IPL 2020: మై డియర్ నట్టూ... అదిరిందయ్యా నీ పట్టు...

First Published Sep 30, 2020, 4:57 PM IST

రెండు ఓవర్లలో కలిపి 10 యార్కర్లు వేసిన నటరాజన్...

నటరాజన్ బౌలింగ్ అద్భుతమంటూ కొనియాడిన సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, బ్రెట్‌లీ, హర్షా బోగ్లే...

4 ఓవర్లలో 25 పరుగులు మాత్రమే ఇచ్చిన డేంజర్ మ్యాన్ స్టోయినిస్ వికెట్ తీసిన నటరాజన్, కీలక సమయాల్లో యార్కర్లు వేసి ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టాడు. 14వ ఓవర్‌తో పాటు అత్యంత కీలకమైన 18వ ఓవర్ వేసిన నటరాజన్... రెండు ఓవర్లలో కలిపి 10 యార్కర్లు వేశాడు.
undefined
యార్కర్ వేయడమంటే అంత తేలికైన పని కాదు. లైన్ అండ్ లెంగ్త్ కచ్ఛితంగా మెయింటైన్ చేస్తూ బంతిని విసరాలి. బుమ్రా, మలింగ వంటి సీనియర్లకి కూడా సాధ్యంకాని ఈ ఫీట్‌ని అద్భుతంగా చేసి చూపెట్టాడు తంగరసు నటరాజన్.
undefined
నటరాజన్ తమిళనాడులోని సేలం జిల్లా చిన్నప్పంపట్టి గ్రామానికి చెందినవాడు. నటరాజన్ తండ్రి రోజూకూలీ. తల్లి మార్కెట్‌లో మాంసం, కూరగయాలు అమ్మేది.
undefined
చిన్నతనం నుంచి క్రికెట్ ఆడుతున్న నటరాజన్ యార్కర్లను చూసిన జయప్రకాశ్ అనే క్రికెటర్, అతని ప్రోత్సాహించాడు.చెన్నై తీసుకొచ్చి ట్రైనింగ్ ఇచ్చాడు. అలా తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోకి వచ్చి... ఐపీఎల్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
undefined
2017 సీజన్‌లో నటరాజన్‌ను రూ.3 కోట్లు చెల్లించి కొనుగోలు చేసింది పంజాబ్. అయితే ఆ సీజన్‌లో ఆరు మ్యాచులు ఆడిన నటరాజన్, 2 వికట్లు మాత్రమే తీశాడు.
undefined
2018 వేలంలో నటరాజన్‌ను ఏరికోరి ఎంపికచేశాడు సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలింగ్ కోచ్ ముత్తయ్య మురళీధరన్‌.
undefined
అయితే బౌలర్లు ఎక్కువగా ఉన్న సన్‌రైజర్స్ జట్టులో నటరాజన్‌కు చోటు దక్కేందుకు రెండేళ్లు పట్టింది.
undefined
తన కెరీర్‌ను మార్చేసిన జయప్రకాశ్‌ గుర్తుగా తన జెర్సీ మీద ‘జేపీ’ అని వేయించుకున్నాడు నటరాజన్.
undefined
ఓవర్‌లో ఆరుకి ఆరు యార్కర్లు వేసిన నటరాజన్ బౌలింగ్‌ను ప్రశంసల్లో ముంచెత్తారు బ్రెట్ లీ, వీరేంద్ర సెహ్వాగ్, హర్షా బోగ్లే అండ్ ఇతర సీనియర్లు.
undefined
Most effective in T20s: So far, Natarajan has been the most effective in the shortest format of the game. As per his T20 stats, he has claimed 22 wickets in 25 matches at an economy of 7.17, while he has his best career bowling average in the format, of 25.50.
undefined
click me!