దినేశ్ కార్తీక్ మొదటి టీ20 ఆడినప్పుడు రిషబ్ పంత్ వయసెంతో తెలుసా...

First Published Jun 10, 2022, 1:30 PM IST

ఐపీఎల్ 2022 సీజన్ పర్ఫామెన్స్ కారణంగా మూడేళ్ల బ్రేక్ తర్వాత టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చాడు సీనియర్ వికెట్ కీపర్ బ్యాటర్ దినేశ్ కార్తీక్. టీమిండియా ఆడిన మొట్టమొదటి టీ20 మ్యాచ్‌లో సభ్యుడిగా ఉన్న దినేశ్ కార్తీక్, 16 ఏళ్ల తర్వాత జరుగుతున్న నేటి సిరీస్‌లో ఆడుతున్న ఏకైక ప్లేయర్...

భారత్, సౌతాఫ్రికా మధ్య జరిగిన మొట్టమొదటి మ్యాచ్‌లో దినేశ్ కార్తీక్‌తో పాటు ఆడిన ప్లేయర్లు అందరూ ఇప్పటికే క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు. ఎమ్మెస్ ధోనీ వంటి ఒకరిద్దరు మినహా ఎవ్వరూ ఫ్రాంఛైజీ క్రికెట్‌ కూడా ఆడడం లేదు...

వీరేంద్ర సెహ్వాగ్, అనిల్ కుంబ్లే, రాహుల్ ద్రావిడ్, ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ వంటి కెప్టెన్ల కెప్టెన్సీ ఆడిన దినేశ్ కార్తీక్, తాజాగా సౌతాఫ్రికాతో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో రిషబ్ పంత్ కెప్టెన్సీలో మ్యాచ్ ఆడాడు...

Latest Videos


దినేశ్ కార్తీక్ అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన సమయంలో రిషబ్ పంత్ వయసెంతో తెలుసా... 7 ఏళ్లు. కార్తీక్, టీమిండియా తరుపున మొట్టమొదటి టీ20 మ్యాచ్ ఆడి, ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ గెలిచిన సమయంలో రిషబ్ పంత్, రెండో క్లాస్‌లో కూర్చొని... బీ ఫర్ బ్యాట్ అంటూ పాఠాలు చదువుతున్నాడన్నమాట...
 

అంతేకాదు 2016లో ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో అండర్ 19 వరల్డ్ కప్ టోర్నీలో పాల్గొన్నాడు రిషబ్ పంత్. ఈ టోర్నీలో భారత జట్టు ఫైనల్‌లో వెస్టిండీస్ చేతుల్లో ఓడి రన్నరప్‌గా నిలిచింది...

సరిగ్గా ఆరేళ్ల తర్వాత రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా ఆడాడు. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్‌ టీమ్‌లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలో రెండు సీజన్లు ఆడిన రిషబ్ పంత్, ఇప్పుడు అతని కంటే ముందు టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు చేపట్టడం విశేషం...

ఇలా ఇద్దరు వికెట్ కీపర్ బ్యాటర్, కెప్టెన్లు... దేశవాళీ టోర్నీల్లో, 2021 సీజన్‌కి ముందు ఐపీఎల్‌లోనూ ఎప్పుడూ కెప్టెన్సీ చేసిన అనుభవం లేని రిషబ్ పంత్ కెప్టెన్సీలో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ ఆడుతుండడం విశేషం...

click me!