నాకు 4 నెలలివ్వండి.. అతడిని ఇండియాలో బెస్ట్ ఆల్ రౌండర్ ను చేస్తా : మహ్మద్ షమీ

Published : Jun 10, 2022, 12:14 PM IST

Mohammed Shami: ఐపీఎల్-15 లో లక్నో సూపర్ జెయిట్స్ తరఫున ఆడిన మోహ్సిన్ ఖాన్  తన బౌలింగ్ తో అందరినీ ఆకట్టుకున్నాడు. అతడి బౌలింగ్ శైలి  ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ ను  పోలి ఉంటుంది. 

PREV
17
నాకు 4 నెలలివ్వండి.. అతడిని ఇండియాలో బెస్ట్ ఆల్ రౌండర్ ను చేస్తా : మహ్మద్ షమీ

ఇటీవలే ముగిసిన ఐపీఎల్ లో  లక్నో సూపర్ జెయింట్స్ తరఫున ఆడిన మోహ్సిన్ ఖాన్ తన పేస్ తో పాటు వైవిధ్యమైన బంతులతో అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తాడు.  టోర్నీ ఆసాంతం నిలకడగా రాణించిన అతడు త్వరలోనే భారత జట్టులోకి అరంగేట్రం చేయడానికి ఉవ్విళ్లూరుతున్నాడు. 

27

బౌలింగ్ లో ఆసీస్ పేసర్ మిచెల్ స్టార్క్ శైలిని పోలి ఉండే మోహ్సిన్ ఖాన్  వ్యక్తిగత కోచ్ బద్రుద్దీన్ సిద్ధిఖీ తాజాగా అతడి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మహ్మద్ షమీతో  కలిసి మోహ్సిన్ ఖాన్ గురించి జరిపిన  చర్చకు సంబంధించిన విషయాలను సిద్ధిఖీ వెల్లడించాడు. 

37

సిద్ధిఖీ మాట్లాడుతూ.. ‘‘ఐపీఎల్-15 వేలం జరుగుతున్న రోజు నేను షమీ ఫామ్ హౌజ్ లో ఉన్నా. అతడితో కలిసి వేలం ప్రక్రియను టీవీలో చూస్తున్నాం. షమీని గుజరాత్ దక్కించుకుంది. మోహ్సిన్ ఖాన్ ను  లక్నో (రూ. 20 లక్షలు)  దక్కించుకుంది. 
 

47

అప్పుడు షమీ నాతో.. మీరు మోహ్సిన్ ను నాకు నాలుగు నెలలు ఇస్తే నేను అతడిని ఇండియాలోనే బెస్ట్ ఆల్ రౌండర్ ను చేస్తాను. అతడు బౌలరే కాదు.. మంచి బ్యాటర్ కూడా. కెఎల్ రాహుల్ (లక్నో కెప్టెన్) కూడా ఇది గుర్తించాడు. ఆట గురించి అతడు బాగా అర్థం చేసుకుంటాడు..’ అని నాతో అన్నాడు.  

57

మనకు చాలా మంది బౌలర్లున్నారు. కానీ ఏ బ్యాటర్ కు ఏ బాల్ వేయాలనే అవగాహన కలిగిన వాళ్లు చాలా తక్కువమంది. ఇవాళ షమీ పెద్ద బౌలర్.  కానీ అతడెప్పుడూ యువకులను ప్రోత్సహించడానికి సిద్ధంగా ఉంటాడు..’’ అని సిద్ధిఖీ గుర్తు చేసుకున్నాడు.

67

ఈ సీజన్ లో లక్నో తరఫున ఆడిన మోహ్సిన్.. 9 మ్యాచులలో 14 వికెట్లు పడగొట్టాడు.  ఈ సీజన్ లో అతి తక్కువ (మినిమమ్ 30 ఓవర్లు వేసి) ఎకానమీ కలిగిన రెండో బౌలర్ గా నిలిచాడు. మోహ్సిన్ బౌలింగ్ ఎకానమీ 5.97 కాగా.. అగ్రస్థానంలో నిలిచిన కేకేఆర్ బౌలర్ సునీల్ నరైన్ ఎకానమీ 5.57గా ఉంది.  

77

మోహ్సిన్ బౌలరే కాదు మంచి బ్యాటర్ కూడా. అయితే  ఐపీఎల్ లో అతడికి పెద్దగా బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. కానీ అవకాశమొస్తే తనదైన శైలిలో చెలరేగుతాడని అతడి కోచ్ సిద్ధిఖీ చెబుతున్నాడు. 

click me!

Recommended Stories