ఇంకో మ్యాచ్ మిగిలే ఉంది, ఎంత ఎగురుతారో ఎగరండి... సౌతాఫ్రికా ప్లేయర్లకి జస్ప్రిత్ బుమ్రా వార్నింగ్...

Published : Jan 08, 2022, 04:35 PM IST

సౌతాఫ్రికా, భారత్ మధ్య జరిగే మూడో టెస్టు మ్యాచ్‌ ఆసక్తికరంగా మారింది. మొదటి టెస్టులో టీమిండియా, రెండో టెస్టులో సౌతాఫ్రికా గెలవడంతో కేప్‌ టౌన్‌లో జరిగే  మూడో టెస్టు సిరీస్ డిసైడర్‌గా మారనుంది...

PREV
18
ఇంకో మ్యాచ్ మిగిలే ఉంది, ఎంత ఎగురుతారో ఎగరండి... సౌతాఫ్రికా ప్లేయర్లకి జస్ప్రిత్ బుమ్రా వార్నింగ్...

ఇప్పటిదాకా జరిగిన రెండు టెస్టుల్లో సఫారీ బౌలర్లు కగిసో రబాడా 13 వికెట్లు పడగొట్టగా, మార్కో జాన్సెన్ 12 వికెట్లు తీశాడు. లుంగి ఇంగిడికి 11 వికెట్లు దక్కాయి... సఫారీ బౌలర్లతో పోలిస్తే భారత బౌలర్ల నుంచి ఆ స్థాయి పర్ఫామెన్స్ రాలేదు...

28

మహ్మద్ షమీ రెండు మ్యాచుల్లో 11 వికెట్లు తీస్తే, శార్దూల్ ఠాకూర్ 10 వికెట్లు తీశాడు. జస్ప్రిత్ బుమ్రాకి ఆరు వికెట్లు మాత్రమే దక్కగా, రవిచంద్రన్ అశ్విన్, మహ్మద్ సిరాజ్ చెరో మూడు వికెట్లు తీశారు...

38

జోహన్‌బర్గ్‌లో జరిగిన రెండో టెస్టులో కెఎల్ రాహుల్‌తో పాటు జస్ప్రిత్ బుమ్రాని సెడ్జింగ్ చేశారు సౌతాఫ్రికా ప్లేయర్లు. శార్దూల్ ఠాకూర్‌ని కూడా హేళన చేస్తూ, విసిగించారు....

48

హనుమ విహారి బ్యాటింగ్ చేస్తున్న సమయంలో సఫారీ బౌలర్ వేసిన ఓ బంతి, అతనికి బలంగా తాకింది. దీంతో ఫిజియో నితిన్ పటేల్ క్రీజులోకి వచ్చి, చికిత్స అందించాడు...

58

ఈ సమయంలో జస్ప్రిత్ బుమ్రా చేసిన కామెంట్లు, ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘భయంతో స్టంప్ మైక్ దగ్గరికి వచ్చి నిలబడ్డారు. ఇంకో మ్యాచ్ మిగిలే ఉంది, చూసుకుందాం...

68

ఇప్పుడు ఎంత ఎగురుతారో ఎగరండి, తర్వాతి మ్యాచ్‌లో మేమేంటో చూపిస్తాం... ఇప్పుడు ఎవరెవరు వింటున్నారో వినండి...’ అంటూ వ్యాఖ్యలు చేశాడు జస్ప్రిత్ బుమ్రా...

78

జనవరి 11న కేప్ టౌన్ వేదికగా భారత్, సౌతాఫ్రికా మధ్య మూడో టెస్టు మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ గెలిచిన జట్టుకే టెస్టు సిరీస్ వశమవుతుంది...

88

గాయం కారణంగా రెండో టెస్టులో బరిలో దిగని టెస్టు సారథి విరాట్ కోహ్లీ, మూడో టెస్టులో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు. విరాట్ కోహ్లీ కోసం తుదిజట్టులో ఎవరు తమ స్థానాన్ని త్యాగం చేస్తారనేది ఆసక్తికరంగా మారింది.

click me!

Recommended Stories