ఐపీఎల్ 2021 సీజన్‌లో 29 మ్యాచులు ముగిసిన తర్వాత కరోనా తాకిడి అలజడి క్రియేట్ చేసింది. కేకేఆర్ ప్లేయర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ పాజిటివ్‌గా తేలడంతో ఓ మ్యాచ్ వాయిదా పడింది.

అయితే ఆ తర్వాత సీఎస్‌కే, ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్లలోనూ పాజిటివ్ కేసులు వెలుగుచూడడంతో సీజన్ మొత్తం నిరవధిక వాయిదా పడింది.

క్రికెట్‌లో సమ్మర్ వెకేషన్‌గా భావించే ఏఫ్రిల్, మే సీజన్‌లో పూర్తికావాల్సిన ఐపీఎల్ 2021 అర్ధాంతరంగా నిలిచిపోవడంతో మిగిలిన మ్యాచులను ఎప్పుడు పెట్టాలి, ఎక్కడ పెట్టాలి? అనేది అర్థంకాని ప్రశ్నగా మారింది..

‘ఇప్పుడున్న పరిస్థితుల్లో భారత్‌లో ఐపీఎల్ నిర్వహించలేం. అసలు సీజన్‌ను ముగిస్తామా? లేదా? అనేది కూడా చెప్పలేని పరిస్థితి. మిగిలిన జట్ల క్రికెటర్లు కూడా అందుబాటులో ఉండాలి. వారి షెడ్యూల్‌ని కూడా చూసుకుని లీగ్ పూర్తిచేసేందుకు షెడ్యూల్ రూపొందించాలి’ అంటూ కామెంట్ చేశాడు బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ..

అయితే వచ్చే నెలలో ఇంగ్లాండ్ టూర్‌కి వెళ్తున్న టీమిండియా అక్కడ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌తో పాటు ఇంగ్లాండ్‌తో ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడనుంది...

అయితే వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్ ముగిసిన తర్వాత 40 రోజులకి పైగా ఖాళీగా గడుపుతోంది టీమిండియా. ఈ గ్యాప్‌లో ఐపీఎల్ 2021 సీజన్ సెకండాఫ్‌ను అక్కడే ముగించాలని బీసీసీఐ ఆలోచిస్తున్నట్టు సమాచారం...

‘ఇంగ్లాండ్ చాలా ఖరీదైన ప్రాంతం. ఇక్కడ మ్యాచుల నిర్వహణ చాలా ఖర్చులతో కూడుకున్నది. అయితే ఐపీఎల్‌లో లండన్‌లో కూడా మంచి క్రేజ్ ఉంది. అదీగాక అక్కడ స్పోర్ట్స్ ఈవెంట్లకు జనాలను అనుమతిస్తున్నారు.

ఖర్చు ఎక్కువైనా స్టేడియానికి ప్రేక్షకులు వస్తారు కాబట్టి ఆ టికెట్ల ద్వారా వచ్చే ఆదాయంతో బీసీసీఐకి లాభం వచ్చే అవకాశం ఉంది. లండన్‌తో పోలిస్తే, యూఏఈలో మ్యాచులు నిర్వహిస్తే, ఖర్చు తక్కువైనా అక్కడ 14 రోజుల క్వారంటైన్ రూల్ ఉండడం వల్ల తగినంత సమయం దొరకదు’ అంటూ ఐపీఎల్ యాజమాన్యం వ్యాఖ్యానించింది...

ఇంగ్లాండ్‌తో పాటు ఐర్లాండ్, ఆస్ట్రేలియా, యూఏఈ, శ్రీలంక వంటి దేశాలు, ఐపీఎల్ మ్యాచుల నిర్వహణకు ముందుకొచ్చాయి. అయితే శ్రీలంకలో మళ్లీ కరోనా కేసులు పెరుగుతున్నాయి. యూఏఈ, ఆస్ట్రేలియాలో నిర్వహిస్తే, ప్లేయర్లకు మళ్లీ క్వారంటైన్ ఏర్పాటుచేయాలి...

దీంతో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ కోసం ఇప్పటికే 24 మంది ప్లేయర్లు ఇంగ్లాండ్ చేరుకుని, క్వారంటైన్ గడుపుతున్నారు. న్యూజిలాండ్, ఇంగ్లాండ్ ప్లేయర్లు కూడా క్వారంటైన్ పూర్తిచేసుకుని ఉంటారు. కాబట్టి ఐపీఎల్ 2021 సీజన్ పూర్తిచేయొచ్చని బీసీసీఐ ఆలోచన...

ఆగస్టు 4 నుంచి ప్రారంభమయ్యే ఇంగ్లాండ్, భారత్ టెస్టు సిరీస్... సెప్టెంబర్ 15 వరకూ సాగుతుంది. అయితే ఐపీఎల్ 2021 సీజనను పూర్తిచేసేందుకు తగినంత సమయం కోసం ఈ టెస్టు సిరీస్‌ను కుదించాలని భావిస్తోందట బీసీసీఐ.

ఐదు మ్యాచుల సిరీస్‌కి బదులుగా నాలుగు టెస్టుల సిరీస్ నిర్వహించాలని బీసీసీఐ భావిస్తున్నట్టు, ఈ విషయమై ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డుతో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం..

అయితే ఇదే గ్యాప్‌లో శ్రీలంక టూర్‌కి యువ ప్లేయర్లతో కూడిన జట్టును పంపాలని భావిస్తోంది బీసీసీఐ. శ్రీలంకలో పర్యటించే ఈ జట్టు, అక్కడ మూడు వన్డేలు, టీ20 సిరీస్ ఆడనుంది.

దీంతో ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌ను త్వరగా ముగించే మిగిలిన గ్యాప్‌లో అయినా ఐపీఎల్ 2021 సీజన్‌లో మిగిలిన 31 మ్యాచులు పూర్తిచేయాలని భావిస్తోందట బీసీసీఐ. అయితే ఇంగ్లాండ్ బోర్డుతో జరుగుతున్న చర్చలు ముగిసిన తర్వాత దీనిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.