కోహ్లీ, నీదో పిచ్చి నిర్ణయం... పిచ్ చూశాక కూడా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంటావా...

First Published Aug 25, 2021, 5:12 PM IST

ఇంగ్లాండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో భారత జట్టు టాస్ గెలిచి, బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్‌లో వరుసగా 8 టెస్టుల్లో టాస్ ఓడిపోయిన విరాట్ కోహ్లీకి, ఇదే మొట్టమొదటి టాస్ విజయం. అయితే టాస్ గెలిచామనే సంతోషం , భారత్‌కి అభిమానులకు ఎంతోసేపు నిలవలేదు...

బ్యాటింగ్ ప్రారంభించిన మొదటి ఓవర్‌లోనే ఫామ్‌లో ఉన్న కెఎల్ రాహుల్ వికెట్‌ను కోల్పోయింది టీమిండియా... ఆ తర్వాత పూజారా, విరాట్ కోహ్లీ కూడా పెవిలియన్ చేరారు...

21 పరుగులకే మూడు కీలక వికెట్లు కోల్పోయిన టీమిండియా... పరుగులు చేయడానికి తెగ ఇబ్బంది పడుతోంది. దీంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న విరాట్ కోహ్లీ నిర్ణయంపై ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు...

ఇంగ్లాండ్ సీనియర్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ కూడా విరాట్ కోహ్లీ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశాడు. ‘మొదటి గంటలో ఇంగ్లాండ్ అదరగొట్టింది. మూడు భారీ వికెట్లు. అయినా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకోవడమంటే సాహసమనే చెప్పాలి. ఇక్కడ పిచ్ మొదటి రోజు బౌలర్లకు సహకరిస్తుంది. మూడో రోజు నుంచి బ్యాటింగ్‌కి సహకరిస్తుంది. సీమర్లకు పెద్దగా ఫలితం దక్కదు’ అంటూ ట్వీట్ చేశాడు స్టువర్ట్ బ్రాడ్.

చివరిసారిగా 2002లో ఇక్కడ టెస్టు మ్యాచ్ ఆడింది టీమిండియా... సౌరవ్ గంగూలీ కెప్టెన్సీలో జరిగిన ఆ మ్యాచ్‌లో భారత జట్టు తరుపున మిడిల్ ఆర్డర్‌లో రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ సెంచరీలు చేశారు... టీమిండియా ఇన్నింగ్స్ తేడాతో భారీ విజయాన్ని అందుకుంది.

ఆ టెస్టు తర్వాత 19 ఏళ్లకు లీడ్స్‌లో మ్యాచ్ ఆడుతున్న విరాట్ కోహ్లీ, పిచ్‌‌లో పచ్చిక లేకపోవడం చూసి... బ్యాటింగ్‌కి సహకరిస్తుందని తప్పుగా అంచనా వేసి ఉంటాడని అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు...

పిచ్‌పైన పచ్చిక లేకపోయినా మొదటి రోజు బౌలర్లకు సహకరిస్తుందని విరాట్ కోహ్లీ అంచనా వేయలేకపోయాడని... విజయాలు దక్కుతున్నా, అతనికి ఇలాంటి విషయాల్లో ధోనీలాంటి క్రికెట్ నాలెడ్జ్ లేదని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. 

అదీకాకుండా వరుసగా టాస్ ఓడిపోతూ ఉండడంతో ఒకవేళ టాస్ గెలిస్తే... ఏం తీసుకోవాలనే ఆలోచన కూడా విరాట్ కోహ్లీ చేసి ఉండకపోవచ్చని... అందుకే సడెన్‌గా ఏం చెప్పాలో తెలియక బ్ాయటింగ్ ఎంచుకున్నాడని అంటున్నారు మరికొందరు ఫ్యాన్స్.

లార్డ్స్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో జేమ్స్ అండర్సన్‌కి వికెట్లేమీ దక్కలేదు. ఆ కసి మొత్తం లీడ్స్‌లో తీర్చుకుంటున్నాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

ఫిప్త్ స్టంప్ బంతులను ఎదుర్కోవడంలో భారత క్రికెటర్ల టెక్నిక్ ఏ మాత్రం మెరుగుపడలేదు. విరాట్ కోహ్లీ వరుసగా ఇలాగే అవుట్ అవుతున్నాడు. అయినా కూడా అతని టెక్నిక్ ఏ మాత్రం మారలేదు. ఇది కూడా టీమిండియా పరిస్థితికి కారణమని అంటున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

click me!