కావ్యా మారన్: సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈవో కావ్యా మారన్, ఆరెంజ్ ఆర్మీ ఆడిన ప్రతీ మ్యాచ్‌కి వచ్చి, జట్టును ఉత్సాహపరిచింది. అయితే సీజన్‌కి బ్రేక్ పడేదాకా 7 మ్యాచుల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ పేలవ ప్రదర్శన కనబర్చింది.

మొదటి మ్యాచ్ నుంచి ముంబై ఇండియన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ఢిల్లీ క్యాపిటల్స్ జట్లతో జరిగిన మ్యాచుల్లో విజయం దాకా వచ్చి, మిడిల్ ఆర్డర్ వైఫల్యంతో చిత్తుగా ఓడింది సన్‌రైజర్స్. గెలవాల్సిన జట్టు ఓడిపోతుంటే, కావ్యా మారన్ బాధపడడం, నిరాశ, నిస్పృహలతో నిండిపోవడం స్పష్టంగా కనిపించింది.

ఆడవాళ్లు ఏడిస్తే రాజ్యాలే కూలిపోయాయి. అలాంటిది ఐపీఎల్ ఓ లెక్కా... కావ్యా మారన్ ఏడవడం వల్లే ఐపీఎల్ 2021 సీజన్ అర్ధాంతరంగా ఆగిపోయిందని అంటున్నారు కొందరు మీమీ క్రియేటర్స్...

డేవిడ్ వార్నర్... గత ఐదు సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకి కెప్టెన్‌గా వ్యవహారిస్తున్నాడు డేవిడ్ వార్నర్. 2016లో ఐపీఎల్ టైటిల్ గెలిచిన డేవిడ్ వార్నర్, గత ఆరు సీజన్లలో సన్‌రైజర్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాట్స్‌మెన్‌గా ఉన్నాడు...

సరైన భారత బ్యాట్స్‌మెన్ లేక, పేకమేడలాంటి మిడిల్ ఆర్డర్‌తో కూడిన సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను నాలుగు సార్లు ఫ్లేఆఫ్ చేర్చిన డేవిడ్ వార్నర్‌ను 2021 సీజన్ మధ్యలోనే కెప్టెన్సీ పదవి నుంచి తొలగించింది సన్‌రైజర్స్ హైదరాబాద్....

ఆ తర్వాత ఏకంగా తుదిజట్టులోనే డేవిడ్ వార్నర్‌కి చోటు కరువైంది. రాజస్థాన్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డగౌట్‌లో డేవిడ్ వార్నర్ అలా కూర్చొని ఉండడం చూసి సగటు క్రికెట్ అభిమాని కూడా తట్టుకోలేకపోయాడు.

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టును సొంత జట్టుగా భావించే డేవిడ్ వార్నర్‌ను జట్టులో నుంచి తప్పించి, అతని ఆక్రందనకు గురి చేసినందుకే ఐపీఎల్ 2021 సీజన్‌కి మధ్యలోనే బ్రేక్ పడిందని అంటున్నారు ఆరెంజ్ ఆర్మీ అభిమానులు...

కెఎల్ రాహుల్: పంజాబ్ కింగ్స్ కెప్టెన్‌గా వ్యవహారించే కెఎల్ రాహుల్, ఐపీఎల్ టైటిల్ గెలుస్తానని ఎప్పుడూ మొహమాటానికి కూడా ప్రకటించలేదు కానీ, ప్రతీ సీజన్‌లో ఆరెంజ్ క్యాప్ కోసం పోటీపడతానని సగర్వంగా ప్రకటించాడు.

అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌కి ముందు కడుపునొప్పితో బాధపడి ఆసుపత్రిలో చేరిన కెఎల్ రాహుల్, సీజన్‌లో ఓ మ్యాచ్‌కి దూరమయ్యాడు. అపెండిక్స్ ఆపరేషన్ నిర్వహించిన తర్వాత అతనికి వారం విశ్రాంతి కావాలని చెప్పారు వైద్యులు.

ఇప్పటికే ఓ మ్యాచ్ దూరమైన కెఎల్ రాహుల్, సీజన్ సజావుగా గడిచి ఉంటే, మరో మ్యాచ్ కచ్ఛితంగా మిస్ అయ్యేవాడు. అదీకాక మయాంక్ అగర్వాల్ కెప్టెన్‌గా మొదటి మ్యాచ్‌లోనే 99 పరుగులు చేశాడు..

ఇవన్నీ చూసి తన ఆరెంజ్ క్యాప్ ఎక్కడ చేజారిపోతుందోనని కెఎల్ రాహుల్... తీవ్రంగా బాధపడి ఉంటాడని అందుకే... ఆయన శాపం వల్లే ఐపీఎల్ సీజన్ 2021 మధ్యలోనే ఆగిపోయిందని ఫన్నీ పోస్టులు చేస్తున్నారు సోషల్ మీడియా జనాలు...