శ్రేయాస్ అయ్యర్‌కి ఎంపిక చేయకపోవడానికి కారణం ఇదే... టీమిండియా టెంపరరీ కెప్టెన్ కెఎల్ రాహుల్...

First Published Jan 3, 2022, 3:45 PM IST

సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టెస్టులో 49 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది భారత జట్టు. కెప్టెన్ విరాట్ కోహ్లీ వెన్నునొప్పితో బాధపడుతూ ఉండడంతో జోహన్‌బర్న్ టెస్టులో బరిలో దిగలేదు...  విరాట్ స్థానంలో హనుమ విహారికి తుది జట్టులో చోటు దక్కింది...

విరాట్ కోహ్లీ స్థానంలో యంగ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌ను ఎందుకు ఎంపిక చేయలేదని సోషల్ మీడియాలో చర్చ మొదలైంది...

కాన్పూర్ టెస్టులో ఆరంగ్రేటం చేసి, తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన శ్రేయాస్ అయ్యర్‌కి ఆ తర్వాత మరో అవకాశం ఎందుకు ఇవ్వడం లేదని టీమ్ మేనేజ్‌మెంట్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి...

అయితే శ్రేయాస్ అయ్యర్‌ని ఎంపిక చేయడానికి కారణం ఉంది. రెండో టెస్టు ఆరంభానికి ముందు రోజు శ్రేయాస్ అయ్యర్, తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతున్నాడు...

అందుకే రెండో టెస్టు సెలక్షన్‌కి అతను అందుబాటులో లేడు. దీంతో విదేశాల్లో ఆడిన అనుభవం ఉన్న హనుమ విహారికి విరాట్ కోహ్లీ స్థానంలో చోటు దక్కింది...

ఆస్ట్రేలియా 2020-21 పర్యటనలో గత ఏడాది జనవరిలో జరిగిన సిడ్నీ టెస్టులో ఆడిన హనుమ విహారి, మళ్లీ సరిగ్గా ఏడాది తర్వాత ఈ ఏడాది మొదటి టెస్టులో బరిలో దిగడం విశేషం. 

14 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 36 పరుగులు చేసిన భారత జట్టు, ఆ తర్వాత వెంటవెంటనే వికెట్లు కోల్పోయి 49/3 స్థితికి చేరుకుంది...

37 బంతుల్లో 5 ఫోర్లతో 26 పరుగులు చేసిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్, మార్కో జాన్సెస్ బౌలింగ్‌లో వికెట్ కీపర్‌ వెరెన్నేకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. బ్రేక్ తర్వాత మొదటి బంతికే వికెట్ కోల్పోయింది భారత జట్టు...

ఆ తర్వాత ఛతేశ్వర్ పూజారా 33 బంతులాడి కేవలం 3 పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ చేరాడు. డువానే ఓలివర్ బౌలింగ్‌లో భవుమాకి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు పూజారా...

ఆ తర్వాతి బంతికే అజింకా రహానే కూడా సేమ్ స్టైల్‌లో గోల్డెన్ డకౌట్ అయ్యాడు. రహానే టెస్టు కెరీర్‌లో ఇదే మొట్టమొదటి గోల్డెన్ డకౌట్ కావడం విశేషం...

గత మ్యాచ్‌లో పూజారా గోల్డెన్ డక్ కాగా, నేటి మ్యాచ్‌లో రహానే ఆ ఫీట్ సాధించాడు. లంచ్ బ్రేక్ విరామానికి 26 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 53 పరుగులు చేసింది భారత జట్టు...

click me!