Varun Chakravarthy Love Story: భారత మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్లు తీసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. దీంతో నెట్టింట హాట్ టాపిక్ అయ్యాడు. ఇప్పుడు వరుణ్ చక్రవర్తి లవ్ స్టోరీ కూడా వైరల్ అవుతోంది.
Varun Chakravarthy Love Story: భారత మిస్టరీ స్పిన్నర్, తమిళనాడుకు చెందిన వరుణ్ చక్రవర్తి పేరు ఇప్పుడు క్రికెట్ ప్రపంచంలో మారుమోగుతోంది. దుబాయ్‌లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ 2025 చివరి గ్రూప్ మ్యాచ్ లో భారత్-న్యూజిలాండ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్ లో వరుణ్ చక్రవర్తి తన స్పిన్ మాయాజాలంతో కీవీస్ ను దెబ్బకొట్టాడు. దీంతో భారత జట్టు 44 పరుగుల తేడాతో న్యూజిలాండ్‌పై గెలిచింది. వరుణ్ చక్రవర్తి ఈ మ్యాచ్‌లో 10 ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసి అదరగొట్టాడు.
24
వరుణ్ చక్రవర్తి
వరుణ్ చక్రవర్తి.. రెండేళ్ల లవ్
అంతకుముందు ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో 15 వికెట్లు తీసి వరుణ్ చక్రవర్తి సిరీస్ హీరోగా నిలిచాడు. ఇప్పుడు ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని భారత జట్టులో స్టార్ ఆటగాడిగా ఎదిగాడు. తనదైన బౌలింగ్ తో అదరగొడుతున్నాడు. ఆగస్టు 29, 1991న కర్ణాటకలోని బీదర్‌లో జన్మించిన వరుణ్ చక్రవర్తి ఆర్కిటెక్ట్ ఉద్యోగం వదిలి క్రికెట్‌లోకి వచ్చాడు.
వరుణ్ చక్రవర్తి వ్యక్తిగత జీవితం విషయానికొస్తే, నేహా కేడేకర్ అనే భార్య, ఆత్మన్ అనే కుమారుడు ఉన్నాడు. వరుణ్, నేహా కేడేకర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు ఇద్దరూ రెండేళ్లు ప్రేమించుకున్నారు.
ఒకరినొకరు ప్రాణంగా ప్రేమించుకున్న వీరు 2020 ప్రారంభంలో పెళ్లి చేసుకుని తమ బంధాన్ని మరో స్థాయికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు.
34
వరుణ్ చక్రవర్తి వివాహ జీవితం
వరుణ్ చక్రవర్తి లవ్ స్టోరీలో విలన్ గా కరోనా ఎంట్రీ !
వరుణ్ చక్రవర్తి, నేహా కేడేకర్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. పెళ్లికి ముందు వీరిద్దరూ రెండేళ్లు ప్రేమించుకున్నారు. పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైన సమయంలో విలన్ గా కరోనా ఎంట్రీ ఇచ్చింది. భారతదేశంలో వ్యాపించిన కరోనా వీరి పెళ్లికి కొన్ని నెలలపాటు అడ్డుగా నిలిచింది. దీంతో చాలా నెలల తర్వాత 2020 డిసెంబర్ 12న వీరిద్దరూ నిరాడంబరంగా పెళ్లి చేసుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత 2022లో ఈ దంపతులకు ఆత్మన్ అనే మగ పిల్లవాడు పుట్టాడు.
44
ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వరుణ్ చక్రవర్తి
వరుణ్ చక్రవర్తి భార్య ఎవరు?
వరుణ్ చక్రవర్తి భార్య నేహా కేడేకర్ జనవరి 4, 1995న ముంబైలో జన్మించింది. ఆమెకు మనాలి కేడేకర్, కైరన్ కేడేకర్ అనే ఇద్దరు తోబుట్టువులు ఉన్నారు. భర్త ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన ఆటగాడు అయినప్పటికీ, నేహా కేడేకర్ తన వ్యక్తిగత జీవితాన్ని రహస్యంగా ఉంచడానికి ఇష్టపడుతుంది.
ఆమె ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో 681 మంది ఫాలోవర్లు ఉన్నారు. ఫోటోలు తీయడం, ప్రయాణాలు చేయడం, క్రికెట్ చూడటం నేహా హాబీలు. వరుణ్ చక్రవర్తి తమిళ సూపర్ స్టార్ విజయ్ దళపతి వీరాభిమాని. అతనంటే మాములు ఇష్టం కాదు.. ఏకంగా విజయ్ బొమ్మను చేతిపై పచ్చబొట్టు వేయించుకున్నాడు.