ఇది ఓడిపోతే టీమిండియా వరల్డ్ కప్ గెలవలేదు... గౌతమ్ గంభీర్ షాకింగ్ కామెంట్...

First Published Sep 17, 2022, 5:55 PM IST

టీ20 వరల్డ్ కప్ 2022 టోర్నీకి ముందు ఆసియా కప్ 2022 టోర్నీలో సూపర్ 4 స్టేజీ నుంచే నిష్కమించింది భారత జట్టు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా, టైటిల్ ఫెవరెట్‌గా బరిలో దిగిన టీమిండియా... వరుసగా రెండు మ్యాచుల్లో ఓడి ఫైనల్ కూడా చేరలేకపోయింది. టీ20 వరల్డ్ కప్‌కి ముందు ఆరు టీ20 మ్యాచులు ఆడుతోంది భారత జట్టు...

Rohit Sharma and Gautam Gambhir

ఆస్ట్రేలియాతో, సౌతాఫ్రికాతో స్వదేశంలో మూడు మ్యాచుల టీ20 సిరీస్‌లను ఆడబోతోంది భారత జట్టు. సెప్టెంబర్ 20 నుంచి ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్ ప్రారంభం కానుంది. ఈ టీ20 సిరీస్‌లో ఓడిపోతే, టీమిండియా టీ20 వరల్డ్ కప్ గెలవలేదని తేల్చి చెప్పేశాడు భారత మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్...

‘నేను ఈ మాట ఇంతకుముందే చెప్పాను, ఇప్పుడు కూడా చెబుతున్నా. స్వదేశంలో ఆస్ట్రేలియాని ఓడించలేకపోతే టీమిండియా టీ20 వరల్డ్ కప్‌ గెలవడం అసాధ్యం. 2007 టీ20 వరల్డ్ కప్‌ని చూడండి. అప్పుడు మేం ఆసీస్‌ని సెమీ ఫైనల్‌లో ఓడించాం...

ఆ తర్వాత 2011 వన్డే వరల్డ్ కప్‌లో క్వార్టర్ ఫైనల్‌లో ఆసీస్‌ని చిత్తు చేశాం. ఆస్ట్రేలియా అప్పుడు, ఇప్పుడు బలమైన జట్టే. ఆ టీమ్‌లో వరల్డ్ క్లాస్ ప్లేయర్లు పుష్కలంగా ఉన్నారు. ఆస్ట్రేలియాని ఓడిస్తే ఏ టోర్నీ అయినా గెలవచ్చు...’ అంటూ కామెంట్ చేశాడు గౌతమ్ గంభీర్.

అలాగే విరాట్ కోహ్లీ ఓపెనర్‌గా రావాలని వినిపిస్తున్న వాదనను ఖండించాడు గౌతమ్ గంభీర్. ‘కోహ్లీ ఓపెనింగ్ చేయాలనేది వ్యర్థమైన వాదన. రోహిత్ శర్మ, కెఎల్ రాహుల్ ఇద్దరూ అందుబాటులో ఉన్నప్పుడు విరాట్ కోహ్లీ ఓపెనింగ్ చేయలేడు...

ఇందులో ఎలా చర్చకు తావులేదు. అతను నెం.3లో ఆడడమే కరెక్ట్. ఓపెనర్లు 10 ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేస్తే... వన్‌డౌన్‌లో సూర్యకుమార్ యాదవ్‌ని పంపాలి. అప్పుడు అతనైతే సిక్సర్లు బాదుతూ స్కోరుబోర్డును పరుగులు పెట్టించగలడు...

అదే ఓపెనర్లు త్వరగా అవుటైతే విరాట్ కోహ్లీ వన్‌డౌన్‌లో రావాలి... అప్పుడు అతను వికెట్లు పడకుండా అడ్డుకోగలడు. విరాట్ కోహ్లీ క్రీజులో నిలదొక్కుకోవడానికి కాస్త సమయం కావాలి...’ అంటూ కామెంట్ చేశాడు టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్.. 

click me!