ఐపీఎల్ 2020 సీజన్ తర్వాత టీమిండియాలో చోటు దక్కించుకుని, ఏకంగా టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ ఆడిన జట్టులో చోటు దక్కించుకోగలిగాడు యంగ్ వికెట్ కీపర్ ఇషాన్ కిషన్. ఐపీఎల్ 2022 సీజన్‌లో ముంబై ఇండియన్స్ తరుపున అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా ఉన్న ఇషాన్ కిషన్, సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20లోనూ హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు...
రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి మొదటి వికెట్‌కి 57 పరుగుల భాగస్వామ్యం, శ్రేయాస్ అయ్యర్‌తో కలిసి రెండో వికెట్‌కి 80 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పిన ఇషాన్ కిషన్... 48 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు చేశాడు...
26
Image credit: PTI
11వ టీ20 మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ కిషన్‌కి ఇది మూడో హాఫ్ సెంచరీ... కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో రెండు సిక్సర్లు, రెండు ఫోర్లతో 20 పరుగులు చేసిన ఇషాన్ కిషన్, అదే ఓవర్ ఆఖరి బంతికి ట్రిస్టన్ స్టబ్స్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు...
36
Ishan Kishan
‘రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ వరల్డ్ క్లాస్ ప్లేయర్లు. వాళ్లిద్దరూ టీమ్‌లో ఉన్నప్పుడు నాకు సపోర్ట్ చేయమని అడగలేను. కాబట్టి ప్రాక్టీస్ సెషన్స్‌లో బాగా ఆడి, తుది జట్టులో ప్లేస్ దక్కించుకోవడమే నా పని...
46
అవకాశం వచ్చినప్పుడు నేనేంటో నిరూపించుకోవడానికి నూరు శాతం కృషి చేస్తాను. నేను బాగా ఆడగలనని ఇంకా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి నా పూర్తి ఫోకస్ ఇప్పుడు దానిపైనే ఉంది...
56
రోహిత్, రాహుల్ ఎంతో సాధించారు. వాళ్లు ఎన్ని పరుగులు చేశారో అందరికీ తెలుసు. కాబట్టి నా కోసం వాళ్లను పక్కనబెట్టాలని కోరుకునేంత మూర్ఖుడిని కాదు...
66
అయితే సెలక్టర్లు, కోచ్‌ల దృష్టిలో పడేందుకు ఏం చేయాలో, ఎంత చేయాలో అంత చేయడానికి నేనెప్పుడూ సిద్దంగా ఉంటాను. అవకాశం వచ్చినప్పుడు బెస్ట్ ఇవ్వడమే నా వంతు... ’ అంటూ కామెంట్ చేశాడు ఇషాన్ కిషన్...