన్ సాహా, రబాడా బౌలింగ్‌లో శిఖర్ ధావన్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

ఆ తర్వాత 26 బంతుల్లో ఓ ఫోర్‌తో 18 పరుగులు చేసిన కేన్ విలియంసన్... అక్షర్ పటేల్ బౌలింగ్‌లో హెట్మయర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...

విలియంసన్ అవుటైన తర్వాత మూడో బంతికే మనీశ్ పాండే అవుట్ అయ్యాడు. 16 బంతుల్లో ఓ ఫోర్‌తో 17 పరుగులు చేసిన మనీశ్ పాండే, రబాడా బౌలింగ్‌లో అతనికే క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...

కేదార్ జాదవ్ 8 బంతుల్లో 3 పరుగులు చేయగా, జాసన్ హోల్డర్ ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు... 90 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది సన్‌రైజర్స్ హైదరాబాద్...

అబ్దుల్ సమద్, రషీద్ ఖాన్ కలిసి ఏడో వికెట్‌కి 25 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 21 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 28 పరుగులు చేసిన అబ్దుల్ సమద్, రబాడా బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు...

19 బంతుల్లో 2 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 22 పరుగులు చేసిన రషీద్ ఖాన్, ఆఖరి ఓవర్‌లో రనౌట్ కాగా, ఆఖరి బంతికి సందీప్ శర్మ రనౌట్ అయ్యాడు...

ఢిల్లీ క్యాపిటల్స్ బౌలర్లలో కగిసో రబాడాకి మూడు వికెట్లు దక్కగా నోకియా, అక్షర్ పటేల్‌లకు చెరో రెండు వికెట్లు దక్కాయి..

click me!