ఓ తెగ సంబరపడిపోకు! నీకు ఛాన్స్ రావడం కష్టమే... జయ్‌దేవ్ ఉనద్కట్‌పై దినేశ్ కార్తీక్ కామెంట్...

Published : Dec 13, 2022, 11:49 AM IST

బంగ్లాదేశ్‌తో వన్డే సిరీస్ ఆరంభానికి ముందు సీనియర్ పేసర్ మహ్మద్ షమీ గాయపడడంతో ఆ స్థానం ఎవరికి దక్కుతుందని చాలా పెద్ద చర్చే జరిగింది. యంగ్ పేసర్ ఉమ్రాన్ మాలిక్ లేదా ముకేశ్ కుమార్ చౌదరిలకు టెస్టుల్లో ఆరంగ్రేటం చేసే అవకాశం దక్కొచ్చని ప్రచారం జరిగింది...

PREV
17
ఓ తెగ సంబరపడిపోకు! నీకు ఛాన్స్ రావడం కష్టమే... జయ్‌దేవ్ ఉనద్కట్‌పై దినేశ్ కార్తీక్ కామెంట్...

ఈ ఇద్దరూ కాదు బంగ్లాదేశ్ పర్యటనలో భారత్-ఏ టీమ్ తరుపున అదరగొట్టిన భారత పేసర్ నవ్‌దీప్ సైనీకి టీమ్‌లో చోటు దక్కవచ్చని కూడా టాక్ వినిపించింది. అయితే అన్యూహ్యంగా షమీ ప్లేస్‌లో జయ్‌దేవ్ ఉనద్కట్‌ని సెలక్ట్ చేస్తున్నట్టు ప్రకటించి, అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది టీమిండియా మేనేజ్‌మెంట్...

27
Jaydev Unadkat

అప్పుడెప్పుడో 2010లో సౌతాఫ్రికాతో జరిగిన టెస్టు మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ ఆరంగ్రేటం చేశాడు జయ్‌దేవ్ ఉనద్కట్. ఆ మ్యాచ్‌లో 26 ఓవర్లు బౌలింగ్ చేసినా వికెట్ మాత్రం తీయలేకపోయాడు జయ్‌దేవ్.. 19 ఏళ్ల వయసులో అంతర్జాతీయ ఆరంట్రేం చేసిన ఉనద్కట్‌కి, మళ్లీ 31 ఏళ్ల వయసులో పిలుపు దక్కింది...

37
Jaydev Unadkat


ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ఘనమైన రికార్డులు క్రియేట్ చేసిన జయ్‌దేవ్ ఉనద్కట్,  86 మ్యాచులు ఆడి 311 వికెట్లు తీశాడు. అలాగే ఒకే ఇన్నింగ్స్‌లో 10 వికెట్లు పడగొట్టిన ఘనత కూడా సాధించాడు... విజయ్ హాజారే ట్రోఫీ 2022లో 19 వికెట్లు తీసి అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా నిలిచిన జయ్‌దేవ్ ఉనద్కట్, కెప్టెన్‌గా సౌరాష్ట్రకు టైటిల్ అందించాడు.  

47

టీమిండియా టెస్టు జెర్సీని చూసి మురిసిపోతున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు జయ్‌దేవ్ ఉనద్కట్. 12 ఏళ్ల తర్వాత టెస్టు ఆడడం ఖాయమైపోయినట్టు తెగ సంబరపడిపోతున్నాడు. అయితే భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్ మాత్రం ఉనద్కట్ ఉత్సాహంపై నీళ్లు చల్లాడు...

57
Jaydev Unadkat

‘నాకు తెలిసి ఈ సిరీస్‌లో జయ్‌దేవ్ ఉనద్కట్ ఆడకపోవచ్చు. ఎందుకంటే టీమ్‌లో ఉమేశ్ యాదవ్ ఉన్నాడు. మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. ఈ ముగ్గురూ కొన్నాళ్లుగా నిలకడగా రాణిస్తూ అదరగొడుతున్నారు. ఈ ముగ్గురూ ఉండగా జయ్‌దేవ్ ఉనద్కట్‌కి తుది జట్టులో చోటు దక్కడం కష్టమే...

67

ఈ సిరీస్‌లో జయ్‌దేవ్ ఉనద్కట్‌కి అవకాశం రాకపోయినా అతను నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దేశవాళీ క్రికెట్‌లో అతను ఇస్తున్న పర్ఫామెన్స్‌ని టీమిండియా గుర్తించింది. టీమ్‌కి సెలక్ట్ కావడం కూడా చాలా గొప్ప గౌరవమే. 

77
Jaydev Unadkat

ఆస్ట్రేలియా సిరీస్ సమయానికి జస్ప్రిత్ బుమ్రా, మహ్మద్ షమీ వస్తారు. కాబట్టి అప్పుడు కూడా నిరాశపడక తప్పదు... జయ్‌దేవ్ ఉనద్కట్  మానసికంగా అన్నింటికీ సిద్ధంగా ఉండాలి...’ అంటూ వ్యాఖ్యానించాడు భారత సీనియర్ వికెట్ కీపర్ దినేశ్ కార్తీక్...

click me!

Recommended Stories