ఐపీఎల్ 2022 సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌కి కెప్టెన్‌గా వ్యవహరించి, తొలి సీజన్‌లోనే టైటిల్ గెలిచిన హార్ధిక్ పాండ్యా... నెల రోజుల గ్యాప్‌లోనే భారత జట్టును నడిపించే బాధ్యతలను అందుకోవడం విశేషం...
27
భారత రెగ్యూలర్ సారథి రోహిత్ శర్మ ఇంగ్లాండ్ టూర్‌లో బిజీగా ఉండడం, వైస్ కెప్టెన్ కెఎల్ రాహుల్ గాయం కారణంగా జట్టుకి దూరం కావడం, రిషబ్ పంత్ కూడా ఇంగ్లాండ్‌లో జట్టుతో ఉండడంతో హార్ధిక్ పాండ్యాకి కెప్టెన్సీ ఛాన్స్ వచ్చింది...
37
Image credit: PTI
‘ఐర్లాండ్‌తో సిరీస్ ఇంట్రెస్టింగ్‌గా మారడానికి ప్రధాన కారణం హార్ధిక్ పాండ్యా. భారత జట్టుకి కొత్త కెప్టెన్‌గా ఎంపికైన హార్ధిక్ పాండ్యా, జట్టును ఎలా నడిపిస్తాడోనని ఆసక్తిగా వెయిట్ చేస్తున్నా..
47
Image credit: PTI
కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకుని, జట్టుని నడిపించడం హార్ధిక్ పాండ్యా స్పెషాలిటీ. ఐపీఎల్‌లో పాండ్యాకి కెప్టెన్సీ ఇస్తే ఎంత బాగా ఆడతాడో చూశాం. అందుకే టీమిండియా కెప్టెన్‌గానూ సేమ్ సీన్ రిపీట్ చేస్తాడని ఆశిస్తున్నా...
57
జట్టులో ప్రతీ ఒక్కరినీ మోటివేట్ చేయడంలో హార్ధిక్ పాండ్యా దిట్ట. ఇదే మిగిలిన వారి కంటే హార్ధిక్ పాండ్యాని ముందు వరుసలో నిలబెట్టింది. హార్ధిక్ పాండ్యా మంచి ఆల్‌రౌండర్ కాబట్టి అతనికి మూడు విభాగాల గురించి పూర్తి అవగాహన ఉంటుంది...
67
Image credit: PTI
బౌలింగ్‌లో ఎలాంటి మార్పులు చేయాలో బౌలర్లకు చెప్పగలడు, భారీ షాట్లు ఎలా ఆడాలో బ్యాటర్లకు సూచించగలడు... కాబట్టి హార్ధిక్ పాండ్యా, జట్టుకి సమతూకం చేయగలడు..
77
ఇప్పుడు అతను టీ20 వరల్డ్ కప్ టోర్నీలో టీమిండియాకి కీ ప్లేయర్...’ అంటూ తెలిపాడు భారత మాజీ క్రికెటర్, మహిళా జట్టు మాజీ హెడ్ కోచ్ డబ్ల్యూవీ రామన్... రోహిత్ శర్మ తర్వాత టీమిండియా కెప్టెన్‌గా హార్ధిక్ పాండ్యాకే సపోర్ట్ ఇస్తానంటూ వ్యాఖ్యానించాడు రామన్.