INDvsAUS: రహానే కెప్టెన్ ఇన్నింగ్స్... పంత్ రికార్డు పర్ఫామెన్స్... ఆధిక్యం దిశగా టీమిండియా...

First Published Dec 27, 2020, 10:08 AM IST

బాక్సింగ్ డే టెస్టులో టీమిండియా ఆధిక్యం దిశగా సాగుతోంది. టీ విరామానికి 63.3 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా, 189 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరుకి ఇంకా 6 పరుగులు వెనకబడి ఉన్న భారత జట్టు, రవీంద్ర జడేజా, రహానే మరిన్ని పరుగులు జత చేస్తే మంచి ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. కెప్టెన్‌గా వ్యవహారిస్తున్న అజింకా రహానే హాఫ్ సెంచరీతో క్రీజులో ఉన్నాడు.

ఓవర్‌నైట్ స్కోరు 361 వద్ద ఇన్నింగ్స్ ఆరంభించిన టీమిండియా.. 61 పరుగుల వద్ద శుబ్‌మన్ గిల్ వికెట్ కోల్పోయింది...
undefined
గిల్ 65 బంతుల్లో 8 ఫోర్లతో 45 పరుగులు చేసి కమ్మిన్స్ బౌలింగ్‌లో టిమ్ పైన్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
undefined
ఆ తర్వాత కొద్దిసేపటికే 70 బంతుల్లో 17 పరుగులు చేసిన పూజారా కూడా ప్యాట్ కమ్మిన్స్ బౌలింగ్‌లోనే పెవిలియన్ చేరాడు...
undefined
64 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన టీమిండియాను హనుమ విహారి, అజింకా రహానే కలిసి ఆదుకున్నారు. ఇద్దరూ కలిసి నాలుగో వికెట్‌కి 52 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
undefined
66 బంతుల్లో 2 ఫోర్లతో 21 పరుగులు చేసిన హనుమ విహారి... నాథన్ లియాన్ బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
undefined
ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్... దూకుడుగా ఇన్నింగ్స్ ఆరంభించాడు. 40 బంతుల్లో 3 ఫోర్లతో 29 పరుగులు చేశాడు రిషబ్ పంత్.
undefined
ఆస్ట్రేలియాలో ఆస్ట్రేలియాపై వరుసగా తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో 25+ స్కోరు చేసిన మొట్టమొదటి క్రికెటర్‌గా రికార్డు సృష్టించాడు రిషబ్ పంత్...
undefined
23 ఏళ్ల వయసులో ఆస్ట్రేలియాలో అత్యధిక టెస్టు పరుగులు చేసిన ఆసియా ప్లేయర్‌గానూ సచిన్ రికార్డు బద్ధలు కొట్టాడు రిషబ్ పంత్. సచిన్ 23 ఏళ్ల వయసులో ఆసీస్‌పై ఆస్ట్రేలియాలో 368 పరుగులు చేయగా, రిషబ్ పంత్ 379 పరుగులతో టెండూల్కర్‌ను అధిగమించాడు.
undefined
రిషబ్ పంత్‌ను అవుట్ చేసిన మిచెల్ స్టార్క్‌... టెస్టు కెరీర్‌లో 250 వికెట్ల మైలురాయిని అందుకుననాడు. అతి తక్కువ మ్యాచుల్లో ఈ ఫీట్ సాధించిన ఆసీస్ క్రికెటర్‌గా నాలుగో స్థానంలో నిలిచాడు స్టార్క్.
undefined
11979 బంతుల్లో 250 వికెట్లు అందుకున్న స్టార్క్, అతి తక్కువ బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్న ఆస్ట్రేలియా బౌలర్‌గా నిలిచాడు.
undefined
అలాగే రిషబ్ పంత్‌ క్యాచ్‌ను అందుకున్న ఆసీస్ వికెట్ కీపర్ టిమ్ పైన్, టెస్టుల్లో 150 క్యాచులు పూర్తి చేసుకున్నారు. అత్యంత వేగంగా (33 టెస్టుల్లో) ఈ ఫీట్ అందుకున్న ఆసీస్ వికెట్ కీపర్‌గా నిలిచాడు ఆసీస్ కెప్టెన్.
undefined
పంత్ అవుటైన తర్వాత అజింకా రహానే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆస్ట్రేలియాలో రహానేకి ఇది ఐదో హాఫ్ సెంచరీ... సచిన్, ద్రావిడ్ తర్వాత ఆస్ట్రేలియాలో అత్యధిక హాఫ్ సెంచరీలు చేసిన ప్లేయర్‌గా నిలిచాడు రహానే.
undefined
బాక్సింగ్ డే టెస్టులో హాఫ్ సెంచరీ చేసిన ఐదో భారత కెప్టెన్‌గా నిలిచాడు అజింకా రహానే. ఇంతకుముందు కపిల్ దేవ్, సచిన్, గంగూలీ, విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించారు.
undefined
కెప్టెన్‌గా, నాన్‌- కెప్టెన్‌గా బాక్సింగ్ డే టెస్టులో ఆస్ట్రేలియాపై హాఫ్ సెంచరీ స్కోరు చేసిన మూడో ప్లేయర్ అజింకా రహానే. ఇంతకుముందు సచిన్ టెండూల్కర్, విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించారు.
undefined
రహానే 53 పరుగులతో రవీంద్ర జడేజా 4 పరుగులతో క్రీజులో ఉన్నారు. ఆస్ట్రేలియా మొదటి ఇన్నింగ్స్ స్కోరుకి 6 పరుగులు వెనకబడి ఉంది టీమిండియా. మ్యాచ్‌కి వర్షం అంతరాయం కలిగించడంతో ఆటను నిలిపివేశారు.
undefined
click me!