IPL 2020: కెప్టెన్సీ మార్పుపై గంభీర్ ట్వీట్... ఛీటింగ్ చేసిన వ్యక్తికి పగ్గాలు ఇవ్వడంపై...

First Published Oct 16, 2020, 4:38 PM IST

IPL 2020 సీజన్ సగం ముగిసిన తర్వాత కెప్టెన్సీ పదవిని ఇయాన్ మోర్గాన్‌కి అప్పగించాడు దినేశ్ కార్తీక్. ఈ కెప్టెన్సీ మార్పు తర్వాత కేకేఆర్ మాజీ కెప్టెన్ గౌతమ్ గంభీర్ వేసిన ట్వీట్ చర్చనీయాంశమైంది.

IPLలో అత్యంత భారీ అంచనాలతో ఎంట్రీ ఇచ్చిన జట్టు కోల్‌కత్తా నైట్‌రైడర్స్. భారత మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కెప్టెన్సీ, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ యజమానిగా ఎంట్రీ ఇచ్చిన కేకేఆర్‌పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
undefined
అయితే వాటిని అందుకోవడంతో కోల్‌కత్తా ఫెయిల్ అయ్యింది. వరుస ఫెయిల్యూర్‌తో చెత్త ప్రదర్శన ఇస్తున్న కేకేఆర్ ఫేట్ మార్చిన కెప్టెన్ గౌతమ్ గంభీర్...
undefined
గంభీర్ కెప్టెన్‌గా నియమితుడైన తర్వాత అద్భుత ప్రదర్శన ఇచ్చిన కోల్‌కత్తా నైట్‌రైడర్స్... 2012, 2014 సీజన్లలో ఐపిఎల్ టైటిల్ గెలిచి అదరగొట్టింది...
undefined
రిటైర్మెంట్ ముందు తన సొంత జట్టుకు ఆడాలనే ఉద్దేశంతో కోల్‌కత్తా పగ్గాలను దినేశ్ కార్తీక్‌కి అప్పగించాడు గౌతమ్ గంభీర్...
undefined
తాజాగా దినేశ్ కార్తీక్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటూ, ఇంగ్లాండ్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్‌కి సారథ్య బాధ్యతలు అప్పగించాడు...
undefined
ఈ సంఘటన తర్వాత గౌతమ్ గంభీర్... ‘ఓ గొప్ప వారసత్వాన్ని నిర్మించడానికి కొన్నేళ్ల పాటు కష్టపడాల్సి ఉంటుంది. కానీ అది నాశనం చేయాలంటే ఒక్క నిమిషం చాలు’ అని ట్వీట్ చేశాడు.
undefined
ఇంగ్లాండ్‌ జట్టుకు కెప్టెన్‌గా వన్డే వరల్డ్ కప్ 2019 అందించాడు ఇయాన్ మోర్గాన్...
undefined
అయితే 2020 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ గెలిచిన తీరు విమర్శలకు దారి తీసింది. స్కోర్లు టై కావడంతో సూపర్ ఓవర్ ఆడాయి న్యూజిలాండ్, ఇంగ్లాండ్...
undefined
సూపర్ ఓవర్ కూడా టై కావడంతో ఇన్నింగ్స్‌లో ఎక్కువ బౌండరీలు ఉన్న ఇంగ్లాండ్ విశ్వవిజేతగా నిలిచింది. ఈ మ్యాచ్‌లో ఓవర్ త్రో వేసినందుకు ఇంగ్లాండ్‌కి 5 పరుగులు ఇచ్చారు అంపైర్లు. బౌండరీ ఇవ్వకుండా 5 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్ ఫలితమే మారిపోయింది.
undefined
ఇంగ్లాండ్ జట్టు అంపైర్లతో కుమ్మకైనందునే ఇలా వారికి అనుకూలంగా ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి.ఛీటింగ్ చేసిన వ్యక్తిని కేకేఆర్ కెప్టెన్‌గా మార్చడంపైనే గంభీర్ ఇలా అసంతృప్తి వ్యక్తం చేసి ఉంటాడని కొందరు అభిప్రాయపడుతున్నారు.
undefined
మరికొందరు ధోనీపై పరోక్షంగా కామెంట్ చేసిన హర్భజన్ సింగ్‌ను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసి ఉంటారని అంటున్నారు.
undefined
Dinesh Karthik, Gautam Gambhir
undefined
click me!