ఆరు టెస్టులు, ఆరుగురు కెప్టెన్లు... జోహన్‌బర్గ్‌లో టీమిండియాకి ఆ విషయంలో...

Published : Jan 03, 2022, 03:18 PM IST

సౌతాఫ్రికా టూర్‌లో సెంచూరియన్ టెస్టు గెలిచి, చరిత్ర సృష్టించిన భారత జట్టు... రెండో టెస్టులో విరాట్ కోహ్లీ లేకుండా బరిలో దిగుతోంది. వెన్నునొప్పితో బాధపడుతున్న విరాట్ గైర్హజరీతో కెఎల్ రాహుల్‌కి కెప్టెన్సీ దక్కింది...

PREV
19
ఆరు టెస్టులు, ఆరుగురు కెప్టెన్లు... జోహన్‌బర్గ్‌లో టీమిండియాకి ఆ విషయంలో...

సౌతాఫ్రికాలోని జోహన్‌బర్గ్‌లో ఇప్పటిదాకా ఆరు టెస్టు మ్యాచులు ఆడింది భారత జట్టు. అయితే ఆరు టెస్టుల్లోనూ ఆరుగురు భిన్నమైన కెప్టెన్లతో బరిలో దిగింది టీమిండియా...

29

1992లో మహ్మద్ అజారుద్దీన్ కెప్టెన్సీలో జోహన్‌బర్గ్‌లో మొట్టమొదటి టెస్టు మ్యాచ్ ఆడింది భారత జట్టు. ఈ టూర్‌లో నాలుగు టెస్టులాడిన భారత జట్టు, మూడు డ్రాలు చేసుకుని, ఓ మ్యాచ్ ఓడి... 1-0 తేడాతో సిరీస్ కోల్పోయింది...

39

1997లో సచిన్ టెండూల్కర్ కెప్టెన్సీలో జోహన్‌బర్గ్‌లో టెస్టు మ్యాచ్ ఆడింది టీమిండియా. ఈ సిరీస్‌లో మొదటి రెండు టెస్టుల్లో ఓడిన టీమిండియా, జోహన్‌బర్గ్‌లో జరిగిన టెస్టును డ్రాగా ముగించగలిగింది...

49

2006లో రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీలో సౌతాఫ్రికా పర్యటనకి వెళ్లిన భారత జట్టు, జోహన్‌బర్గ్‌లో జరిగిన టెస్టులో 123 పరుగుల తేడాతో గెలిచింది. అయితే ఆ తర్వాత రెండు మ్యాచుల్లోనూ ఓడి 2-1 తేడాతో టెస్టు సిరీస్ కోల్పోయింది...

59

2013లో మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వంలో సఫారీ పర్యటనకి వెళ్లింది టీమిండియా. ఈ పర్యటనలో జోహన్‌బర్న్‌లో జరిగిన టెస్టు మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. ఆ తర్వాతి మ్యాచ్‌లో 10 వికెట్ల తేడాతో ఓడి 1-0 తేడాతో సిరీస్ కోల్పోయింది భారత జట్టు...

69

2010 సౌతాఫ్రికా పర్యటనలో మూడు టెస్టులు ఆడిన టీమిండియా, 1-1 తేడాతో సిరీస్‌ను డ్రా చేసుకుంది. అయితే ఈ పర్యటనలో జోహన్‌బర్గ్‌లో టెస్టు మ్యాచ్ ఆడలేదు భారత జట్టు...

79

2018 సఫారీ పర్యటనలో విరాట్ కోహ్లీ కెప్టెన్‌గా వ్యవహరించాడు. మొదటి రెండు టెస్టుల్లో ఓడిన విరాట్ సేన, జోహన్‌బర్గ్‌లో జరిగిన మూడో టెస్టులో 63 పరుగుల తేడాతో నెగ్గి... 2-1 తేడాతో సిరీస్ కోల్పోయింది...

89

2022లో జోహన్‌బర్న్‌లో జరుగుతున్న టెస్టుకి కెఎల్ రాహుల్ కెప్టెన్‌గా వ్యవహరించబోతున్నాడు. గాయం కారణంగా జోహన్‌బర్న్‌లో రెండు టెస్టులకు కెప్టెన్సీ చేసిన భారత సారథిగా నిలిచే అరుదైన రికార్డును కోల్పోవాల్సి వచ్చింది విరాట్ కోహ్లీ...

99

కర్ణాటక నుంచి టీమిండియా టెస్టు సారథిగా మారిన నాలుగో ప్లేయర్‌గా నిలిచాడు కెఎల్ రాహుల్. ఇంతకుముందు గుండప్ప విశ్వనాథ్ రెండు టెస్టులకు, రాహుల్ ద్రావిడ్ 25 టెస్టులకు, అనిల్ కుంబ్లే 14 టెస్టులకు కెప్టెన్సీ చేశారు...

Read more Photos on
click me!

Recommended Stories