India A vs Pakistan A: రైజింగ్ ఆసియా కప్ 2026లో ఇండియా-ఏ vs పాకిస్థాన్-ఏ మ్యాచ్‌లో హర్షిత్ రాణాతో పాక్ ప్లేయర్ల మాటల యుద్ధం వైరలైంది. తిలక్ వర్మ సెంచరీతో పాక్ బౌలర్ల పనిపట్టాడు.
హర్షిత్ రాణా vs పాకిస్థాన్ ఓపెనర్లు: మధ్యలో దూరిన అంపైర్లు, వైరల్ అవుతున్న వీడియోలు
ఏసీసీ మెన్స్ రైజింగ్ ఆసియా కప్ 2026 ఇండియా-ఏ, పాకిస్థాన్-ఏ మధ్య జరిగిన మ్యాచ్ లో మైదానంలో ఉద్రిక్తత నెలకొంది. బ్లైండ్ ఆసియా కప్ ఫైనల్ వివాదం సద్దుమణగక ముందే, ఈ మ్యాచ్‌లోనూ ఆటగాళ్ల మధ్య మాటల యుద్ధం మొదలైంది.
టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్న పాకిస్థాన్ తరఫున శ్యామల్ హుస్సేన్, మాజ్ సదాకత్ బరిలోకి దిగారు. వీరిద్దరూ స్టార్టింగ్ నుంచే వేగంగా ఆడారు. ముఖ్యంగా టీమిండియా పేసర్ హర్షిత్ రాణాను టార్గెట్ చేసి పరుగులు రాబట్టారు. 7వ ఓవర్ నుంచి హర్షిత్, శ్యామల్ మధ్య చిన్నగా మొదలైన మాటల గొడవ, ఆ తర్వాత మాజ్ సదాకత్తోనూ కొనసాగింది. ఆన్ కెమెరా జరిగిన ఈ సీన్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది.
24
తొలి ఓవర్లలో కాస్ట్లీ అయిన హర్షిత్.. తర్వాత అగ్రెసివ్ కమ్‌బ్యాక్
మ్యాచ్ స్టార్టింగ్‌లో హర్షిత్ రాణా బౌలింగ్‌లో పరుగులు బాగా వచ్చాయి. తొలి 3 ఓవర్లలోనే ఆయన 30కి పైగా పరుగులు ఇచ్చారు. ఓపెనర్లు శ్యామల్ హుస్సేన్, మాజ్ సదాకత్ కలిసి 66 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 7.5 ఓవర్లలో ఈ జోడీ జోరు చూపించింది. ఈ దశలో ఆయుష్ బదోని బౌలింగ్‌లో శ్యామల్ హుస్సేన్ అవుట్ కావడంతో భారత్‌కు తొలి వికెట్ దక్కింది.
ఆ తర్వాత భారత్ పుంజుకుంది. బదోని వికెట్ తీసినప్పుడు హర్షిత్ రాణా క్యాచ్ పట్టి చాలా అగ్రెసివ్‌గా సెలబ్రేట్ చేసుకున్నారు. అలాగే తన 5వ ఓవర్లో రోహెల్ నాజిర్‌ను అవుట్ చేసినప్పుడు కూడా హర్షిత్ ఘాటుగా సెండ్ ఆఫ్ ఇచ్చారు. ఈ వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
34
పాక్‌కు 313 పరుగుల టార్గెట్
పాకిస్థాన్-ఏ ఇన్నింగ్స్‌లో మిడిల్ ఆర్డర్ బ్యాటర్ హసన్ నవాజ్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. వేగంగా ఆడుతూ 79 పరుగులు చేసి, జట్టును 313 పరుగుల స్కోరు వద్దకు చేర్చాడు. పాకిస్థాన్ సీనియర్ వైట్-బాల్ జట్లలో రెగ్యులర్‌గా ఆడే హసన్ నవాజ్, 82 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేశారు. తన ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 4 సిక్సర్లు బాదారు. ఓపెనర్ మాజ్ సదాకత్ 59 పరుగులతో రాణించడంతో పాకిస్థాన్ భారీ స్కోరు సాధించింది.
ఇండియా-ఏ బ్యాటింగ్ సమయంలోనూ మైదానంలో వేడి తగ్గలేదు. 45వ ఓవర్లో హర్షిత్ రాణా డకౌట్ గా పెవిలియన్ వైపు వెళ్తున్నప్పుడు, పాకిస్థాన్ స్పిన్నర్ సుఫియాన్ ముకీమ్ ఏదో అన్నారు. సుఫియాన్ తీరు చాలా దూకుడుగా ఉండటంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. పరిస్థితి ఇంకా ముదరకుండా పాకిస్థాన్ సహచర ఆటగాడు సుఫియాన్ ముకీమ్‌ను అడ్డుకుని పక్కకు తీసుకెళ్లారు. తొలి ఇన్నింగ్స్ నుంచే హర్షిత్ రాణా, పాక్ ఆటగాళ్ల మధ్య నడిచిన మాటల తూటాలు మ్యాచ్‌లో టెన్షన్ పెంచాయి. ఈ క్రమంలోనే తిలక్ వర్మ తగ్గేదేలే అంటూ తన బ్యాటింగ్ తో పాక్ ప్లేయర్లకు ఇచ్చిపడేశాడు.
తిలక్ వర్మ సెంచరీ, అభిషేక్ ఫాస్ట్ ఇన్నింగ్స్
314 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఇండియా-ఏ జట్టుకు కష్టమైన పిచ్‌పై పరుగులు చేయడం తేలిక కాలేదు. కెప్టెన్ తిలక్ వర్మ 149 బంతుల్లో 100 పరుగులతో అద్భుత సెంచరీ చేశారు. మరోవైపు అభిషేక్ శర్మ కేవలం 42 బంతుల్లోనే 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 70 పరుగులు చేసి గెలుపు ఆశలు రేపారు.
అభిషేక్ క్రీజులో ఉన్నంతసేపు భారత్‌కు ఛాన్స్ కనిపించింది. కానీ ఆయన అవుట్ అయ్యాక మిగతా బ్యాటర్లు వేగంగా రన్స్ చేయడానికి తడబడ్డారు. చివరికి ఇండియా-ఏ జట్టు 265 పరుగులకే ఆలౌట్ అయి, 48 పరుగుల తేడాతో ఓటమిని మూటగట్టుకుంది.
HEATED MOMENTS BETWEEN TILAK VERMA & PAKISTAN PLAYERS. 🥶
- Pakistan players saying something to Harshit Rana after his wicket and Tilak stepped in for Harshit. https://t.co/5z1s7ildk2