India vs Ireland: హిస్టరీ కోసం ఐర్లాండ్.. కంబ్యాక్ కోసం శ్రేయాస్ సేన! పరువు నిలుస్తుందా?

Published : Jun 28, 2026, 12:23 PM IST

India vs Ireland: ఇండియా vs ఐర్లాండ్ 2వ టీ20 మ్యాచ్ ఉత్కంఠను పెంచుతోంది. మ్యాచ్ గెలిచి సిరీస్ ను భారత్ సమం చేస్తుందా? లేదా ఐర్లాండ్ మరో సారి భారత్ కు షాకిచ్చి హిస్టరీ క్రియేట్ చేస్తుందా. పిచ్ రిపోర్ట్, ఇరు జట్ల ప్లేయింగ్ 11 వివరాలు గమనిస్తే.. 

PREV
16
మొదటి మ్యాచ్‌లో షాక్.. ఇప్పుడైనా గెలిచి పగ తీర్చుకుంటుందా శ్రేయాస్ గ్యాంగ్?

క్రికెట్ ప్రపంచంలో ఇప్పుడు ఐర్లాండ్ పేరు మార్మోగిపోతోంది. గత కొన్ని రోజులుగా ఐరిష్ క్రికెట్‌కు ఇవి నిజంగానే హిస్టారికల్ డేస్ అని చెప్పాలి. శుక్రవారం జరిగిన మొదటి టీ20 మ్యాచ్‌లో ఐర్లాండ్ మెన్స్ టీమ్ ఊహించని అద్భుతాన్ని చేసి చూపించింది. ప్రస్తుత టీ20 వరల్డ్ ఛాంపియన్స్ అయిన టీమిండియాను ఓడించి, ఏ ఫార్మాట్‌లోనైనా భారత్‌పై తమ మొదటి విజయాన్ని నమోదు చేసింది.

అక్కడితో ఆగకుండా శనివారం జరిగిన మహిళల టీ20 వరల్డ్ కప్‌లో ఐర్లాండ్ ఉమెన్స్ టీమ్ వెస్టిండీస్‌పై తమ తొలి విజయాన్ని అందుకొని రికార్డు సృష్టించింది. ఇక ఇప్పుడు ఆదివారం జరగబోయే రెండో టీ20లో శ్రేయాస్ అయ్యర్ కెప్టెన్సీలోని టీమిండియాపై గెలిచి, సిరీస్ కైవసం చేసుకోవాలని ఐర్లాండ్ మెన్స్ టీమ్ కసిగా ఉంది.

26
జింబాబ్వే సీన్ రిపీట్ అవుతుందా?

మొదటి మ్యాచ్‌లో ఓడిపోయిన తర్వాత, భారత్ కొత్త టీ20 కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ఈ ఓటమి నుంచి త్వరగా కోలుకుంటామని ప్రామిస్ చేశాడు. నిజానికి టీమిండియా గతంలోనూ సరిగ్గా ఇలాంటి సిట్యుయేషన్‌నే ఫేస్ చేసింది. 2024 లో వరల్డ్ ఛాంపియన్స్ అయిన వెంటనే జింబాబ్వేతో జరిగిన మొదటి టీ20లో భారత్ ఓడిపోయింది.

కానీ ఆ తర్వాత స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చి రెండో మ్యాచ్‌లో 100 పరుగుల తేడాతో భారీ విజయం సాధించింది. ఆపై మిగిలిన మూడు మ్యాచ్‌లూ గెలిచి 4-1 తో సిరీస్ కొట్టేసింది. అయితే ఇక్కడ ఐర్లాండ్‌లో భారత్‌కు అంత టైం లేదు. ఎందుకంటే ఇది చిన్న సిరీస్. ఈ మ్యాచ్ గెలిస్తే సిరీస్‌ను సమం చేసి పరువు నిలబెట్టుకోవచ్చు, లేదంటే సిరీస్ చేజారుతుంది. దీని తర్వాత టీమిండియా ఐదు మ్యాచ్‌ల సిరీస్ కోసం ఇంగ్లాండ్ వెళ్లనుంది.

36
ఐర్లాండ్ నయా జోష్.. జై ముంద్రా మెరుపులు

లోర్కాన్ టక్కర్ నేతృత్వంలోని ఐర్లాండ్ టీమ్ ఇప్పుడు ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఉంది. భారత్ కంబ్యాక్ ఇవ్వకుండా అడ్డుకోవాలని వారు ప్లాన్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ ఇండియా తరఫున డెబ్యూ చేస్తాడని అందరూ అనుకున్నారు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఐర్లాండ్ డెబ్యూ ప్లేయర్ జై ముంద్రా సూపర్ పెర్ఫార్మెన్స్‌తో ఎంట్రీ ఇచ్చాడు. బ్యాటింగ్ కష్టాల్లో పడినా ఐర్లాండ్ బాగా కోలుకుంది, చివర్లో మ్యాచ్‌ను అద్భుతంగా ఫినిష్ చేసింది. బౌలింగ్‌లోనూ అందరూ టీమ్ వర్క్ చూపించి టీ20 దిగ్గజమైన ఇండియాని ఓడించారు. కెప్టెన్ టక్కర్ మరోసారి అదే మ్యాజిక్‌ను రిపీట్ చేయాలని తన ప్లేయర్లను ఎంకరేజ్ చేస్తున్నాడు.

