శ్రేయాస్ అయ్యర్ వల్లే టీమిండియా ఓడిందా... వాళ్లను చూసి అయ్యర్ భయపడుతున్నాడంటూ...

Published : Jun 10, 2022, 12:06 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ ముగిసిన తర్వాత సౌతాఫ్రికాతో జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో భారత జట్టు 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 211 పరుగుల భారీ స్కోరు చేసినా, బ్యాటింగ్‌కి స్వర్గధామంగా మారిన పిచ్‌పై ఆ స్కోరు ప్రత్యర్థిని కట్టడి చేయడానికి సరిపోలేదు...

PREV
111
శ్రేయాస్ అయ్యర్ వల్లే టీమిండియా ఓడిందా... వాళ్లను చూసి అయ్యర్ భయపడుతున్నాడంటూ...

ఐపీఎల్ 2022 సీజన్‌లో అదరగొట్టిన డేవిడ్ మిల్లర్‌తో పాటు ఐపీఎల్‌ 2022లో పెద్దగా అవకాశాలు దక్కించుకోలేకపోయిన రస్సీ వాన్ దేర్ దుస్సేన్ కలిసి నాలుగో వికెట్‌కి అజేయంగా 131 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పి సౌతాఫ్రికాకి ఘన విజయం అందించారు... 

211
Harshal Patel

ఐపీఎల్‌లో అదరగొట్టిన ఉమ్రాన్ మాలిక్, డెత్ ఓవర్లలో స్టార్ బ్యాటర్లకు చుక్కలు చూపించిన అర్ష్‌దీప్ సింగ్‌లకు తుది జట్టులో చోటు కల్పించని టీమిండియా.. భారీ మూల్యమే చెల్లించుకుంది. హర్షల్ పటేల్, భువనేశ్వర్ కుమార్, యజ్వేంద్ర చాహాల్ ఫెయిల్ అవ్వడం భారత జట్టుపై తీవ్ర ప్రభావం చూపింది...

311
Image credit: PTI

అయితే మొదటి టీ20 మ్యాచ్‌లో ఓటమి తర్వాత భారత మిడిల్ ఆర్డర్ బ్యాటర్ శ్రేయాస్ అయ్యర్‌పై ఎక్కువగా ట్రోల్స్ వస్తుండడం విశేషం. దీనికి కారణం అతని బ్యాటింగ్ స్టైల్...

411
Image credit: PTI

విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ ఈ సిరీస్‌కి దూరంగా ఉండడంతో వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కి వచ్చిన శ్రేయాస్ అయ్యర్, మొదటి 8 బంతుల్లో 3 సిక్సర్లతో 22 పరుగులు చేశాడు... అయితే ఆ తర్వాత అతని బ్యాటింగ్ స్టైల్‌ పూర్తిగా మారిపోయింది.

511

డాట్ బాల్స్ ఆడుతూ సింగిల్స్ తీయడానికి కూడా టైమ్ తీసుకుంటూ విలువైన సమయాన్ని వృధా చేశాడు శ్రేయాస్ అయ్యర్. 27 బంతుల్లో ఓ ఫోర్, 3 సిక్సర్లతో 36 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, 17వ ఓవర్ మొదటి బంతికి అవుట్ అయ్యాడు...

611

మొదటి 8 బంతుల్లో 22 పరుగులు చేసిన శ్రేయాస్ అయ్యర్, ఆ తర్వాత 19 బంతుల్లో కలిపి 14 పరుగులు మాత్రమే చేయడంతో టీమిండియా ఓటమికి పరోక్షంగా అతనే కారణమయ్యాడని అంటున్నారు క్రికెట్ ఫ్యాన్స్...

711
Image credit: PTI

నెమ్మదిగా ఆడడానికి టీమిండియా వెంటవెంటనే వికెట్లు కోల్పోలేదు. అదీ కాకుండా డగౌట్‌లో హార్ధిక్ పాండ్యా, దినేశ్ కార్తీక్ వంటి హిట్టర్లు బ్యాటింగ్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో శ్రేయాస్ అయ్యర్ ఇలా దూకుడుగా ఆరంభించి, జిడ్డు బ్యాటింగ్ చేయడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు అభిమానులు...

811

సూర్యకుమార్ యాదవ్ ఎంట్రీ తర్వాత టీమ్‌లో శ్రేయాస్ అయ్యర్ స్థానానికి గ్యారెంటీ లేకుండా పోయింది. లంకతో సిరీస్ ఆరంభానికి ముందు సూర్యకుమార్ యాదవ్ గాయపడడంతో అయ్యర్‌కి అవకాశం వచ్చింది. ఆ అవకాశాన్ని చక్కగా వాడుకున్న అయ్యర్, మూడు అజేయ హాఫ్ సెంచరీలు చేసి అదరగొట్టాడు...

911

సౌతాఫ్రికాతో సిరీస్‌కి కూడా సూర్యకుమార్ యాదవ్ అందుబాటులో లేడు. అయితే దినేశ్ కార్తీక్, హార్ధిక్ పాండ్యా వంటి సీనియర్ హిట్టర్లు టీమ్‌లోకి రావడంతో జట్టులో తన స్థానం ఉంటుందా? లేదా? అనే శ్రేయాస్ అయ్యర్ భయపడుతుండొచ్చని, అందుకే భారీ స్కోరు చేయాలనే ఉద్దేశంతో అతి జాగ్రత్తగా ఆడి ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు మరికొందరు... 

1011

శ్రేయాస్ అయ్యర్ ఆడిన ఆఖరి 3 ఓవర్లలో కనీసం 30-35 పరుగులు చేసినా టీమిండియా పరిస్థితి మరోలా ఉండేదని, సౌతాఫ్రికా ముందు 230-240 స్కోరు పెట్టే అవకాశం ఉండేదని విశ్లేషిస్తున్నారు క్రికెట్ ఎక్స్‌పర్ట్స్...

1111
Rishabh Pant

అదీకాకుండా రుతురాజ్ గైక్వాడ్ అవుటైన తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్, శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్‌గా ఆడుతున్న మొదటి మ్యాచ్‌లో ఒక్క బంతి కూడా ఆడకుండానే అవుటయ్యే వాడు. కేశవ్ మహరాజ్ బౌలింగ్‌లో రనౌట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పుకున్నాడు పంత్. ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్సీ పోవడానికి కారణమై తన కంటే ముందు టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు తీసుకున్న పంత్‌పై అయ్యర్ ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలా చేశాడా? అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు కొందరు నెటిజన్లు...

Read more Photos on
click me!

Recommended Stories