విరాట్‌ కోహ్లీకి అడిగిన ప్లేయర్లను ఇచ్చి ఉంటే, వరల్డ్ కప్ గెలిచేవాడు... పాక్ మాజీ ప్లేయర్ కామెంట్స్..

Published : Aug 13, 2023, 11:56 PM IST

టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీ తర్వాత టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించాడు విరాట్ కోహ్లీ. అయితే ఫామ్‌లో లేక ఇబ్బంది పడుతున్న విరాట్ కోహ్లీని వన్డే కెప్టెన్సీ నుంచి కూడా తప్పిస్తూ నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. దీంతో మనస్థాపం చెంది టెస్టు కెప్టెన్సీకి కూడా రాజీనామా చేశాడు విరాట్ కోహ్లీ...  

PREV
110
విరాట్‌ కోహ్లీకి అడిగిన ప్లేయర్లను ఇచ్చి ఉంటే, వరల్డ్ కప్ గెలిచేవాడు... పాక్ మాజీ ప్లేయర్ కామెంట్స్..
Virat Kohli

మోస్ట్ సక్సెస్‌ఫుట్ టెస్టు కెప్టెన్‌గా టాప్‌లో నిలిచేందుకు అవకాశం ఉన్నప్పటికీ, విరాట్ కోహ్లీ టెస్టు కెప్టెన్సీని వదులుకోవడం బీసీసీఐని కూడా షాక్‌కి గురి చేసింది. విరాట్ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడానికి ప్రధాన కారణమైన బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కూడా ఇదే రకమైన వ్యాఖ్యలు చేశాడు...

210
virat kohli captaincy record

విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో ఆడిన మొట్టమొదటి ఐసీసీ టోర్నీలోనే టీమిండియా ఫైనల్‌కి వెళ్లింది. అయితే 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో భారత జట్టు, పాకిస్తాన్ చేతుల్లో చిత్తుగా ఓడింది. ఈ ఓటమికి కోచ్ అనిల్ కుంబ్లేతో విభేదాలే కారణమనే విషయం అందరికీ తెలిసిందే..

310

2019 వరల్డ్ కప్‌లో గ్రూప్ స్టేజీలో టేబుల్ టాపర్‌గా నిలిచిన టీమిండియా, సెమీ ఫైనల్‌లో ఓడింది. 2021 టీ20 వరల్డ్ కప్‌లో, ఐసీసీ వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్ 2021 ఫైనల్‌లో మాత్రం ఆశించిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయింది...

410

అయితే టీమ్ సెలక్షన్ విషయంలో విరాట్ కోహ్లీకి ఎలాంటి స్వేచ్ఛ ఉండేది కాదని, సెలక్టర్లు ఎవరిని సెలక్ట్ చేస్తే వాళ్లనే ఆడించాల్సిన పరిస్థితి ఉండేదని మాజీ హెడ్ కోచ్ రవిశాస్త్రి కామెంట్ చేశాడు..

510
Virat Kohli

2019 వన్డే వరల్డ్ కప్‌లో అంబటి రాయుడికి చోటు దక్కకపోవడం, 2021 టీ20 వరల్డ్ కప్‌లో యజ్వేంద్ర చాహాల్, శిఖర్ ధావన్ లేకపోవడం కూడా అందర్నీ ఆశ్చర్యపరిచింది. విరాట్ కోహ్లీ వీళ్లను కావాలని సెలక్టర్లను కోరినా, వాళ్లు పట్టించుకోలేదని కూడా వార్తలు వచ్చాయి..

610

‘విరాట్ కోహ్లీకి కెప్టెన్‌గా ఓ లక్ష్యం ఉండేది. టీమ్‌లో ఏ ప్లేయర్‌ని ఎలా వాడాలో కూడా బాగా తెలుసు... విదేశాల్లో ఎలా గెలవాలో బాగా తెలుసు, అయితే కోహ్లీని బలవంతంగా తప్పించి, బీసీసీఐ చాలా పెద్ద తప్పు చేసింది. విరాట్ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా, ఐసీసీ టైటిల్ గెలవలేకపోవడానికి అంతర్గత సమస్యలే కారణం..

710

విరాట్ కోహ్లీ కోరుకున్న ప్లేయర్లను సెలక్టర్లు ఇవ్వలేదు. ఇచ్చిన ప్లేయర్లు బాగా ఆడలేదు. ప్లేయర్లు సరిగ్గా ఆడకపోతే కెప్టెన్ ఒక్కడే ఏ టోర్నీలను గెలిపించలేడు. నా వరకూ రోహిత్ శర్మ కంటే విరాట్ కోహ్లీ కెప్టెన్సీయే బాగా నచ్చింది...

810

అయితే స్వదేశంలో వన్డే వరల్డ్ కప్ ఆడుతున్నారు. ఈసారి నాలుగో ఐసీసీ టైటిల్ గెలిచేందుకు టీమిండియాకి చాలా చక్కని అవకాశం ఇది. అయితే టాప్ 3 బ్యాటర్లు ఫెయిల్ అయితేనే అసలు సమస్య మొదలవుతుంది. ఆ తర్వాత సరైన బ్యాటర్లు కనిపించడం లేదు..
 

910

టీమిండియా మ్యాచులు గెలవాలంటే టాప్ 3 బ్యాటర్లు కనీసం 25-30 ఓవర్లు ఆడాలి. టాప్ 3లో కూడా సరైన పర్ఫామెన్స్ రావడం లేదు. శిఖర్ ధావన్‌ని తిరిగి టీమ్‌లోకి తీసుకొస్తే, రిజల్ట్ బాగుంటుంది. 

1010
Shikhar celebrates his century

గత ఏడాది అతనికి కెప్టెన్సీ ఇచ్చారు. ఇప్పుడేమో టీమ్‌లో చోటు కూడా లేదు. భారత జట్టు చేతిలో మ్యాచ్ విన్నర్లు ఉన్నారు, కానీ వారిని సరిగ్గా వాడుకోవడమే తెలియడం లేదు. అక్కడ ఇక్కడ పడేస్తూ, టీమ్‌ని అల్లకల్లోలం చేస్తున్నారు..’ అంటూ కామెంట్ చేశాడు పాకిస్తాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్... 

Read more Photos on
click me!

Recommended Stories