భువీ, షమీ ఉండగా అర్ష్‌దీప్ సింగ్‌కి ఆఖరి ఓవర్... రోహిత్ శర్మ ఇంట్రెస్టింగ్ కామెంట్స్...

First Published Nov 3, 2022, 10:40 AM IST

టీ20 వరల్డ్ కప్‌ 2022 టోర్నీలో దాదాపు ప్రతీ మ్యాచ్ ఆఖరి ఓవర్ వరకూ సాగుతూ క్రికెట్ ఫ్యాన్స్‌కి ఫుల్లు కిక్కు అందిస్తోంది. ఇండియా, బంగ్లాదేశ్ మధ్య జరిగిన మ్యాచ్ కూడా ఆఖరి ఓవర్ ఆఖరి బంతి వరకూ ఉత్కంఠభరితంగా సాగి ‘థ్రిల్లర్’ని తలపించింది... 

Arshdeep Singh

185 పరుగుల భారీ లక్ష్యఛేదనలో 7 ఓవర్లు ముగిసే సమయానికి 66 పరుగులు చేసింది బంగ్లాదేశ్. ఆ తర్వాత వర్షం కారణంగా ఆట దాదాపు 45 నిమిషాల పాటు నిలిచిపోవడంతో డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం బంగ్లా లక్ష్యాన్ని 16 ఓవర్లలో 151 పరుగులుగా నిర్ణయించారు...

KL Rahul

అప్పటిదాకా అదరగొడుతున్న లిట్టన్ దాస్‌ని కెఎల్ రాహుల్ డైరెక్ట్ త్రోతో రనౌట్ చేయడంతో బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌ మలుపు తిరిగింది. ఆ తర్వాత వరుస వికెట్లు కోల్పోయింది బంగ్లా...

ఓ వైపు వికెట్లు పడుతున్నా, పరుగులు రావడం మాత్రం ఆగలేదు. వచ్చిన బ్యాటర్లు వచ్చినట్టుగా బౌండరీలు బాదుతూ స్కోరు బోర్డును ముందుకు కదలించారు. ఆఖరి ఓవర్‌లో బంగ్లాదేశ్ విజయానికి 20 పరుగులు కావాల్సి వచ్చాయి. అప్పటికి భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ మూడేసి ఓవర్లు వేసి ఉన్నారు. అయితే ఈ ఇద్దరినీ కాదని యంగ్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్‌తో ఆఖరి ఓవర్ వేయించాడు రోహిత్ శర్మ...

Image credit: Getty

అర్ష్‌దీప్ సింగ్ వేసిన 20వ ఓవర్‌లో రెండో బంతికి సిక్సర్ బాదిన నురుల్ హసన్, మొదటి 5 బంతుల్లో 13 పరుగులు రాబట్టాడు. ఆఖరి బంతికి సిక్సర్ కొడితే మ్యాచ్ టైగా ముగిసి, సూపర్ ఓవర్‌కి వెళ్లేది. అయితే చివరి బంతికి అద్భుతమైన యార్కర్ వేసిన అర్ష్‌దీప్ సింగ్, సింగిల్ మాత్రమే ఇచ్చి 5 పరుగుల తేడాతో భారత జట్టుకి విజయాన్ని అందించాడు...

‘అర్ష్‌దీప్ సింగ్‌, టీమిండియాలోకి వచ్చినప్పటి నుంచే అతన్ని డెత్ ఓవర్లలో ఉపయోగించుకోవాలని ఫిక్స్ అయ్యాడు. అతనికి కూడా ఆ విషయం క్లియర్‌గా చెప్పాం. తన రోల్ ఏంటో క్లారిటీ ఇచ్చింది. బుమ్రా లేకపోవడంతో అతని రోల్‌ని తీసుకోవడం చాలా కష్టమైన పని...

Arshdeep Singh

అదీకాకుండా ఇదే ఏడాది అంతర్జాతీయ ఆరంగ్రేటం చేసిన కుర్రాడికి ఇది చాలా పెద్ద పని. అయితే అతన్ని దాదాపు 9 నెలలుగా ఇదే రోల్‌లో ఉపయోగిస్తూ వచ్చాం. ఐపీఎల్‌లో డెత్ ఓవర్లలో అర్ష్‌దీప్ సింగ్ వేసిన బౌలింగ్ అతనికి బాగా ఉపయోగపడింది...’ అంటూ చెప్పుకొచ్చాడు టీమిండియా సారథి రోహిత్ శర్మ...

arshdeep

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో 9 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్, టీమిండియా తరుపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా ఉన్నాడు. ఈ ఏడాది 28 వికెట్లు తీసిన అర్ష్‌దీప్ సింగ్, ఆరంగ్రేటం చేసిన ఏడాదిలో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా బుమ్రా రికార్డును సమం చేశాడు... 

click me!