బంగ్లా మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ ‘ఫేక్ ఫీల్డింగ్’... అందుకే ఓడిపోయామంటున్న బంగ్లా క్రికెటర్...

First Published | Nov 3, 2022, 9:32 AM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 పరుగుల తేడాతో ఉత్కంఠ విజయాన్ని అందుకుంది టీమిండియా. గ్రూప్ స్టేజీలో మూడో విజయాన్ని అందుకున్న టీమిండియా... సెమీ ఫైనల్ రేసుకు చేరువైంది...  

Litton Das

7 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 66 పరుగులు చేసిన బంగ్లాదేశ్, టీమిండియా బౌలర్లకు ముచ్చెమటలు పట్టించింది. అయితే ఈ సమయంలో వర్షం అంతరాయం కలిగించడం, బ్రేక్ తర్వాత మ్యాచ్ పూర్తిగా భారత్‌వైపు మలుపు తిరగడం జరిగిపోయాయి...

India

వర్షం వల్ల మ్యాచ్ ఆగే సమయానికి డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం చేయాల్సిన స్కోరు కంటే 17 పరుగులు అధికంగా చేసిన బంగ్లాదేశ్... బ్రేక్ ముగిసిన తర్వాత వరుస వికెట్లు కోల్పోయి లక్ష్యానికి 5 పరుగుల దూరంలో ఆగిపోయింది...


Image credit: Getty

ఈ ఓటమితో బంగ్లాదేశ్‌తో పాటు పాకిస్తాన్ సెమీస్ ఛాన్సులు కూడా ఆవిరైపోయాయి. జింబాబ్వేతో మ్యాచ్‌లో భారత జట్టు గెలిచినా, వర్షం వల్ల ఆగిపోయినా టీమిండియా సెమీస్‌కి చేరుకుంటుంది. ఓడితే మాత్రం బంగ్లాదేశ్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్‌ ఫలితం సెమీస్ బెర్తులను కన్ఫార్మ్ చేయనుంది. 

virat kohli

ఎప్పటికే టీమిండియా గెలిచినప్పుడు ‘ఛీటింగ్’ ఆరోపణలు రావడం సర్వసాధారణం. ఇప్పుడు కూడా టీమిండియాపై ఛీటింగ్ ఆరోపణలు చేస్తున్నారు బంగ్లాదేశ్, పాకిస్తాన్ అభిమానులు. ఇన్నింగ్స్‌ 16వ ఓవర్‌లో విరాట్ కోహ్లీ హైట్ నో బాల్‌కి అప్పీలు చేయడం, అంపైర్లు ‘నో బాల్’ ఇవ్వడంపై బంగ్లా కెప్టెన్ షకీబ్ అల్ హసన్ అభ్యంతరం వ్యక్తం చేశాడు...

విరాట్ కోహ్లీ నో బాల్ అడిగితే ఇచ్చేస్తారా? అన్నట్టు అంపైర్లతో వాదించాడు. అయితే అప్పటికే ఆ ఓవర్‌లో మొదటి బంతికి బౌన్సర్ వేశాడు సదరు బౌలర్. దీంతో అంపైర్లు నో బాల్‌ ఇవ్వాల్సి వచ్చింది. అంపైర్లు ఇవ్వడానికంటే ముందే విరాట్ కోహ్లీ అప్పీలు చేశాడంతే! 

దీంతో పాటు అక్షర్ పటేల్ వేసిన ఏడో ఓవర్‌లో విరాట్ కోహ్లీ చేసిన ఫేక్ ఫీల్డింగ్ వల్ల తమకి రావాల్సిన ఐదు పరుగులు రాలేదని ఆరోపిస్తున్నాడు బంగ్లా క్రికెటర్ నురుల్ హసన్. బౌండరీ లైన్ దగ్గర ఫీల్డింగ్ చేస్తున్న అర్ష్‌దీప్ సింగ్, నేరుగా బౌలర్‌కి త్రో వేశాడు. అయితే మధ్యలో ఉన్న విరాట్ కోహ్లీ బంతి అందుకుని, స్ట్రైయిర్ వైపు త్రో వేసినట్టుగా చేతులతో యాక్షన్ చేశాడు. ఇది ఐసీసీ రూల్స్ ప్రకారం ఫేక్ ఫీల్డింగ్ అంటున్నారు నురుల్ హసన్..

Virat Kohli

‘వర్షం పడిన తర్వాత మ్యాచ్ స్వరూపమే మారిపోయింది. ఆ విషయం పక్కనబెడితే విరాట్ కోహ్లీ ఫేక్ త్రో చేశాడు. దానికి 5 పరుగులు పెనాల్టీ ఇవ్వాలి. కానీ దాన్ని అంపైర్లు పట్టించుకోలేదు...’ అంటూ కామెంట్ చేశాడు నురుల్ హసన్...

సీసీ నియమావళిలో 41.5 రూల్ ప్రకారం బ్యాటర్ ఏకాగ్రతను దెబ్బతీసే ఉద్దేశంతో ఫీల్డర్లు కావాలనే చేసే పనులు అన్‌ఫెయిర్ ప్లేగా పరిగణిస్తారు. ఇలాంటి సమయాల్లో బ్యాటర్ అప్పీలు చేస్తూ 5 పరుగులు పెనాల్టీ రూపంలో వస్తాయి. 

అయితే విరాట్ చేసిన పనిని క్రీజులో ఉన్న ఇద్దరూ గమనించలేదు. దీంతో అతని ఫేక్ ఫీల్డింగ్ అయినా, బ్యాటర్లకు వచ్చిన ఇబ్బందేమీ లేదు. వాళ్లు అప్పీలు చేయనప్పుడు 5 పరుగుల పెనాల్టీ ఆశించడం బంగ్లా అత్యాశే అంటున్నారు క్రికెట్ విశ్లేషకులు.. 

Latest Videos

click me!