46
పిచ్ రిపోర్ట్ ఇదే.. వాతావరణం ఎలా వుండనుంది?

ఈ మ్యాచ్ బెల్ఫాస్ట్‌లోని సివిల్ సర్వీస్ క్రికెట్ క్లబ్ మైదానంలో జరగనుంది. వాతావరణం విషయానికి వస్తే, మ్యాచ్ జరిగే సమయంలో కొద్దిగా వర్షం పడే ఛాన్స్ ఉంది. కానీ ఆట పూర్తిగా తుడిచిపెట్టుకుపోయేంత వర్షం అయితే ఉండకపోవచ్చు. మొదటి మ్యాచ్ జరిగిన పిచ్ బౌలర్లకు బాగా హెల్ప్ అయింది. అందుకే అక్కడ 182 పరుగుల స్కోరును ఐర్లాండ్ ఈజీగా డిఫెండ్ చేసుకోగలిగింది. ఈ రెండో మ్యాచ్‌కు కూడా అలాంటి పిచ్చే అందుబాటులో ఉండే అవకాశం ఉంది. టాస్ గెలిచిన జట్టు పిచ్ కండిషన్స్ బట్టి డెసిషన్ తీసుకోనుంది.

56
ఇరు జట్ల ప్లేయింగ్ ఎలెవన్ అంచనా

మొదటి మ్యాచ్ ఓడిపోవడంతో టీమిండియా ఒక మార్పు చేసే ఆలోచనలో ఉంది. గత మ్యాచ్‌లో 4 ఓవర్లలో 57 పరుగులు సమర్పించుకున్న ప్రసిద్ధ్ కృష్ణ స్థానంలో ప్రిన్స్ యాదవ్‌ను టీమ్‌లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. మరోవైపు ఐర్లాండ్ గెలిచిన కాంబినేషన్‌ను మార్చకపోవచ్చు.

భారత్: అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, శివమ్ దూబే, అక్షర్ పటేల్, హర్షిత్ రాణా, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ/ప్రిన్స్ యాదవ్.

ఐర్లాండ్: టిమ్ టెక్టర్, రాస్ అడైర్, హ్యారీ టెక్టర్, లోర్కాన్ టక్కర్ (కెప్టెన్ & కీపర్), బెంజమిన్ కాలిట్జ్, గారెత్ డెలానీ, జార్జ్ డాక్రెల్, లియామ్ మెక్‌కార్తీ, మాథ్యూ హంఫ్రీస్, జై ముంద్రా, మాథ్యూ హోలార్డ్.

66
ఏ విషయాన్నీ మనం తేలిగ్గా తీసుకోకూడదు..

ఈ మ్యాచ్ ఓడిపోతే 2024 జనవరి తర్వాత టీమిండియా ఒక టీ20 సిరీస్‌ను గెలవడంలో విఫలం కావడం ఇదే మొదటిసారి అవుతుంది. విరాట్ కోహ్లీ, రిషభ్ పంత్, శుభ్‌మన్ గిల్ తర్వాత కెప్టెన్‌గా తన మొదటి టీ20 మ్యాచ్‌లోనే ఓడిపోయిన నాల్గవ భారతీయ కెప్టెన్‌గా శ్రేయాస్ అయ్యర్ నిలిచాడు.

"ఏ విషయాన్నీ మనం తేలిగ్గా తీసుకోకూడదు. గ్రౌండ్‌లోకి అడుగుపెట్టగానే మ్యాచ్‌లు గెలవలేం. కష్టపడాలి, ఆ క్షణంలో మ్యాచ్‌పై పూర్తి ఫోకస్ పెట్టాలి" అని భారత కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అన్నాడు. "ఇది చాలా స్పెషల్ విక్టరీ. క్రెడిట్ అంతా మా ప్లేయర్లదే.. మ్యాచ్‌లో కొన్ని కష్టమైన పరిస్థితులు ఎదురైనా మేము నిలబడ్డాము. కష్టపడి ఆడాము, చివరకు దానికి తగ్గ ప్రతిఫలం దక్కింది" అని ఐర్లాండ్ కెప్టెన్ లోర్కాన్ టక్కర్ అన్నాడు.

Read more Photos on
click me!

Recommended Stories