INDvsAUS: మాథ్యూ వేడ్, మ్యాక్స్‌వెల్ మెరుపులు... భారీ స్కోరు చేసిన ఆస్ట్రేలియా...

First Published Dec 8, 2020, 3:32 PM IST

INDvAUS: టీమిండియాతో జరుగుతున్న ఆఖరి టీ20లో భారీ స్కోరు చేసింది ఆస్ట్రేలియా. గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో అదరగొట్టిన మాథ్యూ వేడ్ మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా మ్యాక్స్‌వెల్ మెరుపులు మెరిపించాడు. నటరాజన్ మినహా మిగిలిన భారత బౌలర్లు మరోసారి పరుగులు నియంత్రించడంలో విఫలం కావడంతో 20 ఓవర్లు ముగిసేసరికి 5 వికెట్లు కోల్పోయి 186 పరుగులు చేసింది ఆస్ట్రేలియా...

టాస్ గెలిచిన వెంటనే మరో ఆలోచన లేకుండా మరోసారి ఫీల్డింగ్ చేసేందుకే నిర్ణయం తీసుకున్నాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ...
undefined
గత మ్యాచ్‌లో హాఫ్ సెంచరీ చేసిన మాథ్యూ వేడ్, మరోసారి మొదటి ఓవర్‌లో మూడు బౌండరీలతో 14 పరుగులు రాబట్టాడు...
undefined
గాయం కారణంగా గత మ్యాచ్‌లో ఆడని ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్, వాషింగ్టన్ సుందర్ బౌలింగ్‌లో డకౌట్ అయ్యాడు...
undefined
మాథ్యూ వేడ్ బౌండరీల మోత మోగిస్తుండడంతో స్టీవ్ స్మిత్ సింగిల్స్ తీస్తూ అతనికి స్టైయికింగ్ ఇవ్వడానికే ప్రాధాన్యం ఇచ్చాడు...
undefined
మాథ్యూ వేడ్‌తో కలిసి రెండో వికెట్‌కి 65 పరుగులు జోడించిన స్టీవ్ స్మిత్... 23 బంతుల్లో ఒకే ఫోర్‌తో 24 పరుగులు చేసి సుందర్ బౌలింగ్‌లో క్లీన్‌ బౌల్డ్ అయ్యాడు.
undefined
నటరాజన్ బౌలింగ్‌లో అవుట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు మాథ్యూ వేడ్... 15 సెకన్లు ముగిసిన తర్వాత రివ్యూకి అప్లై చేయడంతో రివ్యూని తిరస్కరించారు అంపైర్లు.
undefined
అప్పటికే స్టేడియంలోని స్క్రీన్లలో రిప్లై కనిపించడంతో అంపైర్లు రివ్యూకి అనుమతించలేదు...
undefined
ఆ తర్వాత యజ్వేంద్ర చాహాల్ బౌలింగ్‌లో మ్యాక్స్‌వెల్, కెఎల్ రాహుల్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అయితే ఆ బంతి నో బాల్ కావడంలో బతికిపోయాడు మ్యాక్స్‌వెల్.
undefined
53 బంతుల్లో ఏడు ఫోర్లు, 2 సిక్సర్లతో 80 పరుగులు చేసిన మాథ్యూ వేడ్‌ను శార్దూల్ ఠాకూర్ అవుట్ చేశాడు.
undefined
భారత ఫీల్డర్లు క్యాచ్‌లు డ్రాప్ చేయడంతో మూడు సార్లు అవుట్ అయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్న మ్యాక్స్‌వెల్ 36 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో 54 పరుగులు చేశాడు.
undefined
మ్యాక్స్‌వెల్‌ను 20వ ఓవర్ మొదటి బంతికి క్లీన్‌బౌల్డ్ చేశాడు నటరాజన్... ఆర్కీ షార్ట్ 7 పరుగులు చేసి అవుట్ అయ్యాడు.
undefined
భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ రెండు వికెట్లు తీయగా నటరాజన్, శార్దూల్ ఠాకూర్ చెరో వికెట్ తీశారు.
undefined
click me!