147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో తొలిసారి.. పెర్త్ లో చ‌రిత్ర సృష్టించిన య‌శ‌స్వి జైస్వాల్

First Published | Nov 23, 2024, 5:21 PM IST

Yashasvi Jaiswal: పెర్త్ టెస్టులో య‌శ‌స్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ లు హాఫ్ సెంచ‌రీలు పూర్తి చేశారు. రెండో ఇన్నింగ్స్ లో అద్భుత‌మైన ఆట‌తీరుతో భార‌త్ ను మంచి అధిక్యం దిశ‌గా ముందుకు న‌డిపిస్తున్నారు. ఈ క్ర‌మంలోనే జైస్వాల్ టెస్టు క్రికెట్ హిస్ట‌రీలో కొత్త రికార్డు సాధించాడు.
 

Yashasvi Jaiswal

Yashasvi Jaiswal : బోర్డ‌ర్ గ‌వాస్క‌ర్ ట్రోఫీలో భాగంగా భార‌త్-ఆస్ట్రేలియాలు  ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ను ఆడుతున్నాయి. ఈ క్ర‌మంలోనే పెర్త్ వేదిక‌గా జ‌రుగుతున్న తొలి టెస్టు మ్యాచ్ లో భార‌త్ తొలి ఇన్నింగ్స్ లో ప‌రుగులు చేయ‌డంలో ఘోరంగా  విఫ‌ల‌మైంది. అయితే, బౌల‌ర్లు రాణించ‌డంలో అధిక్యం సంపాదించింది. ఇక రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్, య‌శ‌స్వి జైస్వాల్ లు భార‌త్ ను భారీ అధిక్యం  దిశ‌గా ముందుకు న‌డిపిస్తున్నారు. 

KL Rahul-Yashasvi Jaiswal

రెండో రోజు భారత యంగ్ ఓపెనర్ బ్యాట్స్‌మెన్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఎన్నడూ లేని చరిష్మాను ప్రదర్శించాడు. భారత బౌలర్లు ఆస్ట్రేలియాను తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 104 పరుగులకే పరిమితం చేసి 46 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించారు. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు వచ్చిన భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ కంగారూ బౌలర్లను ధీటుగా ఎదుర్కొంటూ ప‌రుగులు రాబ‌ట్టారు. ఇద్దరూ బాగా బ్యాటింగ్ చేస్తూ రెండో రోజు స్టంప్స్ వరకు నాటౌట్‌గా ఉన్నారు.


Yashasvi Jaiswal-KL Rahul

యశస్వి-రాహుల్ ముందు తేలిపోయిన ఆసీస్ బౌలర్లు

రెండో రోజు ఆట తొలి సెషన్‌లో జస్ప్రీత్ బుమ్రా, హర్షిత్ రాణా మిగిలిన మూడు వికెట్లు పడగొట్టి ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌ను 104 పరుగులకే పరిమితం చేశారు. 46 పరుగుల ఆధిక్యంతో భారత ఓపెనర్లు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్ రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగారు. తొలి ఇన్నింగ్స్ లో చేసిన త‌ప్పిదాలు చేయ‌కుండా మంచి బ్యాటింగ్ చేశారు. రెండో, మూడో సెషన్‌లో కంగారూ బౌలర్ల నుంచి ఫోర్లు, సిక్సర్లు బాదిన యశస్వీ-రాహుల్ జోడీ క్రీజులో కుదురుకుంది. కెప్టెన్ పాట్ కమిన్స్ తో పాటు కంగారు టీమ్ బౌల‌ర్లు అన్ని విధాలుగా ప్రయత్నించినా యశస్వి-రాహుల్‌లను అవుట్ స్టంప్స్ వరకు ఔట్ చేయలేకపోయారు. 

హాఫ్ సెంచ‌రీలు పూర్తి చేసిన‌ య‌శ‌స్వి జైస్వాల్-కేఎల్ రాహుల్

రెండో రోజు ఆట ముగిసే స‌మ‌యానికి ఇద్ద‌రు ఓపెన‌ర్లు కేఎల్ రాహుల్, య‌శ‌స్వి జైస్వాల్ హాఫ్ సెంచ‌రీలు పూర్తి చేశారు. యంగ్ ప్లేయ‌ర్ యశస్వి జైస్వాల్ సెంచ‌రీకి చేరువ‌య్యాడు. 90 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. తన ఇన్నింగ్స్ లో 7 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. మూడో రోజు ఆరంభంలోనే ఈ యంగ్ బ్యాట్స్‌మెన్ వీలైనంత త్వరగా సెంచరీ పూర్తి చేయాలనే ఉద్దేశంతో బ్యాటింగ్‌కు దిగనున్నాడు. మరోవైపు, స్టార్ వికెట్ కీప‌ర్ బ్యాట్స్ మెన్ కేఎల్ రాహుల్ నాలుగు ఫోర్లతో 62 పరుగులు చేసి నాటౌట్‌గా ఉన్నాడు. వీరిద్దరి అజేయ సెంచరీ భాగస్వామ్యంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 172 పరుగులు చేసింది. దీంతో ఇప్ప‌టివ‌ర‌కు భార‌త జ‌ట్టు 218 పరుగుల ఆధిక్యంలోకి వ‌చ్చింది. 

చరిత్ర సృష్టించిన యశస్వి  జైస్వాల్

భార‌త జ‌ట్టు రెండో ఇన్నింగ్స్ లో యంగ్ ప్లేయ‌ర్ య‌శ‌స్వి జైస్వాల్ అద్భుత‌మైన ఆట‌తో ఆక‌ట్టుకున్నాడు. అతని 90 పరుగుల ఇన్నింగ్స్‌లో2 సిక్సర్లు, 7 ఫోర్లు బాదాడు. రెండో సిక్స్ కొట్టి చరిత్ర సృష్టించాడు యశస్వి. టెస్టు క్రికెట్‌లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన బ్యాట్స్‌మెన్‌గా ఘ‌న‌త సాధించాడు. ప్రస్తుత ఏడాది టెస్టుల్లో యశస్వి మొత్తం 34 సిక్సర్లు కొట్టాడు. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఒక క్యాలెండర్ ఇయర్‌లో బ్యాట్స్‌మెన్ 34 సిక్సర్లు (టెస్టులో) కొట్టడం ఇదే తొలిసారి. న్యూజిలాండ్ దిగ్గజ బ్యాట్స్‌మెన్ బ్రెండన్ మెకల్లమ్ (2014లో 33 సిక్సర్లు) ప్రపంచ రికార్డును బద్దలు కొట్టాడు య‌శ‌స్వి జైస్వాల్. 

KL Rahul

ఒక క్యాలెండర్ ఇయర్‌లో టెస్ట్ మ్యాచ్‌లలో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాళ్లు వీరే 

యశస్వి జైస్వాల్ (భారత్) - 34 సిక్సర్లు* (2024) 
బ్రెండన్ మెకల్లమ్ (న్యూజిలాండ్) - 33 సిక్స‌ర్లు (2014) 
బెన్ స్టోక్స్ (ఇంగ్లండ్) - 26 సిక్స‌ర్లు (2022) 
ఆడమ్ గిల్‌క్రిస్ట్ (ఆస్ట్రేలియా) - 22 సిక్స‌ర్లు (2005)
వీరేంద్ర సెహ్వాగ్ (భార‌త్) - 22 సిక్స‌ర్లు  (2008)
ఆండ్రూ ఫ్లింటాఫ్ (ఇంగ్లండ్) - 21 సిక్స‌ర్లు (2004)

Latest Videos

click me!