లార్డ్స్ టెస్టు విజయం ఇచ్చిన ఓవర్ కాన్ఫిడెన్స్... భారత జట్టులో స్పష్టంగా కనిపించింది. మొదటిసారి ఇంగ్లాండ్‌లో కెప్టెన్‌గా టాస్ గెలిచిన విరాట్ కోహ్లీ నిర్ణయానికి షాక్ ఇచ్చేలా పర్ఫామెన్స్ ఇచ్చింది భారత జట్టు. తొలి ఇన్నింగ్స్‌లో భారత బ్యాట్స్‌మెన్లలో ఒక్కరు కూడా 20 పరుగులు కూడా చేయలేకపోయారంటే... మనవాళ్ల బ్యాటింగ్ ఎలా సాగిందో అర్థం చేసుకోవచ్చు... 40.4 ఓవర్లలో 78 పరుగులకే ఆలౌట్ అయ్యింది టీమిండియా... భారత జట్టులో రోహిత్ శర్మ చేసిన 19 పరుగులే అత్యధిక స్కోరు..
లార్డ్స్ టెస్టులో ఎదురైన ఘోర పరాభవాన్ని ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న ఇంగ్లాండ్ క్రికెటర్లు, తమ కోపాన్ని మాటలతో చెప్పకుండా బౌలింగ్‌లో పకడ్భందీగా చూపించారు. భారత బ్యాట్స్‌మెన్ చేసిన తప్పులు కూడా వారికి బాగా కలిసొచ్చాయి...
213
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా, మొదటి గంటలోనే మూడు వికెట్లు కోల్పోయింది, మొదటి సెషన్‌లో నాలుగు వికెట్లు కోల్పోయి, ఆతిథ్య జట్టుకి ఆధిక్యాన్ని అందించింది... రెండో సెషన్‌లో ఇంగ్లాండ్ బౌలర్లు మరింత రెచ్చిపోయారు...
313
ఫామ్‌లో లేని విరాట్ కోహ్లీ, ఛతేశ్వర్ పూజారా, అజింకా రహానేలతో పాటు మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ కెఎల్ రాహుల్, రిషబ్ పంత్, రోహిత్ శర్మ కూడా తీవ్రంగా నిరాశపరిచారు...
413
గత రెండు టెస్టుల్లో అదరగొట్టిన భారత ఓపెనర్ కెఎల్ రాహుల్... 4 బంతుల్లో పరుగులేమీ చేయకుండానే పెవిలియన్ చేరాడు. మొదటి ఓవర్ వేసిన అండర్సన్ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు కెఎల్ రాహుల్...
513
ఆ తర్వాత 9 బంతుల్లో 1 పరుగు చేసిన ఛతేశ్వర్ పూజారా కూడా అండర్సన్ బౌలింగ్‌లోనే, బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. దీంతో 4 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయింది భారత జట్టు.
613
అండర్సన్ బౌలింగ్‌లో పూజారా అవుట్ కావడం ఇది 10వ సారి కాగా, ఇంగ్లాండ్‌లో 8వ సారి... స్వదేశంలో జేమ్స్ అండర్సన్ బౌలింగ్‌లో అత్యధిక సార్లు అవుటైన బ్యాట్స్‌మెన్‌గా పూజారా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. పూజారా అవుటైన తర్వాత మూడో వికెట్‌కి 17 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన విరాట్ కోహ్లీ, 17 బంతుల్లో ఓ ఫోర్‌తో 7 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు...
713
21 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను అజింకా రహానే, రోహిత్ శర్మ కలిసి కాసేపు ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కి 92 బంతుల్లో 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 54 బంతుల్లో 3 ఫోర్లతో 18 పరుగులు చేసిన అజింకా రహానే, రాబిన్‌సన్ బౌలింగ్‌లో బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
813
లంచ్ బ్రేక్ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ 9 బంతుల్లో 2 పరుగులు చేసి రాబిన్‌సన్ బౌలింగ్‌లో కీపర్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు...
913
కెఎల్ రాహుల్, ఛతేశ్వర్ పూజారా, విరాట్ కోహ్లీ, అజింకా రహానే, రిషబ్ పంత్... టీమిండియా కోల్పోయిన మొదటి ఐదు వికెట్లు కూడా కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి ఒకే విధంగా పెవిలియన్ చేరడం విశేషం...
1013
ఓ వైపు వికెట్లు పడుతున్నా ఎంతో ఓపికగా, తన సహజ శైలికి విరుద్దంగా బ్యాటింగ్ చేసిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ... 105 బంతుల్లో ఓ ఫోర్‌తో 19 పరుగులు చేసి అవుట్ అయ్యాడు...
1113
రోహిత్ శర్మ అవుటైన తర్వాతి బంతికే మహ్మద్ షమీ కూడా డకౌట్ అయ్యాడు. మార్క్ వుడ్ స్థానంలో జట్టులోకి వచ్చిన క్రెగ్ ఓవర్టన్ ఒకే ఓవర్‌లో రెండు వికెట్లు తీశాడు...
1213
ఆ తర్వాతి ఓవర్‌లో రవీంద్ర జడేజా 29 బంతుల్లో 4 పరుగులు చేసి సామ్ కుర్రాన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు... జడేజా అవుటైన తర్వాతి బంతికే బుమ్రా కూడా అవుట్ అయ్యాడు...
1313
67/4 వద్ద ఉన్న టీమిండియా అదే స్కోరు వద్దే నాలుగు వికెట్లు కోల్పోయి... 67/9 స్కోరుకి చేరుకుంది. ఆఖర్లో మహ్మద్ సిరాజ్, ఇషాంత్ శర్మ కలిసి 11 పరుగులు చేసి స్కోరును 78 పరుగులకి చేర్చగలిగారు.