ధోనీ వల్లే కాలేదు, రిషబ్ పంత్ చేసి చూపించాడు... విరాట్ కోహ్లీ తర్వాత ఆ ఫీట్ సాధించి...

First Published Jun 15, 2022, 11:33 AM IST

లక్కీగా కెప్టెన్సీ దక్కించుకున్నా, మిగిలిన వారితో పోలిస్తే తనలో కెప్టెన్సీ స్కిల్స్‌కి మాత్రం కొదువ లేదని నిరూపించుకుంటున్నాడు రిషబ్ పంత్... సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి రెండు టీ20ల్లో ఓటమి పాలైన భారత జట్టు, విశాఖలో జరిగిన మూడో టీ20లో గెలిచి సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకుంది...

Image credit: PTI

విశాఖలో జరిగిన మూడో టీ20లో 48 పరుగుల తేడాతో విజయం అందుకుంది భారత జట్టు. రుతురాజ్ గైక్వాడ్ 57, ఇషాన్ కిషన్ 54, హార్ధిక్ పాండ్యా 31 పరుగులతో రాణించడంతో 20 ఓవర్లలో 179 పరుగులు చేసింది టీమిండియా...

Image credit: PTI

180 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన సౌతాఫ్రికా 19.1 ఓవర్లలో 131 పరుగులకి ఆలౌట్ అయ్యింది. హర్షల్ పటేల్ 3.1 ఓవర్లలో 25 పరుగులిచ్చి 4 వికెట్లు తీయగా యజ్వేంద్ర చాహాల్ 3 వికెట్లు పడగొట్టాడు. 
 

Latest Videos


Image credit: PTI

స్వదేశంలో సౌతాఫ్రికాని టీ20ల్లో ఓడించిన రెండో కెప్టెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్. ఇంతకుముందు భారత మాజీ సారథి విరాట్ కోహ్లీ మాత్రమే ఈ ఫీట్ సాధించాడు...
 

అంతకుముందు 2015లో సౌతాఫ్రికాతో స్వదేశంలో జరిగిన టీ20 సిరీస్‌ని 2-0 తేడాతో కోల్పోయింది ఎమ్మెస్ ధోనీ టీమ్. ఆ తర్వాత 2018లో సౌతాఫ్రికాలో 2-1 తేడాతో టీ20 సిరీస్ గెలిచి రికార్డు క్రియేట్ చేశాడు విరాట్ కోహ్లీ...

ఆ తర్వాత 2019లో భారత పర్యటనకి వచ్చిన సౌతాఫ్రికా, మొహాలీలో జరిగిన టీ20లో 7 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. స్వదేశంలో సౌతాఫ్రికాకి టీ20ల్లో ఓడించిన మొదటి కెప్టెన్‌గా కోహ్లీ నిలవగా, తాజాగా విశాఖ మ్యాచ్‌లో ఆ లిస్టులో చేరాడు రిషబ్ పంత్...

Rishabh Pant

తెంప భవుమా టీమ్‌ని వైట్ బాల్ క్రికెట్‌లో ఓడించిన మొదటి భారత కెప్టెన్‌గా నిలిచాడు రిషబ్ పంత్. ఇంతకుముందు భవుమా కెప్టెన్సీలో సఫారీ టూర్‌లో వన్డే సిరీస్‌ను 3-0 తేడాతో ఓడిపోయింది కెఎల్ రాహుల్ కెప్టెన్సీలోని భారత జట్టు...

మొదటి రెండు టీ20ల్లో పెద్దగా ప్రభావం చూపించలేకపోయిన యజ్వేంద్ర చాహాల్, హర్షల్ పటేల్‌లను అద్భుతంగా వాడి, టీమ్‌లో మార్పులు చేయకుండానే విజయాన్ని అందుకుని కెప్టెన్‌గా నిరూపించుకున్నాడు రిషబ్ పంత్...

click me!