ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ రూట్‌లోనే రోహిత్ శర్మ... అందుకే యజ్వేంద్ర చాహాల్‌కి ఛాన్స్ ఇవ్వకుండా...

First Published Nov 20, 2021, 1:14 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీ ముగింపుతోనే భారత క్రికెట్‌లో కొత్త శకానికి నాంది పడింది. టీమిండియా టీ20 కెప్టెన్‌గా రోహిత్ శర్మ, హెడ్ కోచ్‌గా రాహుల్ ద్రావిడ్ బాధ్యతలు తీసుకోవడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగిపోయాయి...

భారత అభిమానుల అంచనాలకు తగ్గట్టుగానే న్యూజిలాండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌, మరో మ్యాచ్ మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది టీమిండియా...

అయితే మొదటి రెండు టీ20 మ్యాచుల్లోనూ భారత స్పిన్నర్ యజ్వేంద్ర చాహాల్‌కి చోటు ఇవ్వకపోవడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది... 

టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీకి ఎంపిక చేసిన జట్టులో చాహాల్ పేరు లేకపోవడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. యూఏఈ పిచ్‌లపై అద్భుతంగా రాణించిన చాహాల్‌ని కాదని, రాహుల్ చాహార్‌ని ఎంపిక చేయడంపై సెలక్టర్లు ట్రోలింగ్ ఎదుర్కోవాల్సి వచ్చింది...

టీ20 వరల్డ్‌కప్ ముగిసిన తర్వాత న్యూజిలాండ్ జరిగే టీ20 సిరీస్‌కి ప్రకటించిన జట్టులో యజ్వేంద్ర చాహాల్ పేరు ఉంది. దీంతో చాహాల్ మళ్లీ బిజీగా మారిపోతాడని, పరిమిత ఓవర్ల క్రికెట్‌లో తన పొజిషన్‌ను తిరిగి తీసుకుంటాడని భావించారంతా...

అయితే అలా జరగలేదు. మొదటి రెండు టీ20 మ్యాచుల్లో యజ్వేంద్ర చాహాల్‌కి చోటు దక్కలేదు. నాలుగేళ్ల తర్వాత టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చిన సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్‌ని ఆడించిన రోహిత్ శర్మ, అతనితో పాటు అక్షర్ పటేల్‌కి అవకాశం ఇచ్చాడు...

సుదీర్ఘ కాలం తర్వాత రీఎంట్రీ ఇచ్చిన రవిచంద్రన్ అశ్విన్, వరుసగా ఐదు మ్యాచుల్లోనూ మంచి ఎకానమీతో బౌలింగ్ చేస్తూ, కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇస్తున్నాడు...

అయితే మంచి ఫామ్‌లో ఉన్న యజ్వేంద్ర చాహాల్‌కి అవకాశం ఇవ్వకపోవడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. భారత కెప్టెన్లలో సౌరవ్ గంగూలీ నుంచి విరాట్ కోహ్లీ దాకా అందరూ టీమిండియాపై తమదైన ముద్ర వేశారు...

గంగూలీ టైమ్‌లో దాదాకి సెపరేట్ టీమ్ ఉండేది. అలాగే ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో మాహీకి సెపరేట్ జట్టు ఉండేది. వాళ్లు రాణించినా, రాణించకపోయినా వాళ్లనే కొనసాగించేవాళ్లు... మరీ విమర్శలు వస్తే, వేరే వాళ్లకి అవకాశం ఇచ్చేవాళ్లు...

గంగూలీ కెప్టెన్సీలో అదరగొట్టిన అజిత్ అగార్కర్, ఇర్ఫాన్ పఠాన్ వంటి ప్లేయర్లు, ఆ తర్వాత ఆ రేంజ్‌లో పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయారు. ధోనీ కెప్టెన్సీలో సురేష్ రైనా, ఆర్‌పీ సింగ్ విషయంలోనూ జరిగింది ఇంతే...

అలాగే విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో యజ్వేంద్ర చాహాల్‌కి టీ20, వన్డేల్లో తప్పనిసరి ప్లేస్ ఉండేది. భారీగా పరుగులు సమర్పించినా, వికెట్లు తీయలేకపోయినా చాహాల్‌ని కొనసాగించేవాడు విరాట్ కోహ్లీ...

ఎమ్మెస్ ధోనీ, విరాట్ కోహ్లీ, సౌరవ్ గంగూలీల మాదిరిగానే తనకంటూ సెపరేట్ టీమ్‌ను తయారుచేసుకోవడంపై దృష్టి పెట్టిన రోహిత్ శర్మ... యజ్వేంద్ర చాహాల్‌కి టీమ్‌లో ప్లేస్ ఇవ్వడం లేదని టాక్ వినబడుతోంది...

2017 తర్వాత పరిమిత ఓవర్ల క్రికెట్ ఆడని రవిచంద్రన్ అశ్విన్‌కి, టీ20 వరల్డ్‌ కప్ 2021 టోర్నీలో చోటు దక్కడానికి కూడా రోహిత్ శర్మ సిఫారసే కారణమని టాక్..

ఎమ్మెస్ ధోనీ కెప్టెన్సీలో రవిచంద్రన్ అశ్విన్- రవీంద్ర జడేజా జోడీ సూపర్ సక్సెస్ అయితే, ఆ తర్వాత విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో యజ్వేంద్ర చాహాల్-కుల్దీప్ యాదవ్ జోడి అదరగొట్టారు. వీరిలో కుల్దీప్ యాదవ్‌ జట్టుకి దూరం కాగా, చాహాల్ మాత్రం ప్రధాన బౌలర్‌గా ఉండేవాడు...

ఇప్పుడు రోహిత్ శర్మ కెప్టెన్సీలో రవిచంద్రన్ అశ్విన్ - అక్షర్ పటేల్ స్పిన్ ద్వయాన్ని సక్సెస్ చేసి, జట్టుపై తనదైన ముద్ర వేయాలని ‘హిట్ మ్యాన్’ ప్రయత్నాలు చేస్తున్నాడని సోషల్ మీడియాలో గట్టి టాక్ వినిపిస్తోంది...

click me!