IND A vs NEP A : అవి వికెట్లా లేక టికెట్లా..! నేపాల్ ను అలా చించి ఆరేశావేంటి ప్రిన్స్ భయ్యా..!

Published : Nov 20, 2026, 10:09 PM ISTUpdated : Nov 20, 2026, 10:19 PM IST

టీమిండియా బ్యాటర్ల దెబ్బకు పసికూన నేపాల్ విలవిల్లాడిపోయింది. తిలక్ వర్మ, కుశాగ్ర సెంచరీలతో… ప్రిన్స్ యాదవ్, హర్షిత్ రాణా బుల్లెట్ బంతులతో చెలరేగడంతో రికార్డు ఓటమిని మూటగట్టుకుంది నేపాల్-ఏ టీమ్.

PREV
13
ఇండియా దెబ్బకు నేపాల్ విలవిల

India A vs Nepal A : ఆసియా కప్ లో భారత్ అదరగొడుతోంది. ఇప్పటికే అండర్-19 ఆసియా కప్ లో పాకిస్థాన్ పై అద్భుత విజయం సాధించి కప్ ను ఎగరేసుకుపోయింది. ఇప్పుడు అంతకు మించి అన్నట్లుగా ఏసిసి మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ టోర్నీలో ఇండియా-ఏ టీమ్ అదరగొట్టింది. నేపాల్ పై రికార్డు విజయంతో అద్భుత ఆరంభం లభించింది. పసికూన నేపాల్-ఏ ను చిత్తుచేసి ఏకంగా 306 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది తిలక్ సేన.

23
రఫ్పాడించిన రాణా, పిచ్చెక్కించిన ప్రిన్స్

ఏసిసి మెన్స్ ఆసియా కప్ రైజింగ్ స్టార్స్ 2026 గ్రూప్ బి లో ఇండియా-ఏ vs నేపాల్-బి మధ్య ఇవాళ (నవంబర్ 20, శుక్రవారం) మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన నేపాల్ టీం మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది... దీంతో టీమిండియా మొదట బ్యాటింగ్ చేయాల్సివచ్చింది. కెప్టెన్ తిలక్ వర్మ, యువకెరట కుమార్ కుషాగ్ర సెంచరీలతో చెలరేగడంతో నిర్ణీత ఓవర్లలో టీమిండియా 332 పరుగుల భారీ స్కోర్ చేసింది.

333 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన నేపాల్ ను భారత బౌలర్లు పేకమేడలా కూల్చేశారు. నేపాల్ టీంలో ఒక్కరు కూడా సింగిల్ డిజిట్ స్కోర్ సాధించలేకపోయారు... కేవలం 11.3 ఓవర్లలోనే 26 పరుగులకు టీమ్ మొత్తం ఆలౌట్ అయ్యింది. ఏకంగా ఐదుగురు నేపాల్ బ్యాటర్లు డకౌట్ అయ్యారు... కేవలం ఇద్దరు బ్యాటర్లు మాత్రమే చెరో 6 పరుగులు చేశారు... ఇదే హయ్యెస్ట్ స్టోర్.

టీమిండియా బౌలర్లలో హరిత్ రాణా, ప్రిన్స్ యాదవ్ అదరగొట్టారు. రాణా 6 ఓవర్లలో కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. మరో బౌలర్ ప్రిన్స్ యాదవ్ మరింత రెచ్చిపోయాడు.. బంతి వేస్తే చాలు వికెట్ అన్నట్లుగా అతడి బౌలింగ్ సాగింది. కేవలం 5 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు ప్రిన్స్... ఇందులో 2 మెయిడిన్ ఓవర్లున్నాయి. ఈ ఇద్దరు బౌలర్లు టాప్ క్లాస్ బంతులేస్తూ ఆకాశమే హద్దుగా చెలరేగడంతో నేపాల్ టీం కుప్పకూలింది.

33
తిలక్ వర్మ, కుశాగ్ర సెంచరీల మోత

మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియాకు శుభారంభం లభించలేదు. ఓపెనర్లు వైభవ్ సూర్యవంశి (26 పరుగులు), అభిషేక్ శర్మ (9 పరుగులు) తొందరగానే ఔటయ్యారు. ఆయుష్ బదోని (2 పరుగులు) కూడా తొందరగానే ఔటవడంతో 42 పరుగులకే టీమిండియా మూడు వికెట్లు పడ్డాయి.

ఈ సమయంలో అసలైన ఆట మొదలయ్యింది… క్రీజులోకి వచ్చిన కెప్టెన్ తిలక్ వర్మ, యువ వికెట్ కీపర్ కుశాగ్ర మ్యాచ్ ను మలుపుతిప్పారు. తిలక్ వర్మ107 పరుగులు, కుమార కుశాగ్ర 117 పరుగులతో రెచ్చిపోయారు... దీంతో భారీ భాగస్వామ్యం ఏర్పడింది. ఇక చివర్లో సుయాంశ్ షెడ్గే 14 బంతుల్లో 36 పరుగులతో విద్వంసకర ఇన్నింగ్స్ ఆడాడు… దీంతో టీమిండియా 332 పరుగుల భారీ స్కోర్ చేసింది.

Read more Photos on
click me!

Recommended Stories