ఇండియాలో మ్యాచులు అయితే వీళ్ల ఓవరాక్షన్ తట్టుకోలేం కానీ! - అంపైర్ నితిన్ మీనన్...

Published : Jun 17, 2023, 05:05 PM IST

ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌లో టీమిండియా ఓపెనర్ శుబ్‌మన్ గిల్ అవుట్ గురించి థర్డ్ అంపైర్ ఇచ్చిన నిర్ణయం తీవ్ర వివాదాస్పదమైంది. అంతకుముందు జరిగిన ఐపీఎల్ 2023 సీజన్‌లోనూ థర్డ్ అంపైర్ నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి..  

PREV
17
ఇండియాలో మ్యాచులు అయితే వీళ్ల ఓవరాక్షన్ తట్టుకోలేం కానీ!  - అంపైర్ నితిన్ మీనన్...
Image credit: Getty

2023 సీజన్‌లో వైడ్ బాల్‌కీ, నో బాల్‌కీ డీఆర్‌ఎస్ తీసుకునే విధంగా రూల్స్ ప్రవేశపెట్టింది బీసీసీఐ. అయితే ఈసారి కూడా థర్డ్ అంపైర్ ఇచ్చిన కొన్ని నిర్ణయాలు వివాదాస్పదమయ్యాయి..
 

27

ఐసీసీ ఎలైట్ ప్యానెల్‌లో చోటు దక్కించుకున్న భారత అంపైర్ నితిన్ మీనన్, ప్రస్తుతం యాషెస్ సిరీస్ 2023లో కూడా ఆఖరి మూడు మ్యాచులకు అంపైర్‌గా వ్యవహరించబోతున్నాడు..

37

‘ఇండియాలో మ్యాచులు అంటే స్టేడియం ఫుల్ అయిపోతుంది. చాలామంది భారత స్టార్ ప్లేయర్లు, అంపైర్లపై ప్రెషర్ పెట్టాలని శతవిధాలా ప్రయత్నిస్తారు. వాళ్లు చేసే ఓవరాక్షన్ అస్సలు తట్టుకోలేం, 50-50 ఉండే ఛాన్సులను తమ వైపు తిప్పుకోవాలని చూస్తారు..

47
Virat Kohl-Nitin Menon

అయితే అంపైర్లకు ఇలాంటి ప్రెషర్‌ని ఎలా తట్టుకోవాలో ముందుగానే శిక్షణ ఇస్తారు. అందుకే వాళ్లేం చేసినా, మా ఫోకస్ దెబ్బతీయాలని ఎంత ప్రయత్నించినా మా ఏకాగ్రత మాత్రం దెబ్బ తీయలేరు..

57

ఎలాటి పరిస్థితినైనా ఎదుర్కోగలిగే సామర్థ్యం ఉన్నవాళ్లే, పెద్ద పెద్ద స్టార్లు క్రియేట్ చేసే ప్రెషర్‌ని తట్టుకోగలరు. ఇండియాలో ఎన్నో మ్యాచులు ఆడాను. అది నాలో అమితమైన ఆత్మవిశ్వాసాన్ని నింపింది..

67

భారత ఉప ఖండంలో రెండేళ్లుగా అంపైరింగ్ చేస్తున్నా. బెస్ట్ మ్యాచ్ అధికారులతో పని చేయడం వల్ల చాలా విషయాలు నేర్చుకున్నా. రిఫరీగానే కాకుండా ప్లేయర్‌గా కూడా ఎన్నో అనుభవాలను ఎదుర్కొన్నా..

77

నేను, భారత అంపైర్లు అందరూ ఈ అనుభవాల నుంచి ఎన్నో పాఠాలు నేర్చుకున్నాం. జవగళ్‌ శ్రీనాథ్, మ్యాచ్ రిఫరీగా మారాక మ్యాచులను చూసే కోణమే మారిపోయింది. ప్లేయర్లతో ఎలా ఉండాలనే విషయాన్ని ఒంటబట్టించుకున్నాం..’ అంటూ కామెంట్ చేశాడు భారత అంపైర్ నితిన్ మీనన్..

click me!

Recommended Stories