వాళ్లిద్దరూ వేస్ట్, అంబటి రాయుడే ది బెస్ట్... సీఎస్‌కే ప్లేయర్‌పై గౌతమ్ గంభీర్ కామెంట్...

First Published Oct 5, 2021, 7:40 PM IST

ఐపీఎల్ 2021 సీజన్‌లో ప్లేఆఫ్స్‌కి అర్హత సాధించిన మొట్టమొదటి జట్టు చెన్నై సూపర్ కింగ్స్... అయితే ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మాహీ టీమ్‌కి ఊహించని షాక్ తగిలింది... టాపార్డర్ ఫెయిల్ కావడంతో సీఎస్‌కే బ్యాటింగ్‌లోని డొల్లతనం బయటపడింది...

సీఎస్‌కేలో ఓపెనర్లు రుతురాజ్ గైక్వాడ్, డుప్లిసిస్ బీభత్సమైన ఫామ్‌లో ఉన్నారు... ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో టాపార్డర్ ఫెయిల్ అయినా రుతురాజ్ గైక్వాడ్, రవీంద్ర జడేజా, బ్రేవో కలిసి బౌండరీల వర్షం కురిపించి, సీఎస్‌కేకి మంచి స్కోరు అందించారు...

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇద్దరు ఓపెనర్లు, సురేష్ రైనా, మొయిన్ ఆలీ వంటి ప్లేయర్లు ఫెయిల్ అయినా అంబటి రాయుడు అదిరిపోయే పర్ఫామెన్స్‌తో సీఎస్‌కేకి మంచి స్కోరు అందించాడు...

‘నా ఉద్దేశంలో చెన్నై సూపర్ కింగ్స్‌లో చేరినప్పటి నుంచి అంబటి రాయుడి పర్ఫామెన్స్ పూర్తిగా మారిపోయింది. ఓపెనర్‌గా, వన్‌డౌన్‌లో, టూ డౌన్‌లో... ఏ పొజిషన్‌లో అయినా రాణించగలనని నిరూపించుకున్నాడు...

పరుగులు వస్తున్నప్పుడు, బౌండరీలు బాదడం పెద్ద విషయం కాదు. త్వరత్వరగా వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును పరుగులు పెట్టించడం చాలా కష్టమైన విషయం...

షేన్ వాట్సన్‌తో ఓపెనింగ్ చేసినప్పుడు ఎలాంటి ప్రభావం చూపించాడో, నాలుగో స్థానంలోనూ అదే రేంజ‌లో పర్ఫామెన్స్ ఇచ్చాడు... అందరూ రవీంద్ర జడేజా, సురేష్ రైనా వంటి ప్లేయర్ల గురించి మాట్లాడుతున్నారు...

నా ఉద్దేశంలో ఈ ఇద్దరూ కాదు, అంబటి రాయుడే అసలైన సూపర్ స్టార్... గత మూడు, నాలుగేళ్లుగా సీఎస్‌కే బెస్ట్ ప్లేయర్‌గా ఉన్నాడు అంబటి రాయుడు...’ అంటూ కామెంట్ చేశాడు కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్...

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరుపున 58 మ్యాచులు ఆడిన అంబటి రాయుడు, 35.59 సగటుతో 1495 పరుగులు చేశాడు... 

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో మిగిలిన బ్యాట్స్‌మెన్ అందరూ ఫెయిల్ అయిన చోట 43 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 55 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు...

2018 సీజన్‌లో సీఎస్‌కేకి మారిన అంబటి రాయుడు, అదే సీజన్‌లో ఓ సెంచరీ, 3 హాఫ్ సెంచరీలతో 602 పరుగులు చేసి అదరగొట్టాడు.. ఈ సీజన్‌లో 13 మ్యాచులు ఆడిన రాయుడు, 252 పరుగులు చేశాడు... 

click me!