ఒక మ్యాచ్.. పలు రికార్డులు.. తొలి వన్డేలో బద్దలైన, కొత్తగా నమోదైన రికార్డులివే..

Published : Jul 12, 2022, 11:09 PM IST

ENG vs IND: ఇండియా-ఇంగ్లాండ్ మధ్య ఓవల్ వేదికగా ముగిసిన తొలి వన్డేలో భారత జట్టు పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ  క్రమంలో ఈ మ్యాచ్ లో నమోదైన రికార్డులను చూద్దాం.  

PREV
110
ఒక మ్యాచ్.. పలు రికార్డులు.. తొలి వన్డేలో బద్దలైన, కొత్తగా నమోదైన రికార్డులివే..

ఇంగ్లాండ్ తో టీ20 సిరీస్ ను గెలిచిన భారత జట్టు వన్డే సిరీస్ లో కూడా ముందడుగు వేసింది. ‘ది ఓవల్’ వేదికగా జరిగిన తొలి వన్డే లో భారత జట్టు.. బట్లర్ సేన పై  పది వికెట్ల తేడాతో గెలుపొందింది. బుమ్రా బౌలింగ్,  రోహిత్ శర్మ-ధావన్ క్లాస్ బ్యాటింగ్ తో పాటుఈ మ్యాచ్ లో పలు రికార్డులు బద్దలయ్యాయి. అవేంటో ఇక్కడ చూద్దాం. 
 

210

బుమ్రా.. ఈ మ్యాచ్ లో భారత విజయానికి బాటలు వేసిందే బుమ్రా. తన తొలి ఓవర్ నుంచి ఏడో ఓవర్ దాకా అతడు ఇంగ్లాండ్ ను గజగజ వణికించాడు. ఈ మ్యాచ్ లో అతడు 7.2 ఓవర్లు బౌలింగ్  వేసి  19 పరుగులే  ఇచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. ఇందులో మూడు మెయిడిన్ ఓవర్లు ఉండటం గమనార్హం. ఇక ఇంగ్లాండ్ గడ్డమీద వన్డేలలో అత్యధిక వికెట్లు నమోదుచేసిన వారి జాబితాలో పాకిస్తాన్ పేసర్ వసీం అక్రమ్ ( (7/36), విన్స్టన్ డేవిస్ (7/51), గ్యారీ గిల్మోర్ (6/14) తర్వాత స్థానంలో బుమ్రా నిలిచాడు. 

310

ఇంగ్లాండ్ లో వన్డేలు ఆడుతూ   అత్యుత్తమ గణాంకాలు చేసిన బౌలర్ ల జాబితాలో బుమ్రా మొదటివాడిగా నిలిచాడు. గతంలో ఈ రికార్డు కుల్దీప్ యాదవ్ (6/25) పేరిట ఉండేది. ఇక  ఈ మ్యాచ్ లో బుమ్రా నమోదుచేసిన గణాంకాలు (6/19).. వన్డేలలో భారత బౌలర్ల జాబితాలో మూడో అత్యుత్తమ ప్రదర్శన. గతంలో స్టువర్ట్ బిన్నీ (6/4), అనిల్ కుంబ్లే (6/12) పేరిట ఈ రికార్డు ఉంది.  

410

ఈ మ్యాచ్ లో బట్లర్ వికెట్ తీయడం ద్వారా షమీ.. వన్డేలలో అతి తక్కువ మ్యాచ్ లలో 150 వికెట్లు తీసిన భారత బౌలర్ గా నిలిచాడు. షమీకి ఇది 80వ వన్డేమ్యాచ్. గతంలో అజిత్ అగార్కర్.. 97 మ్యాచులలో150 వికెట్లు పడగొట్టాడు. షమీకంటే ముందు మిచెల్ స్టార్క్ (77), సక్లయిన్ ముస్తాక్ (78) ముందున్నారు. 

510

ఇంగ్లాండ్ కువన్డేలలో భారత్ పై ఇదే అత్యల్ప స్కోరు (110). గతంలో  ఇంగ్లాండ్ జట్టు.. భారత్ పై 125 పరుగులకు (2006 జైపూర్ లో) ఆలౌటైంది. తాజాగా ఈ రికార్డు తుడిచిపెట్టుకుపోయింది.

610

ఇక భారత బ్యాటింగ్ విషయానికొస్తే.. తొలి వికెట్ కు అత్యధిక పరుగులు జోడించిన జోడీగా రోహిత్ శర్మ-శిఖర్  ధావన్ ల జోడీ నాలుగోస్థానంలో నిలిచింది. ఈ జాబితాలో  సచిన్ టెండూల్కర్ - సౌరవ్ గంగూలీ (6,609), ఆడమ్ గిల్ క్రిస్ట్ - మాథ్యూ హెడెన్ (5,372), హేన్స్ -గ్రీనిడ్జ్ (5,150) లు ముందున్నారు. నాలుగో స్థానంలో ధావన్-రోహిత్ (5,110) లు నిలిచారు.

710
Image credit: Getty

ఈ మ్యాచ్ లో సెంచరీ భాగస్వామ్యం నెలకొల్పిన ధావన్-రోహిత్ లకు ఇది 18వ  శతక భాగస్వామ్యం. దీంతో గతంలో రోహిత్-కోహ్లి ల పేరిట ఉన్న రికార్డు (18) సమమైంది. ఈ జాబితాలో సచిన్- గంగూలీ (26 శతక భాగస్వామ్యాలు), దిల్షాన్-సంగక్కర (20) లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. 

810

ఇంగ్లాండ్ తో మ్యాచ్ లో రోహిత్ శర్మ  76* పరుగులు చేశాడు. ఈ క్రమంలో అతడు ఇంగ్లాండ్ పై వన్డేలలో 1,400 పరుగులు  పూర్తి చేసుకున్నాడు.  అంతేగాక ఈ  జాబితాలో  రికీ పాంటింగ్, కేన్ విలియమ్సన్ లను వెనక్కి నెట్టాడు. ఈ జాబితాలో కోహ్లీ (1,316) ఐదో స్థానంలో ఉన్నాడు. 
 

910

ఈ మ్యాచ్ లో రోహిత్ 5 సిక్సర్లు బాదాడు. తద్వారా రోహిత్.. వన్డేలలో 250 సిక్సర్లు  బాదిన తొలి ఇండియన్ క్రికెటర్ గా చరిత్ర పుటల్లెకెక్కాడు. ఈ జాబితాలో క్రిస్ గేల్ (331), సనత్ జయసూర్య (270) లు రోహిత్ కంటే ముందున్నారు. 

1010

వన్డేలలో  పది వికెట్ల ప్రదర్శనతో విజయం సాధించడం భారత్ కు ఇది ఏడోసారి. గతంలో ఈస్ట్ ఆఫ్రికా (1975), శ్రీలంక (1984),వెస్టిండీస్ (1997), జింబాబ్వే (2001), కెన్యా (2006), జింబాబ్వే (2016) లపై ఈ ఘనత సాధించింది. ఇప్పుడు ఇంగ్లాండ్ పై 111 పరుగుల లక్ష్యాన్ని వికెట్ కోల్పోకుండా ఛేదించింది. 

click me!

Recommended Stories