Rohit Sharma
Rohit Sharma records: అఫ్గానిస్థాన్ తో జరిగిన రెండో మ్యాచ్ లో ఆడిన రోహిత్ శర్మ 150 టీ20లు ఆడిన తొలి క్రికెటర్ గా చరిత్ర సృష్టించాడు. 14 నెలల పాటు అంతర్జాతీయ టీ20కి దూరంగా ఉన్న రోహిత్ శర్మ మొహాలీలో జరిగిన తొలి టీ20లో తిరిగి జట్టులోకి వచ్చాడు. రీఎంట్రీలో భారత్ కు విజయాన్ని అందించి 100 టీ20 విజయాలు అందించిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.
ఆఫ్ఘనిస్తాన్ తో ఇండోర్ లో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ విజయం సాధించి సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తోంది. ఈ మ్యాచ్ ఆడటంతో రోహిత్ శర్మ టీ20ల్లో 150వ మ్యాచ్ ఆడుతూ సరికొత్త రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రోహిత్ శర్మ బౌలింగ్ ఎంచుకున్నాడు.
Rohit Sharma CSK
ఈ సిరీస్ తొలి మ్యాచ్ లో భరత్ విజయం సాధించడంతో టీ20ల్లో 100 విజయాలు సాధించిన తొలి ఆటగాడిగా రోహిత్ రికార్డు సృష్టించాడు. రెండో మ్యాచ్ లో ఆడుతున్న రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్ లో అత్యధిక మ్యాచ్ లు ఆడిన ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు. ఆ తర్వాతి స్థానంలో ఐర్లాండ్ ఆటగాడు పాల్ స్టిర్లింగ్ తర్వాతి స్థానంలో నిలిచాడు. స్టిర్లింగ్ తన కెరీర్ లో ఇప్పటివరకు 134 మ్యాచ్లు ఆడాడు. అతని ఐర్లాండ్ సహచరుడు జార్జ్ డాక్రెల్ 128 మ్యాచ్ లతో ఈ జాబితాలో మూడవ స్థానంలో ఉన్నాడు.
Rohit Sharma MI
టీ20 క్రికెట్లో అత్యధిక మ్యాచ్ లను ఆడిన టాప్-5 క్రికెటర్స్
రోహిత్ శర్మ - భారత్ - 150 మ్యాచ్ లు - 3853 పరుగులు
పాల్ స్టిర్లింగ్ - ఐర్లాండ్ - 134 మ్యాచ్ లు - 3438 పరుగులు
జార్జ్ డాక్రెల్ - ఐర్లాండ్ - 128 మ్యాచ్ లు - 969 పరుగులు
షోయబ్ మాలిక్ - పాకిస్తాన్ - 124 మ్యాచ్ లు - 2435 పరుగులు
మార్టిన్ గప్తిల్ - న్యూజిలాండ్ - 122 మ్యాచ్ లు - 3531 పరుగులు
ipl rohit
ఇక టీ20ల్లో భారత్ తరుపున 116 మ్యాచ్ లు ఆడిన విరాట్ కోహ్లీ తర్వాతి స్థానంలో ఉన్నాడు. 14 నెలల విరామం తర్వాత కోహ్లీ టీ20 జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
rohit 1
రోహిత్ శర్మ టీ20 కెరీర్ లో గమనిస్తే ప్రపంచంలోని అత్యుత్తమ ప్లేయర్లలో ఒకడిగా ఉన్నాడు. టీ20ల్లో అనేక రికార్డులు సృష్టించాడు. దక్షిణాఫ్రికాలో జరిగిన 2007 ప్రపంచ కప్‌లో భారతదేశం విజయం సాధించిన సమయంలో T20I లలో తన అరంగేట్రం చేసిన భారత ఓపెనర్ రోహిత్ శర్మ..టీ20 ఫార్మాట్‌లో నలుగు సెంచరీలు సాధించాడు.
Rohit Sharma
టీ20ల్లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా రోహిత్ ఉన్నాడు. మొత్తం 182 సిక్సర్లు బాదాడు. ఈ ఫార్మాట్‌లో అత్యధిక పరుగులు చేసిన జాబితాలో భారత ఓపెనర్ 3853 పరుగులతో రెండో స్థానంలో ఉన్నాడు. ఈ జాబితాలో రోహిత్ కంటే కోహ్లీ మాత్రమే ముందున్నాడు.