మమ్మల్ని విమర్శిస్తే వాళ్లను కూడా ప్రశ్నించాల్సిందే కదా.. జర్నలిస్టుపై శార్దూల్ ఆగ్రహం

Published : Oct 09, 2022, 02:20 PM IST

IND vs SA T20I: టీమిండియా బౌలింగ్  పై వస్తున్న విమర్శలపై యువ పేసర్ శార్దూల్ ఠాకూర్  తనదైన వైలిలో స్పందించాడు. తమ జట్టు బౌలర్లను విమర్శించే ముందు ప్రత్యర్థి బౌలర్ల ప్రదర్శనను కూడా చూడండని  ఫైర్ అయ్యాడు. 

PREV
17
మమ్మల్ని విమర్శిస్తే వాళ్లను కూడా ప్రశ్నించాల్సిందే కదా.. జర్నలిస్టుపై శార్దూల్ ఆగ్రహం

గత కొంతకాలంగా విఫలమవుతున్న భారత బౌలర్లపై  విమర్శలు వెళ్లువెత్తుతున్నాయి. ప్రపంచకప్ కు ముందు  భారత బౌలింగ్ విభాగం దారుణంగా విఫలమైంది. ఆసియాకప్ లో ఓటమితో పాటు స్వదేశంలో ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా సిరీస్ లో కూడా  మన బౌలర్లు తేలిపోయారు. 

27

ఈ నేపథ్యంలో భారత బౌలర్లపై విమర్శలు చేస్తున్నవారికి టీమిండియా యువ పేసర్ శార్దూల్ ఠాకూర్ తనదైన శైలిలో సమాధానమిచ్చాడు.  తమను విమర్శించేముందు ప్రత్యర్థి బౌలర్లు ఏ మేరకు పరుగులిచ్చారన్నది కూడా చూడాలని  ఘాటుగా స్పందించాడు. భారత బౌలర్లలో నిలకడ లేదన్న విమర్శలపై శార్దూల్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. 

37

రాంచీలో భారత జట్టు సౌతాఫ్రికాతో రెండో వన్డే ఆడటానికి వచ్చిన శార్దూల్ మీడియాతో మాట్లాడుతూ.. ‘మీరు నిలకడ గురించి మాట్లాడుతున్నారు. ఇండియాలో ఆడుతున్నప్పుడు ప్రత్యర్థి జట్ల బౌలర్లు కూడా భారీగా పరుగులు సమర్పించుకుంటున్నారు. మరి దానికేమంటారు..? 

47

సౌతాఫ్రికాతో టీ20 సిరీస్ లోనే చూడండి.. దక్షిణాఫ్రికా బౌలర్లు కూడా విఫలమయ్యారు కదా. మీరు మన బౌలర్లను విమర్శించాలనుకుంటే ప్రత్యర్థఇ బౌలర్ల ప్రదర్శనను కూడా విమర్శించాలి. ఏదేమైనప్పటికీ  దక్షిణాఫ్రికాతో బౌలర్లు విఫలమయ్యారని అంటున్నా మనం సిరీస్ గెలిచాం కదా.  నిలకడ గురించి మాట్లాడాల్సి వస్తే అక్కడి పరిస్థితులు ఎలా ఉన్నాయనేది కూడా తెలుసుకుని మాట్లాడాలి.  

57

అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయి..? పిచ్ ఎలా సహకరిస్తున్నది..? వంటివి పరిగణనలోకి తీసుకోవాలి. వన్డేలలో  చాలా జట్లు 350 కంటే ఎక్కువ పరుగులు చేసిన సందర్భాలున్నాయి. ఈ మ్యాచ్ లలో బౌలర్లు ధారాళంగా పరుగులిచ్చారు కదా. కానీ  అదే సమయంలో ప్రత్యర్థి జట్ల  బ్యాటర్లు కూడా పోరాడతారు కదా. 

67

ఇండియాలో ఎప్పుడు మ్యాచ్ లు జరిగినా ఏకపక్షంగా జరగవు. పిచ్ ఎలా ఉన్నా మేం పోరాడతాం. ఆ క్రమంలో ఒకట్రెండు మ్యాచ్ లను మేం ఓడిపోయి ఉండొచ్చు. కానీ అత్యధిక మ్యాచ్ లు గెలిచాం. కావున జట్టులో నిలకడ ఉందని నేను భావిస్తున్నా..’ అని  శార్దూల్ తెలిపాడు. 

77

ఇక రాంచీ మ్యాచ్ లో ధోనిని మిస్ అవుతున్నారా..? అని అడిగిన  ప్రశ్నకు  శార్దూల్  సమాధానం చెబుతూ.. ‘అవును. ధోనిని అందరూ మిస్ అవుతున్నారు. ఎందుకంటే అతడికున్న అపారమైన అనుభవం మా అందరికీ చాలా ముఖ్యం. భారత్ కు 300 కంటే  ఎక్కువ వన్డేలు, 90  ప్లస్ టెస్టులు ఆడిన  ధోని వంటి అనుభవజ్ఞుడిని తప్పకుండా మిస్ అవుతాం. ఇలాంటి ఆటడాడు దొరకడం చాలా అరుదు..’ అని  చెప్పాడు. 

click me!

Recommended Stories