బోణీ కొట్టారు సరే, ఇలా ఆడితే టైటిల్ గెలవడం కష్టమే... ఆర్‌సీబీ పర్ఫామెన్స్‌పై ఫ్యాన్స్‌...

First Published Apr 10, 2021, 3:49 PM IST

IPL 2021 సీజన్‌ ఆరంభ మ్యాచ్‌లో 2 వికెట్ల తేడాతో గెలిచి, బోణీ కొట్టింది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. డెత్ ఓవర్ బౌలింగ్‌లో అదరగొట్టిన ఆర్‌సీబీ, బ్యాటింగ్‌లో మాత్రం ఆ రేంజ్ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది. మొత్తంగా ఆర్‌సీబీ ఆటతీరు విమర్శకులను, ఫ్యాన్స్‌ను నిరాశకు గురి చేసింది...

రోహిత్ శర్మ, క్రిస్ లీన్, సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, హార్ధిక్ పాండ్యా, పోలార్డ్, కృనాల్ పాండ్యా.. ఇలా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉన్న ముంబై ఇండియన్స్‌ను 159 పరుగులకే పరిమితం చేసి, అదరగొట్టారు ఆర్‌సీబీ బౌలర్లు...
undefined
ముఖ్యంగా డెత్ ఓవర్లలో ఆర్‌సీబీ బౌలింగ్ అద్భుతంగా ఆకట్టుకుంది. 16 ఓవర్ నుంచి 20 ఓవర్ మధ్యలో కేవలం 31 పరుగులే ఇచ్చిన రాయల్ ఛాలెంజర్స్ బౌలర్లు, 5 వికెట్లు పడగొట్టారు...
undefined
ఆఖరి ఓవర్‌ వేసిన హర్షల్ పటేల్ అయితే కెరీర్ బెస్ట్ స్పెల్ వేశాడు. మొదటి నాలుగు బంతుల్లో మూడు వికెట్లు తీసిన హర్షల్ పటేల్, 20వ ఓవర్‌లో ఒకే ఒక్క పరుగు ఇచ్చాడు...
undefined
ఐపీఎల్‌లో ఆఖరి ఓవర్‌లో అతి తక్కువ పరుగులు ఇచ్చి, మూడు వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు హర్షల్ పటేల్.
undefined
అయితే డిఫెండింగ్ ఛాంపియన్‌ ముంబైను స్వల్ప స్కోరుకే కట్టడి చేశామనే ధీమానో లేక ఈజీ టార్గెట్‌ను తేలిగ్గా కొట్టేయగలమనే కాన్ఫిడెన్స్ ఆర్‌సీబీ బ్యాటింగ్‌లో స్పష్టంగా కనిపించింది...
undefined
ఓపెనర్‌గా వచ్చిన సుందర్, వన్‌డౌన్‌లో వచ్చిన రజత్ పటిదార్ ఫెయిల్ అయినా విరాట్ కోహ్లీ, మ్యాక్స్‌వెల్ మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు...
undefined
అయితే విరాట్ కోహ్లీ అవుటైన తర్వాత మళ్లీ వరుస వికెట్లు కోల్పోయింది ఆర్‌సీబీ... మ్యాక్స్‌వెల్, షాబజ్ అహ్మద్, క్రిస్టియన్ అవుట్ కావడంతో మ్యాచ్ ఒక్కసారిగా ముంబై ఇండియన్స్ వైపు మళ్లింది...
undefined
ఎప్పటిలాగే ఆర్‌సీబీ కష్టాల్లో ఉన్నప్పుడు ఆపద్భాంధవుడిలా మారే ఏబీ డివిల్లియర్స్, తనదైన స్టైల్‌లో ఆడి రాయల్ ఛాలెంజర్స్‌ను ఆదుకున్నాడు...
undefined
సీజన్లు మారుతున్నా, ఆర్‌సీబీ బ్యాటింగ్ భారం మొత్తం విరాట్ కోహ్లీ, ఏబీ డివిల్లియర్స్ మోయాల్సి వస్తోంది. మొదటి మ్యాచ్‌లో మ్యాక్స్‌వెల్ ఆకట్టుకున్నా, ఈ విధంగా ఆడితే టైటిల్ గెలవడం మాత్రం అసాధ్యం...
undefined
యంగ్ ప్లేయర్ దేవ్‌దత్ పడిక్కల్ మంచి ఫామ్‌లో ఉన్నాడు. అతను జట్టులోకి రీఎంట్రీ ఇస్తే, బ్యాటింగ్ కష్టాలు కాస్త తీరొచ్చు. కానీ భారీ టార్గెట్ చేధించాలంటే బ్యాటింగ్ లైనప్ పటిష్టంగా ఉండాలి...
undefined
కోట్లు పెట్టి కొనుగోలు చేసిన ప్లేయర్లు, ఆల్‌రౌండ్ పర్ఫామెన్స్ ఆశిస్తోంది ఆర్‌సీబీ. అయితే రాయల్ ఛాలెంజర్స్‌కి మాత్రం ఆ కష్టాలు తీరడం లేదు...
undefined
సిరాజ్‌తో పాటు హర్షల్ పటేల్ అద్భుతంగా ఆకట్టుకున్నాడు. అతనితో పాటు రూ.15 కోట్లు పెట్టి కొన్న కేల్ జెమ్మీసన్ కూడా మొదటి మ్యాచ్‌లో మంచి పర్ఫామెన్స్ ఇచ్చాడు...
undefined
బౌలింగ్‌లో బాగున్నా, బ్యాటింగ్‌ భారాన్ని మోయగలిగే సామర్థ్యం ఉన్న దేశవాళీ ఆల్‌రౌండర్లను వెతికిపట్టుకోవాల్సిన బాధ్యత ఆర్‌సీబీ యాజమాన్యానికి ఉంది...
undefined
రజత్ పటిదార్ ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఆకట్టుకున్నా, మొదటి మ్యాచ్‌లో పర్ఫామెన్స్‌తో మాత్రం ఆకట్టుకోలేకపోయాడు. అతనికి రెండో ఛాన్స్ దక్కడం అనుమానమే..
undefined
సయ్యద్ ముస్తాక్ ఆలీ టీ20లో సెంచరీతో చెలరేగిన మహ్మద్ అజారుద్దీన్‌కి తుది జట్టులో అవకాశం కల్పించే ఆలోచన చేయొచ్చు విరాట్ కోహ్లీ అండ్ కో...
undefined
click me!