ఇండియా, పాకిస్తాన్ మధ్య మ్యాచ్ అంటే ఓ రకమైన యుద్ధవాతావరణం నెలకొంటుంది. సాధారణంగా క్రికెట్ మ్యాచులు చూడని వాళ్లు కూడా, పాక్‌తో మ్యాచ్ అనగానే టీవీలకు అతుక్కుపోతారు. ఎప్పుడూ లేని దేశభక్తి, స్వాతంత్య్ర దినోత్సవం రోజున పుట్టుకొచ్చినట్టు, పాక్‌తో మ్యాచ్ అనగానే త్రివర్ణ జెండాలు పట్టుకుని ఆవేశంతో ఊగిపోతారు చాలామంది. ఇవన్నీ చూసి పాక్‌తో మ్యాచ్ అంటే ఏదో ఊహించుకున్నాడట భారత బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్...
హంగ్ కాంగ్‌తో జరిగిన మ్యాచ్‌లో 26 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 68 పరుగులు చేసి అదరగొట్టాడు సూర్యకుమార్ యాదవ్. పాకిస్తాన్‌తో జరుగుతున్న సూపర్ 4 మ్యాచ్‌లో 10 బంతుల్లో 2 ఫోర్లతో 13 పరుగులు చేసి అవుట్ అయ్యాడు సూర్య...
26
Suryakumar Yadav-Babar Azam
‘నా చిన్నప్పుడు ఇండియా, పాకిస్తాన్ మ్యచ్ గురించి చాలా వినేవాడిని. దీన్ని దాయాదుల సమరం, శత్రువుల మధ్య మ్యాచ్...ఇలా చాలా చాలా అనేవాళ్లు. అయితే నేను పాకిస్తాన్‌తో మ్యాచ్ ఆడినప్పుడు ఇలా ఏమీ నాకు అనిపించలేదు..
36
ఇది కూడా ఓ సాధారణ మ్యాచ్ మాత్రమే. అందరిలో మ్యాచ్ లాగేనే మేమూ ప్రిపేర్ అయ్యాం, సేమ్ అలాగే ఆడాం. అన్నీ రొటీన్‌గానే జరిగాయి. పాక్‌తో మ్యాచ్ ఆడుతున్నాం అనే ఫీలింగ్ నాకేమీ కొత్తగా అనిపించలేదు.
46
భారత్, పాకిస్తాన్ మ్యాచ్ కూడా ఓ సాధారణ మ్యాచ్ మాత్రమే. గ్రౌండ్ బయట మాత్రమే దీని గురించి చాలా ఎమోషన్స్ పుట్టుకొస్తాయి. గ్రౌండ్‌లో మాత్రం అవేమీ ఉండవు. మేం మామూలుగా మ్యాచ్ ఆడాం... సెపరేట్ ఎమోషన్స్ ఏమీ ఫీల్ అవ్వలేదు..
56
Suryakumar Yadav
నా వరకూ నేను ప్రతీ మ్యాచ్ కోసం 100 శాతం ప్రిపేర్ అవుతాను. నాలుగేళ్లుగా క్రికెట్ మ్యాచ్ ముగిసిన తర్వాత ఇంటికెళ్లి టీవీలో నా బ్యాటింగ్ ఎలా సాగిందో మరోసారి చూసుకుంటా... ఎక్కడ తప్పు జరిగిందో విశ్లేషించుకుంటా...
66
Image credit: Getty
స్వీప్ షాట్ ఆడడం నాకు చాలా ఇష్టం. ఫాస్ట్ బౌలర్ల బౌలింగ్‌లో ఆ షాట్ ఆడితే ఫీలింగ్ వేరేగా ఉంటుంది. గ్రౌండ్‌లో దిగిన తర్వాత ఏ బాల్ ఎలా ఆడాలనే దాని గురించి పెద్దగా ఆలోచించను, ఫ్లోలో వెళ్లిపోతా...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్...