నో షేరింగ్, నో కేరింగ్... ఐపీఎల్ 2021 ఫేజ్ 2లో కొత్త రూల్స్...

First Published Aug 11, 2021, 10:18 AM IST

ఐపీఎల్ 2021 సీజన్‌ ఫేజ్ 2లో కొత్త రూల్స్ అమలులోకి తేనుంది బీసీసీఐ. యూఏఈ వేదికగా సెప్టెంబర్ 19 నుంచి ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2021 సీజన్ ఫేజ్ 2 ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈసారి పక్కా పకడ్భందీగా ఐపీఎల్‌ను పూర్తి చేసేందుకు మార్గదర్శకాలు రూపొందిస్తోంది బీసీసీఐ...

అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఇండియాలో నిర్వహించిన ఐపీఎల్ 2021 సీజన్‌కి కరోనా అర్ధాంతరంగా బ్రేకులు వేసింది. బయో సెక్యులర్ జోన్ ఏర్పాటు చేసి నిర్వహించిన ఐపీఎల్‌లోనూ కరోనా కేసులు వెలుగు చూశాయి...

వరుణ్ చక్రవర్తి, అమిత్ మిశ్రా, సందీప్ వారియర్, వృద్ధిమాన్ సాహా వంటి ప్లేయర్లు కరోనా బారిన పడడంతో మరోదారి లేక ఐపీఎల్ 2021 సీజన్‌ను అర్ధాంతరంగా వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ.

కరోనా కారణంగా ఐపీఎల్ సీజన్ మధ్యలోనే వాయిదా పడడంతో బీసీసీఐకి వేల కోట్ల నష్టం వాటిల్లింది. ఈ దెబ్బతో దిద్దుబాటు చర్యలు చేపట్టిన బీసీసీఐ, ఫేజ్ 2 కోసం 42 ఆరోగ్య సూత్రాలతో మార్గదర్శకాలు జారీ చేయనుంది...

యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్ 2021 సీజన్‌ ఫేజ్‌లో ఏ ప్లేయర్ కూడా మరో ప్లేయర్‌తో ఆహారం కానీ, డ్రింక్స్ కానీ, వాటర్ బాటిల్స్, టవల్స్ కానీ షేర్ చేసుకోవడానికి వీలు లేదు. ప్రతీ ప్లేయర్‌కి సెపరేట్‌గా ఆహారం, డ్రింక్స్, వాటర్ బాటిల్స్, టవల్స్ ఏర్పాటు చేయబడతాయి...

మిగిలిన టీమ్‌లతో పోలిస్తే చెన్నై సూపర్ కింగ్స్‌లో ఈ షేరింగ్, కేరింగ్ చాలా ఎక్కువ. సీఎస్‌కే మాజీ సభ్యుడు కేదార్ జాదవ్, మహేంద్ర సింగ్ ధోనీకి ఫుడ్ తినిపిస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి...

అలాగే ధోనీ ఆప్త మిత్రుడు సురేష్ రైనా కూడా ఈ షేరింగ్, కేరింగ్ విషయంలో చాలా ముందుంటాడు. మాహీకి తినిపించడానికి, ఓ చిన్నపిల్లాడిలా సేవలు చేయడానికి చాలామంది బ్యాచ్ సీఎస్‌కేలో రెఢీగా ఉంటారు...

వీరికి ఈ రూల్స్ కాస్త కష్టం కలిగించవచ్చని అంటున్నారు నెటిజన్లు. అయితే ఫేజ్ 1లో ఎదురైన అనుభవాల దృష్ట్యా ఈ రూల్స్‌ని పక్కగా అమలు చేయాలని చూస్తోంది బీసీసీఐ...

ఏ ప్లేయర్ అయినా కరోనా బారిన పడితే, అతని కారణంగా టీమ్ సభ్యులకు వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఈ విధమైన రూల్స్ తీసుకురావాలని ఆలోచన చేస్తోంది యాజమాన్యం..

అలాగే ఐపీఎల్ 2021 ఫేజ్ 1 జనాల్లేకుండా ఖాళీ స్టేడియాల్లో నిర్వహించారు. అయితే యూఏఈలో జరిగే ఫేజ్ 2 సీజన్ మాత్రం ప్రేక్షకుల నడుమ జరగనుంది. వ్యాక్సిన్ కోర్సు పూర్తిచేసుకున్నవారిని మాత్రమే స్టేడియంలోకి అనుమతిస్తారు...

స్టేడియంలోకి కొట్టిన బంతిని ప్రేక్షకులు తాకుతారు. వాటిని మళ్లీ వాడితే, ఆటగాళ్లకు కరోనా వ్యాపించే అవకాశం ఉందనే ఉద్దేశంతో సిక్సర్ కొట్టిన బంతిని మళ్లీ వెంటనే వాడకుండా, కొత్త బంతిని వాడాలనే నిబంధన కూడా అమలులోకి తేవాలని చూస్తోంది బీసీసీఐ.

ప్రేక్షకుల్లోకి కొట్టిన బంతిని, అధికారులు సేకరించి దాన్ని పూర్తిగా శుభ్రపరిచిన తర్వాత సేఫ్ అని నిర్ణయించుకున్నాకే తర్వాతి మ్యాచ్‌లో వాడతారు...  

click me!