2014 సమయంలో దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఉండడంతో మొదటి 20 ఐపీఎల్ మ్యాచులు యూఏఈ వేదికగా జరిగాయి. ఆ తర్వాత సీజన్ మొత్తం భారత్‌లోనే జరిగింది.
దేశంలో కరోనా వైరస్ కేసులు విపరీతంగా నమోదవుతూ లాక్‌డౌన్ ఉన్న సమయంలో ఐపీఎల్ 2020 సీజన్ మొత్తానికి వేదికనిచ్చిందియూఏఈ. 2021 సీజన్‌లో మొదటి 29 మ్యాచులు ఇండియాలో జరగగా, మిగిలిన 31 మ్యాచులు యూఏఈలో జరగబోతున్నాయి.
భారత్‌లోని పిచ్‌లు, స్టేడియాలతో పోలిస్తే దుబాయ్, షార్జాలోని పిచ్‌లు బ్యాటింగ్‌కి చక్కగా అనుకూలిస్తున్నాయి. స్టేడియం పరిమాణం కూడా తక్కువ కావడంతో సిక్సర్ల వర్షం కురవడం కష్టం.
ఐపీఎల్ 2020 సీజన్‌లో భారీ హిట్టర్లు ఉన్న ముంబై ఇండియన్స్ ఛాంపియన్‌గా నిలిచింది. ఈసారి ఫస్టాఫ్‌లో స్థాయికి తగ్గ పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయిన ముంబై ఇండియన్స్, యూఏఈలో చెలరేగిపోయే అవకాశం పుష్కలంగా ఉంది.
ఫస్టాఫ్ ముగిసే సమయానికి తొలి ఐదు మ్యాచుల్లో మూడింట్లో ఓడిన ముంబై ఇండియన్స్... 7 మ్యాచుల్లో 4 విజయాలతో పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉంది. అయితే ఇకపై ముంబై పర్ఫామెన్స్ ఛాంపియన్ స్టైల్‌లో ఉంటుంది.
ఢిల్లీ క్యాపిటల్స్ 8 మ్యాచుల్లో 6 విజయాలతో టాప్‌లో ఉంది. యూఏఈలో కూడా ఢిల్లీకి మంచి రికార్డు ఉంది. 13 సీజన్లలో తొలిసారి ఫైనల్‌కి చేరింది యూఏఈలో జరిగిన గత సీజన్‌లోనే. కాబట్టి ఈసారి కూడా వారికి యూఏఈ పెద్ద ఇబ్బంది కలిగించదు.
చెన్నై సూపర్ కింగ్స్... యూఏఈలో సెకండాఫ్ మ్యాచులు పెడతారని వార్తలు వచ్చినప్పటి నుంచి అక్కడ సీఎస్‌కే ఎలా ఆడుతుందోనని డిస్కర్షన్ మొదలైంది. ఎందుకంటే గత సీజన్‌లో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో నిలిచి, దారుణమైన పర్ఫామెన్స్ ఇచ్చింది సీఎస్‌కే.
అయితే ఈ సారి చెన్నై జట్టులో గత సీజన్‌లో లేని మొయిన్ ఆలీ, సురేశ్ రైనా వంటి ప్లేయర్లు ఉన్నారు. అదీకాకుండా ఫస్టాఫ్‌లో సీఎస్‌కే ఇచ్చిన పర్ఫామెన్స్ వీరలెవెల్... కాబట్టి సెకండాఫ్‌లో చెన్నై కనీసం ప్లేఆఫ్‌కి అర్హత సాధించడం పక్కా.
గత సీజన్‌లో మొదటి 9 మ్యాచుల్లో ఏడింట్లో విజయాలు అందుకుంది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. అయితే ఆ తర్వాతే అసలు కథ మొదలైంది. మిగిలిన ఆరు మ్యాచుల్లో ఒక్క విజయం కూడా అందుకోలేకపోయింది.
రన్‌రేట్ కారణంగా ప్లేఆఫ్‌కి అర్హత సాధించిన ఆర్‌సీబీ, మొదటి ఎలిమినేటర్ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ చేతుల్లో ఓడి, నాలుగో స్థానానికి పరిమితమైంది. ఈసారి ఆర్‌సీబీ పర్ఫామెన్స్... ‘వావ్’ అనిపించే రేంజ్‌లో లేకపోయినా బాగుంది.
మొదటి ఏడు మ్యాచుల్లో 5 విజయాలు అందుకున్న ఆర్‌సీబీ, అదే ఊపును యూఏఈలో కొనసాగించడం కష్టమే. ఎందుకంటే ఈ సారి ఆర్‌సీబీలో అద్భుతంగా రాణిస్తున్న గ్లెన్ మ్యాక్స్‌వెల్, గత సీజన్‌లో యూఏఈ పిచ్‌లపై ఒక్క సిక్స్ కూడా బాదలేకపోయాడు.
రాజస్థాన్ రాయల్స్‌కి షార్జాలో మంచి రికార్డు ఉంటే, పంజాబ్ కింగ్స్ గత సీజన్‌లో వరుసగా ఐదు మ్యాచుల్లో ఓడి తర్వాత వరుసగా ఆరు మ్యాచుల్లో విజయం సాధించింది. అయితే ఈ రెండు జట్లపై ఈ సీజన్‌లో కూడా పెద్దగా అంచనాలు లేవు.
భారీ స్టార్లు, ఆల్‌రౌండర్లు, హిట్టర్లు ఉన్న కేకేఆర్, ఐపీఎల్ 2021 సీజన్ ఫస్టాఫ్‌లో బాగా ఇబ్బంది పడింది. ఏడు మ్యాచుల్లో కేవలం 2 విజయాలు మాత్రమే అందుకుని ఏడో స్థానంలో నిలిచింది.
అయితే యూఏఈలో జరిగే మ్యాచులు కేకేఆర్‌కి అనుకూలించొచ్చు. మిగిలిన మ్యాచుల్లో భారీ విజయాలు అందుకోలేకపోయినా బెటర్ పర్ఫామెన్స్ అయితే ఆశించవచ్చు.
సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటికే దాదాపు ఫ్లేఆఫ్ రేసు నుంచి తప్పుకుంది. ఏడు మ్యాచుల్లో ఒకే ఒక్క విజయం అందుకుంది. ఇక్కడి నుంచి అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చి ఏడుకి ఏడు మ్యాచులు గెలిస్తేనే కానీ, ప్లేఆఫ్‌కి అర్హత సాధించలేని పరిస్థితి.
అదీకాకుండా సెప్టెంబర్‌లో జరిగే మ్యాచులకు ఇంగ్లాండ్ క్రికెటర్ జానీ బెయిర్ స్టో, న్యూజిలాండ్ స్టార్ కేన్ విలియంసన్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ డేవిడ్ వార్నర్ అందుబాటులో ఉండడం అనుమానమే.
కాబట్టి ఇప్పుడు ఐపీఎల్ 2021 సీజన్ మిగిలిన మ్యాచులు ఇక్కడ జరిగినా, యూఏఈలో జరిగినా... మరే దేశంలో జరిగినా ఆరెంజ్ ఆర్మీకి మాత్రం ఇలాంటి ఇబ్బంది కలగదు. ఎందుకంటే ఈ ముగ్గరు స్టార్లు లేకపోతే సన్‌రైజర్స్ జట్టు ఓ గల్లీ క్రికెట్ టీమ్‌గానే మారుతుంది.