Indian Premier League: 2021లో కేకేఆర్ లో చేరిన వెంకటేష్ అయ్యర్‌ను గత సంవత్సరం వేలానికి ముందే కోల్ కతా టీమ్ విడుదల చేసింది. అయితే, వేలంలో భారీ ధర రూ. 23.75 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. తాజాగా అతను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
IPL 2025 KKR: రాబోయే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2025 సీజన్ మార్చి 22న ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 2025 ఫైనల్ మే 25న జరుగుతుంది. సీజన్‌లోని 74 మ్యాచ్‌లు 13 వేదికలలో జరుగుతాయి. ఇప్పటికే ఐపీఎల్ ఫ్రాంఛైజీలు రాబోయే టాటా ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఎడిషన్ కోసం సిద్ధమవుతున్నాయి.
తొలి మ్యాచ్ లో తలపడున్న ఆర్సీబీ-కేకేఆర్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) లో తొలి మ్యాచ్ మార్చి 22న కోల్‌కతాలోని ఐకానిక్ ఈడెన్ గార్డెన్స్‌లో జరుగుతుంది. డిఫెండింగ్ ఛాంపియన్స్ కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR), రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య మ్యాచ్‌తో IPL 2025 సీజన్ ప్రారంభమవుతుంది.
25
కేకేఆర్ కెప్టెన్ ఎవరు?
ప్రస్తుత ఐపీఎల్ ఛాంపియన్ కేకేఆర్ టీమ్ ఇంకా ఐపీఎల్ 2025 ఎడిషన్ కు సంబంధించి తమ కెప్టెన్‌ను ప్రకటించలేదు. శ్రేయాస్ అయ్యర్ ఐపీఎల్ 2024 లో కేకేఆర్ ను ముందుకు నడిపించి టైటిల్ ను అందించాడు. కానీ మెగా వేలంలో పంజాబ్ కింగ్స్ అతన్ని కొనుగోలు చేసింది. రాబోయే సీజన్ కోసం పంజాబ్ టీమ్ అతన్ని తమ కెప్టెన్ గా నియమించింది.
అయితే, పోటీ క్రికెట్‌లో ఏ స్థాయిలోనూ కెప్టెన్సీ అనుభవం లేకపోయినా, అవకాశం ఇస్తే కోల్‌కతా నైట్ రైడర్స్‌కు నాయకత్వం వహించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ఐపీఎల్ 2025 ప్రారంభానికి ముందు ఆల్ రౌండర్ వెంకటేష్ అయ్యర్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.
2021లో కేకేఆర్ లో చేరిన వెంకటేష్ అయ్యర్ ను గత సంవత్సరం వేలానికి ముందే కోల్ కతా ఫ్రాంఛైజీ విడుదల చేసింది. మళ్లీ మెగా వేలంలో భారీ ధర రూ. 23.75 కోట్లకు తిరిగి కొనుగోలు చేసింది. దీంతో రాబోయే ఐపీఎల్ సీజన్ లో రింకూ సింగ్, వెంకటేష్ అయ్యర్ల పేర్లు కెప్టెన్సీ విషయంలో హాట్ టాపిక్ అయ్యాయి. అయితే, కేకేఆర్ కెప్టెన్ ను ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.
ఇక కేకేఆర్ కెప్టెన్సీ గురించి వెంకటేష్ అయ్యర్ మాట్లాడుతూ.. "ఖచ్చితంగా, నేను సిద్ధంగా ఉన్నాను. నేను మళ్ళీ చెబుతున్నాను. కెప్టెన్సీ అనేది కేవలం ఒక ట్యాగ్. నేను నాయకత్వంపై నమ్మకం ఉంచుతాను. నాయకుడిగా ఉండటం చాలా పెద్ద పాత్ర పోషించాలి" అని వెంకటేష్ ESPNcricinfoతో అన్నారు.
45
కెప్టెన్సీ ఇస్తే ఖచ్చితంగా జట్టును ముందుకు నడిపిస్తాను: వెంటటేశ్ అయ్యర్
తనకు కెప్టెన్సీ అవకాశం వస్తే తప్పకుండా జట్టును ముందుకు నడిపిస్తానని వెంకటేష్ అయ్యర్ చెప్పారు. "కేకేఆర్ కెప్టెన్సీ విషయంలో ఇంకా స్పష్టత లేదు. అయితే, అది నా దారికి వస్తే నేను ఖచ్చితంగా చేస్తాను. దీన్ని చేయకపోవడానికి ఎటువంటి కారణం లేదు" అని అన్నారు.
కెప్టెన్ "మంచి రోల్ మోడల్" గా ఉండటం ద్వారా "ఒక ఉదాహరణను చూపించాల్సిన" అవసరం ఉందని కూడా 30 ఏళ్ల అయ్యర్ భావిస్తున్నాడు. "మీ డ్రెస్సింగ్ రూమ్‌లో నాయకుడిగా ఉండటానికి మీకు కెప్టెన్ అనే ట్యాగ్ అవసరం లేదు. మీరు ఉదాహరణలు చూపాలి. గ్రౌండ్ లోపల, బయట మీరు మంచి రోల్ మోడల్‌గా ఉండాలి, నేను ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లో అలా చేస్తున్నాను" అని వెంకటేష్ అయ్యర్ పేర్కొన్నాడు.
55
Image credit: PTI
నేను కెప్టెన్ కాదు.. అభిప్రాయాలు గౌరవిస్తాను.. వెంటకేష్ అయ్యర్
"నేను ఎంపీ జట్టు కెప్టెన్‌ని కాదు, కానీ అభిప్రాయాలను గౌరవిస్తారు. ప్రతి వ్యక్తి - కొత్తవారైనా లేదా అనుభవజ్ఞులైనా.. రూ. 20 లక్షలు లేదా రూ. 20 కోట్లు ప్లేయర్ అయినా.. ఏదైనా సరే - మీ అభిప్రాయాన్ని వ్యక్తపరిచే స్వేచ్ఛ మీకు ఉంటే చాలు, అలాంటి వాతావరణంలో ఉండటం నాకు నిజంగా ఇష్టం" అని వెంకటేష్ అయ్యర్ అన్నారు. కాగా, వెంకటేష్ 51 ఐపీఎల్ మ్యాచ్‌ల్లో 1,326 పరుగులు చేశాడు.