ఇలాగే ఆడితే ఆ ఇద్దరూ నీకు చెక్ పెడతారు చూసుకో... రిషబ్ పంత్‌కి ఇర్ఫాన్ పఠాన్ వార్నింగ్...

Published : Jun 15, 2022, 05:16 PM IST

టీమిండియా కెప్టెన్‌గా లక్కీ ఛాన్స్ కొట్టేసిన రిషబ్ పంత్, మొదటి మూడు మ్యాచుల్లో బ్యాటర్‌గా మాత్రం సత్తా చాటలేకపోయాడు. ఆస్ట్రేలియా టూర్ 2020-21 టోర్నీ తర్వాత మూడు ఫార్మాట్లలో వికెట్ కీపర్ బ్యాటర్‌గా స్థిరమైన చోటు దక్కించుకున్న రిషబ్ పంత్‌‌కి వార్నింగ్ ఇచ్చాడు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్...

PREV
15
ఇలాగే ఆడితే ఆ ఇద్దరూ నీకు చెక్ పెడతారు చూసుకో... రిషబ్ పంత్‌కి ఇర్ఫాన్ పఠాన్ వార్నింగ్...
Rishabh Pant

సౌతాఫ్రికాతో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మొదటి మూడు మ్యాచుల్లో కలిపి 40 పరుగులు మాత్రమే చేయగలిగాడు రిషబ్ పంత్. ఈ సిరీస్‌లో రిషబ్ పంత్ సగటు 13.33 మాత్రమే ఉండగా, స్ట్రైయిక్ రేటు 129.03 గా ఉంది...

25
Image credit: PTI

‘కెప్టెన్సీ చేసుకున్న తర్వాత రిషబ్ పంత్ బ్యాటింగ్‌లో పర్పామెన్స్ ఇవ్వలేకపోతున్నాడు. కెప్టెన్‌గా చేస్తున్నాడు కాబట్టి ఎలా ఆడినా ఈ సిరీస్‌లో అతనికి తుది జట్టులో చోటు ఉంటుంది. అయితే ఫ్యూచర్‌లో టీమిండియాలో చోటు ఉండాలంటే అతను పర్ఫామెన్స్ ఇవ్వాల్సి ఉంటుంది...

35
Image credit: PTI

క్రికెటర్‌గా రిషబ్ పంత్ ఆట అంటే నాకెంతో ఇష్టం. అయితే అంతర్జాతీయ టీ20ల్లో మాత్రం అతని గణాంకాలు ఏ మాత్రం మెరుగ్గా లేవు. అదీకాకుండా ఇప్పుడు ఈ సిరీస్‌లోనే ఇషాన్ కిషన్, దినేశ్ కార్తీక్ రూపంలో ఇద్దరు వికెట్ కీపింగ్ బ్యాటర్లు ఉన్నారు...

45
Image credit: PTI

సంజూ శాంసన్ టీమ్‌లో చోటు కోసం ఎదురుచూస్తున్నాడు. కెఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ చేయగలనని నిరూపించుకున్నాడు. కెఎల్ రాహుల్ ఫామ్‌ని బట్టి చూస్తే అతను బెస్ట్ క్రికెటర్. ఇప్పుడు టీమ్‌లో చాలా పోటీ ఉంది...

55

టీ20 గేమ్‌లో ఎక్కువ రోజులు బ్యాట్‌ని సైలెంట్‌గా ఉంచకూడదు. రిషబ్ పంత్ ఓ సూపర్ స్టార్ ప్లేయర్...  24 ఏళ్ల రిషబ్ పంత్, మరో 10 ఏళ్ల పాటు ఆడగలడు. అతనో ఫెంటాస్టిక్ క్రికెటర్ కానీ రిషబ్ పంత్ ఆట ఇంకా రావాల్సి ఉంది...’ అంటూ కామెంట్ చేశాడు భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్...

Read more Photos on
click me!

Recommended Stories