IPL 2020: కేకేఆర్ కెప్టెన్‌‌గా దినేశ్ కార్తీక్‌ను తొలగించండి... క్రికెటర్ శ్రీశాంత్...

First Published Oct 6, 2020, 7:22 PM IST

IPL 2020 సీజన్ 13లో అంచనాలను తలకిందులు చేస్తూ అన్ని జట్లూ అంతో ఇంతో పోరాటం ప్రదర్శిస్తున్నాయి. కేకేఆర్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. దీంతో అతని స్థానంలో మోర్గాన్‌ను కెప్టెన్‌గా చేయాలంటున్నాడు మాజీ క్రికెటర్ శ్రీశాంత్...

యువ ఆటగాళ్లతో నిండిన ఢిల్లీ క్యాపిటల్స్ అద్భుతాలు చేస్తుంటే... మిగిలిన జట్లు కూడా విజయాలు సాధిస్తూ పాయింట్ల పట్టికలో స్థానాలను ఎప్పటికప్పుడూ మార్చుకుంటున్నాయి.
undefined
కోల్‌కత్తా నైట్‌రైడర్స్ కెప్టెన్ దినేశ్ కార్తీక్ మాత్రం వరుసగా విఫలమవుతున్నాడు. దీనిపై స్పందించాడు క్రికెటర్ శ్రీశాంత్.
undefined
ఇప్పటిదాకా కోల్‌కత్తా ఆడిన నాలుగు మ్యాచుల్లోనూ బ్యాటింగ్‌లో విఫలమయ్యాడు దినేశ్ కార్తీక్.
undefined
ఒకే మ్యాచ్‌లో 30 పరుగులు మినహా, మిగిలిన మ్యాచుల్లో 6, 1, 0 పరుగులు చేసి నిరాశపరిచాడు.
undefined
దీంతో ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌ను కేకేఆర్ జట్టుకి కెప్టెన్‌గా చేస్తే... ఆ జట్టు విజయం సాధిస్తుందని చెబుతున్నాడు శ్రీశాంత్.
undefined
‘జెన్యూన్‌గా చెబుతున్నా ఇయాన్ మోర్గాన్ జట్టును బాగా నడిపించగలడు.
undefined
డీకే మాత్రం జట్టును నడిపించలేడు. వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్‌‌ను టీమ్‌లో ఉంచుకుని కార్తీక్‌ను కెప్టెన్ చేయడం సరికాదు.
undefined
వారికి ధోనీ, రోహిత్, విరాట్ లాంటి నాయకుడు కావాలి...’ అని ట్వీట్ చేశాడు శ్రీశాంత్.
undefined
కేకేఆర్ ఫ్యాన్స్ కూడా దినేశ్ కార్తీక్‌ను కెప్టెన్‌గా తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు...
undefined
కేవిన్ పీటర్సన్ అయితే మోర్గాన్‌కి బదులు శుబ్‌మన్ గిల్‌ను కెప్టెన్‌ చేయాలని చెబుతున్నాడు...
undefined
ప్లేయర్‌గా విఫలమవుతున్నా, కెప్టెన్‌గా దినేశ్ కార్తీక్ తీసుకుంటున్న నిర్ణయాలు జట్టుకు కలిసొస్తున్నాయి...
undefined
2018 సీజన్‌లో కేకేఆర్‌ను ఫ్లేఆఫ్‌కి చేర్చిన దినేశ్ కార్తీక్, ఫామ్ అందుకుంటే అద్భుతాలు చేయగలడని అంటున్నారు డీకే ఫ్యాన్స్...
undefined
click me!