అప్పుడు ధోనీ చేస్తే అలా... ఇప్పుడు రిషబ్ పంత్ విషయంలో ఇలా... గౌతమ్ గంభీర్‌పై...

First Published Nov 20, 2021, 1:02 PM IST

టీ20 వరల్డ్‌కప్ 2022 టోర్నీకి జట్టును సిద్ధం చేయడమే లక్ష్యంగా న్యూజిలాండ్‌తో టీ20 సిరీస్ ఆడుతున్నట్టు కనిపిస్తోంది భారత జట్టు. ఐసీసీ టోర్నీల్లో విఫలమైనా, తమకు తిరుగులేని ద్వైపాక్షిక సిరీసుల్లో భారత జట్టు జూలు విదుల్చుతోంది...

న్యూజిలాండ్‌తో స్వదేశంలో జరుగుతున్న టీ20 సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది టీమిండియా. మొదటి రెండు మ్యాచుల్లో మంచి విజయాలు అందుకున్న భారత జట్టు, క్లీన్ స్వీప్ లక్ష్యంగా మూడో టీ20 ఆడనుంది...

మొదటి రెండు మ్యాచుల్లోనూ రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ మొదటి వికెట్‌కి 50+ భాగస్వామ్యం నెలకొల్పగా, ఆఖర్లో వికెట్ కీపర్ రిషబ్ పంత్ బౌండరీతో మ్యాచ్‌ని ముగించడం విశేషం...

మొదటి మ్యాచ్‌లో సునాయసంగా గెలుస్తుందనుకున్న భారత జట్టు, ఆఖర్లో వరుస వికెట్లు కోల్పోవడంతో చివరి 3 బంతుల్లో 3 పరుగులు కావాల్సిన దశలో బౌండరీ బాది, మ్యాచ్‌ను ముగించాడు రిషబ్ పంత్...

రెండో టీ20 మ్యాచ్‌లో అయితే వరుసగా రెండు భారీ సిక్సర్లు బాది, 17.2 ఓవర్లలోనే మ్యాచ్‌ను ఫినిష్ చేశాడు రిషబ్ పంత్. ఈ రెండు మ్యాచుల్లో భారత మిడిల్ ఆర్డర్ డొల్లతనం సుస్పష్టంగా కనిపించింది...

‘రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ ఇన్నింగ్స్ నిర్మించినా, వాళ్లు మ్యాచ్‌ను ముగించలేకపోయారు. ఆఖర్లో 17 పరుగులు చేసి భారత జట్టుకి విజయాన్ని అందించిన రిషబ్ పంత్ ఇన్నింగ్స్... ఈ ఇద్దరి ఇన్నింగ్స్‌ల కంటే గొప్పది..’ అంటూ కామెంట్ చేశాడు మాజీ ఓపెనర్ గౌతమ్ గంభీర్...

అయితే గౌతమ్ గంభీర్ చేసిన కామెంట్లను 2011 వన్డే వరల్డ్‌కప్ టోర్నీ ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ ఇన్నింగ్స్‌తో పోల్చి చూస్తున్నారు మాహీ ఫ్యాన్స్...

ఆ మ్యాచ్‌లో మిడిల్ ఆర్డర్‌లో గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ రాణించినా... వాళ్లిద్దరూ మ్యాచ్‌ను ఫినిష్ చేయలేకపోయారు. బ్యాటింగ్ ఆర్డర్‌లో ప్రమోషన్ తీసుకున్న ధోనీ, చివరిదాకా ఉండి మ్యాచ్‌ను ముగించాడు...

అయితే ‘కేవలం ఎమ్మెస్ ధోనీ ఇన్నింగ్స్ వల్ల టీమిండియా గెలవలేదు. యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, జహీర్ ఖాన్, విరాట్ కోహ్లీ వంటి ప్లేయర్లు ఆడిన విలువైన ఇన్నింగ్స్‌ల కారణంగానే భారత జట్టు వరల్డ్‌కప్ గెలిచింది...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్...

శ్రీలంకతో జరిగిన వరల్డ్‌ కప్ ఫైనల్ మ్యాచ్‌లో చివరిదాకా ఉండి గెలిపించిన ఎమ్మెస్ ధోనీకి క్రెడిట్ ఇవ్వడం సరికాదని కామెంట్ చేసిన గౌతమ్ గంభీర్, ఓ సాధారణ టీ20 మ్యాచ్‌లో ఆఖర్లో కేవలం 17 పరుగులు చేసిన రిషబ్ పంత్ ఇన్నింగ్స్ గొప్పదని చెప్పడం విడ్దూరంగా ఉందని అంటున్నారు మాహీ ఫ్యాన్స్...

అయితే గౌతీ కామెంట్లను సపోర్టు చేస్తున్నవారూ లేకపోలేదు. 2011 వన్డే వరల్డ్‌కప్ టోర్నీలో భారత జట్టు ఫైనల్ చేరడానికి యువరాజ్ సింగ్, సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, విరాట్ కోహ్లీ, గంభీర్ వంటి ప్లేయర్లు ఆడిన ఇన్నింగ్స్‌లు కారణమయ్యాయి...

ఫైనల్ మ్యాచ్‌లో కూడా గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీ కలిసి జట్టును ఓ మంచి పొజిషన్‌కి చేర్చేశారు. ఆ తర్వాత మహీ వచ్చి మ్యాచ్‌ను ఫినిష్ చేశారు. అది వన్డే మ్యాచ్ కాగా ఇది టీ20 మ్యాచ్...

ఓ ఐసీసీ టోర్నీ గెలవలంటే జట్టు మొత్తం కలిసి సమిష్టిగా రాణించాల్సి ఉంటుంది. అదే ఓ మ్యాచ్‌ ఫినిష్ చేయడానికి రిషబ్ పంత్, ఎమ్మెస్ ధోనీ వంటి ఫినిషర్ ఉంటే చాలు... అని గౌతమ్ గంభీర్ అలా కామెంట్ చేశాడని అంటున్నారు టీమిండియా ఫ్యాన్స్...

click me!