ఆ ముగ్గురు భారతీయుల వల్లే టీమిండియాకి విజయం దూరం... అంపైర్ నితిన్ మీనన్‌తో పాటు...

First Published Nov 29, 2021, 5:05 PM IST

కాన్పూర్ టెస్టులో ఐదో టెస్టు జరిగిన హై డ్రామా అంతా ఇంతా కాదు. 9 వికెట్లు పడిన తర్వాత షెడ్యూల్ ప్రకారం 8 ఓవర్లు మాత్రమే మిగిలి ఉండడంతో తీవ్ర ఉత్కంఠ రేగింది. అందులోనూ వెలుతురు లేమీ సమస్య కూడా టీమిండియాను విజయానికి దూరం చేసింది...

భారత స్పిన్‌ బౌలర్లను చక్కగా ఎదుర్కొంటాడని పేరొందిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియంసన్‌తో పాటు కివీస్ బ్యాట్స్‌మెన్ అంతా భారత బౌలింగ్‌ ముందు నిలవలేకపోయారు...

అయితే భారత పిచ్‌ల గురించి, భారత స్పిన్ బౌలింగ్ గురించి పూర్తి అవగాహన కలిగిన న్యూజిలాండ్ జట్టులోని భారతీయ ఆటగాళ్లు రచిన్ రవీంద్ర, అజాజ్ పటేల్... దాదాపు 9 ఓవర్ల పాటు (8.4) ఓవర్ల పాటు వికెట్లకు అడ్డుగా నిలిచాడు...

మొట్టమొదటి టెస్టు మ్యాచ్ ఆడుతున్న రచిన్ రవీంద్ర... భారత్‌లో పుట్టి, ఇక్కడి పిచ్‌లపై క్రికెటర్‌గా రాటుతేలిన వాడే. అనంతపురంలో ట్రైయినింగ్ తీసుకున్న రచిన్ రవీంద్ర... 91 బంతులు ఎదుర్కొని, క్రీజులో అడ్డుగోడగా నిలబడ్డాడు...

11వ బ్యాట్స్‌మెన్‌గా వచ్చిన అజాజ్ పటేల్, ముంబైలో పుట్టిన న్యూజిలాండ్‌కి వలసెళ్లిన వాడు. 9 వికెట్లు పడిన తర్వాత క్రీజులోకి వచ్చిన అజాజ్ పటేల్... 23 బంతులు ఎదుర్కొన్నాడు...

ఈ ఇద్దరూ కలిసి 114 బంతులు ఆడగా, కివీస్ బ్యాట్స్‌మెన్ రాస్ టేలర్, విల్ యంగ్, హెన్రీ నికోలస్, టామ్ బ్లండెల్, టిమ్ సౌథీ కలిసి కూడా ఇన్ని బంతులను ఎదుర్కోలేకపోయారు...

ఇక కాన్పూర్ టెస్టులో భారత జట్టు విజయాన్ని అడ్డుకున్న మరో భారతీయుడు ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్. 9వ వికెట్‌కి పడడానికి ముందు నుంచే ప్రతీ ఓవర్‌కి ముందు లైట్ చెక్ చేయడం మొదలెట్టాడు నితిన్ మీనన్...

వెలుతురు సరిగా లేనప్పుడు లైట్ మీటర్‌తో చెక్ చేయడం అంపైర్ల బాధ్యత. అయితే ప్రతీ ఓవర్‌కి ముందు లైట్ మీటర్ తీసుకొచ్చి చెక్ చేయడం వల్ల చాలా అమూల్యమైన సమయాన్ని భారత జట్టు కోల్పోవాల్సి వచ్చింది...

నితిన్ మీనన్ లైట్ మీటర్ చెక్ చేయడం వల్ల వృథా అయిన సమయంలో రవిచంద్రన్ అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ వంటి బౌలర్లు ఈజీగా మరో ఐదారు ఓవర్లు బౌలింగ్ చేసేవాళ్లు... 

కాన్పూర్ టెస్టు డ్రాగా ముగిసిన తర్వాత అజాజ్ పటేల్, రచిన్ రవీంద్రలతో పాటు ఫీల్డ్ అంపైర్ నితిన్ మీనన్ పేరు కూడా ట్విట్టర్‌లో ట్రెండింగ్‌లో కనిపించింది...

click me!