మాతో ఆడకపోతే నరకానికి పోతారు! టీమిండియాపై పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్..

Published : Jun 19, 2023, 04:05 PM IST

ఆసియా కప్ 2023 టోర్నీపై ఏడాదిగా కొనసాగుతూ వచ్చిన సస్పెన్స్, ఎట్టకేలకు వీడింది. హైబ్రీడ్ మోడల్‌లో పాక్‌లో నాలుగు మ్యాచులు, మిగిలిన మ్యాచులన్నీ శ్రీలంకలో నిర్వహించబోతున్నట్టు ఆసియా క్రికెట్ కౌన్సిల్ ప్రకటించింది. దీనిపై పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్ ఫైర్ అయ్యాడు...

PREV
15
మాతో ఆడకపోతే నరకానికి పోతారు! టీమిండియాపై పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్..
India vs Pakistan

ఆసియా కప్ 2023 టోర్నీ ముగిసిన తర్వాత ఇండియాలో ఐసీసీ వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నీ ఆడనుంది పాకిస్తాన్. ఇప్పటికి ఇంకా ఐసీసీ వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్ విడుదల కాలేదు కానీ కొన్ని డేట్స్ అయితే లీక్ అయ్యాయి...

25
India vs Pakistan

అక్టోబర్ 15న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ క్రికెట్ స్టేడియంలో ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరగబోతుంటే చెన్నైలో ఆఫ్ఘనిస్తాన్‌తో, బెంగళూరులో ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లు ఆడనుంది పాకిస్తాన్.. 

35

‘ఇరుదేశాల మధ్య క్రికెట్ సంబంధాలు తెగిపోయిన తర్వాత కూడా పాక్ జట్టు, ఇప్పటికే రెండు సార్లు ఇండియాకి వెళ్లింది. ఇప్పుడు ఇండియా, పాకిస్తాన్‌కి రావాల్సిన సమయం వచ్చింది...

45

పాకిస్తాన్ క్రికెట్ స్థాయి పెరిగింది. ఇక్కడ చాలామంది క్వాలిటీ ప్లేయర్లు వస్తున్నారు. ఇరుగుపొరుగు దేశాలు ఎప్పుడూ సహాయ సహకారాలు అందించుకుంటూ స్నేహంగా ఉండాలి. అలా ఉండాలంటే క్రికెట్‌కి మించిన స్నేహపూర్వక సాధనం మరోటి లేదు..

55

భారత జట్టు, ఆసియా కప్ 2023 ఆడేందుకు పాకిస్తాన్‌కి రాకపోతే వాళ్లు నరకానికి పోతారు. ఇండియాలో జరిగే వరల్డ్ కప్‌లో మనం ఆడకూడదు.. మనకి సిగ్గు ఉండాలి కదా...’ అంటూ కామెంట్ చేశాడు పాక్ మాజీ కెప్టెన్ జావెద్ మియాందాద్..
 

click me!

Recommended Stories